ఇప్పటికే తమ దాడులతో రష్యాకు ముచ్చెమటలు పుట్టిస్తున్న ఉక్రెయిన్ కు మద్ధతుగా అమెరికా ,ఈయూ లాంటి దేశాలు అండగా నిలబడుతున్నాయి. ఉన్నకొద్ది పాటి సైన్యంతో రష్యాకు భారీ నష్టాన్ని మిగిలుస్తుంది ఉక్రెయిన్. ఈ నేపథ్యంలో రష్యా సైన్యం ఉక్రెయిన్ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలిగే విధంగా దాడులు చేసింది. దీంతో ఉక్రెయిన్ దేశ ఉప ప్రధాని ఫెడరవ్ సాయం చేయాలంటూ ఎలాన్ మస్క్ కు ట్వీట్ చేశాడు.వెంటనే స్పందించిన ఎలాన్ …
Read More »రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాక్..?
గత నాలుగు రోజులుగా ఉక్రెయిన్ పై దాడులు చేస్తూ మారణహోమం సృష్టిస్తున్న రష్యాకు అమెరికా,ఈయూ బిగ్ షాకిచ్చాయి. ఇప్పటికే తమ స్థాయికి తగ్గట్లు రష్యా దాడులను తిప్పికొడుతూ ఆ దేశానికి తీరని నష్టాన్ని మిగిలుస్తున్న ఉక్రెయిన్ కు అండగా అమెరికా,ఈయూ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన నిర్ణయాన్ని తీసుకున్నాయి. దీంతో వాణిజ్యం,నగదు బదిలీలకు సంబంధించిన అత్యంతకీలకమైన స్విఫ్ట్ నగదు చెల్లింపుల వ్యవస్థ నుండి …
Read More »రష్యా ఆ ఆస్త్రం ప్రయోగిస్తే ఉక్రెయిన్ మరో నాగసాకి అవుతుందా..?.. దానికంత పవర్ ఉందా..?
నాటోను బూచిగా చూపించి రష్యా దేశం ఉక్రెయిన్ లాంటి చిన్న దేశంపై గత నాలుగురోజులుగా భారీమారణ హోమం సృష్టిస్తున్న సంగతి విదితమే. అయిన కానీ ఉక్రెయిన్ తమ స్థాయికి మించి రష్యా దళాలను ఎదుర్కుంటూ దాడులను తిప్పికొడుతుంది. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ఉక్రెయిన్ పై అణ్వాయుధాలతో దాడులు చేయడానికి సిద్ధంగా ఉండాలని తమ సేనను ఆదేశించినట్లు …
Read More »ఉక్రెయిన్ సైన్యానికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కీలక సూచనలు
ఉక్రెయిన్ పై యుద్ధం ప్రకటించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్.. ఉక్రెయిన్ సైన్యానికి కీలక సూచనలు చేశారు. ‘మీ ప్రభుత్వంపై తిరగబడండి. ఉక్రెయిన్ నాయకత్వాన్ని అధికారం నుంచి కూలదోయండి. ఉక్రెయిన్ నాయకత్వం ఉగ్రవాదులు, డ్రగ్స్ ముఠా. ఉక్రెయిన్ నాయకులు అభినవ నాజీలు. నయా నాజీలకు మానవ కవచాలుగా మీ పిల్లలు, భార్యలు, పెద్దలను ఉండనీయవద్దు’ అని పుతిన్ పేర్కొన్నారు.
Read More »ఉక్రెయిన్ లో ఉన్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోండి-ఖర్చులను మేము భరిస్తాం -మంత్రి కేటీఆర్
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను ఆదుకోవాలని కోరుతూ విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యార్థులను స్వదేశానికి రప్పించేందుకు ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేయాలని కేంద్రానికి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల పూర్తి ప్రయాణ ఖర్చులను భరించడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేటీఆర్ స్పష్టం చేశారు.ఉక్రెయిన్‌లోని తెలంగాణ విద్యార్థులను ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్, …
Read More »రష్యా-ఉక్రెయిన్ విషయంలో భారత్ వైఖరి ఏంటి..?
అమెరికా, రష్యాతో భారత్ కు బలమైన సంబంధాలున్నాయి. చైనాతో మన దేశానికి సరిహద్దుల్లో సంక్షోభం తలెత్తిన వేళ చైనాతో ఉన్న పరపతి ఉపయోగించి పుతిన్ ఆ దేశ దూకుడుకు కళ్లెం వేశారు. అలాగే రష్యా నుంచి మనం పెద్దఎత్తున ఆయుధాలు, క్షిపణులు కొనుగోలు చేస్తున్నాం. మనం ఉక్రెయిన్కు మద్దతు ఇస్తే రష్యాకు కోపం వస్తుంది. అలా అని నేరుగా రష్యాకు సపోర్ట్ చేస్తే అమెరికా, యూరప్ దేశాలకు మంట. దీంతో …
Read More »ఉక్రెయిన్‌లోని ఇండియన్స్ కోసం 24×7 ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్.
ఉక్రెయిన్‌పై రష్యా గురువారం ఉదయం యుద్ధం ప్రారంభించడంతో ఒక్కసారిగా అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయులకు సాయం చేసేందుకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా 24 గంటలు పనిచేసే హెల్ప్‌లైన్‌ను అందుబాటులోకి తెచ్చింది. అక్కడ ఉన్న మనోళ్లు ఎలాంటి సమాచారం, సాయం కావాలన్న ఈ హెల్ప్‌లైన్ ద్వారా అధికారులను సంప్రదించవచ్చు. ఈ విషయాన్ని …
Read More »రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం
రష్యా అధ్యక్షుడు పుతిన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ (యుద్ధం) ప్రకటించారు. ఉక్రెయిన్ సైనికులు వారి ఆయుధాలను వదిలేసి, ఇళ్లకు వెళ్లిపోవాలని హెచ్చరించారు. ఉక్రెయిన్ ను ఆక్రమించే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశారు. పుతిన్ ప్రకటనతో ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటానియో గుటెరస్ అప్రమత్తమయ్యారు. శాంతికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఐరాస సెక్యూరిటీ జనరల్ అత్యవసరంగా భేటీ అయింది.
Read More »