ప్రముఖ నిర్మాత ఆర్.ఆర్.వెంకట్ కన్నుమూశారు. కిడ్నీ సంబంధిత వ్యాధికి చికిత్స పొందుతూ గచ్చిబౌలి ఏఐజీ ఆస్పత్రిలో ఆయన మరణించారు. RR మూవీ మేకర్స్ పతాకంపై వెంకట్ పలు చిత్రాలు నిర్మించారు. సామాన్యుడు, ఆంధ్రావాలా, ఢమరుకం, కిక్, ఆటోనగర్ సూర్య, మిరపకాయ్, బిజినెస్ మ్యాన్, పైసా వంటి చిత్రాలను ఆయన నిర్మించారు. వెంకట్ మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Read More »