ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఉక్రెయిన్ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ‘మీ ప్రభుత్వంపై తిరగబడండి. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి కూలదోయండి. ఉక్రెయిన్ నాయకత్వం ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా. ఉక్రెయిన్ నాయకులు అభినవ నాజీలు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయవద్దు’ అని పుతిన్ పేర్కొన్నారు.
Read More »రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వైరల్ అవుతున్న సమంత పోస్టు
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హాట్ బ్యూటీ సమంత తాజాగా షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. గాయని చిన్మయి ఉక్రెయిన్పై చేసిన పోస్టును సామ్ షేర్ చేసింది. అందులో ‘ఒకవేళ ఇది మీరు చదివితే ప్రపంచంలో శాంతి కోసం ప్రార్థించండి. ఆ ప్రశాంతత ప్రతి ఒక్కరి హృదయాల్లో, ఇళ్లల్లో నిండాలని కోరుకోండి. భూమి మీద ప్రతిఒక్కరూ శాంతి సౌభాగ్యాలతో జీవించే అర్హత కలిగి …
Read More »ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి-ఖర్చులను మేము భరిస్తాం -మంత్రి కేటీఆర్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, …
Read More »రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?
అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో …
Read More »ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.
ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని …
Read More »రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ (యుద్ధం) ప్రకటించారు. ఉక్రెయిన్ సైనికులు వారి ఆయుధాలను వదిలేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరస్ అప్రమత్తమయ్యారు. శాంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐరాస సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయింది.
Read More »