కామారెడ్డి జిల్లా మద్నూరు మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మేనూరు హైవేపై కంటైనర్ లారీ కిందకు ఆటో దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కంటైనర్ హైదరాబాద్‌నుంచి గుజరాత్ వెళ్తుండగా.. మద్నూర్ నుంచి బిచ్కుంద వైపు రాంగ్‌రూప్‌లో వస్తున్న ఆటో ఢీకొట్టింది. ఆటో అదుపు తప్పి కంటైనర్ లారీ కిందకు వెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. మృతులు ఏ ప్రాంతానికి చెందినవారనేది తెలియరాలేదు.
Read More »ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం
ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని సుల్తాన్‌పూర్ వద్ద ఓ మినీ బస్సు మరో వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 26 మంది తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించారు. బాధితులంతా ఖమ్మం జిల్లాకు చెందినవారిగా యూపీ పోలీసులు గుర్తించారు. ఖమ్మం జిల్లాకు చెందిన 26 మంది ఓ మినీ బస్సులో అయోధ్య, కాశీ సందర్శనకు ఈ నెల 10న …
Read More »నదిలో పడిపోయినా ఆర్మీ బస్సు.. 7 గురు జవాన్లు మృతి
లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు వెళ్తున్న వాహనం ఓ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో ఏడుగురు సైనికులు మరణించారు. పార్థాపూర్ క్యాంప్ నుంచి హనీఫ్ సబ్ సెక్టార్ వైపు వెళ్తుండగా టుర్టుక్ సెక్టార్ వద్ద ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న ఆర్మీ సహాయక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని గాయపడిన జవాన్లను హాస్పిటల్‌కు తరలించారు. 19 మంది ఆర్మీ జవాన్లు గాయపడినట్లు గుర్తించారు. వీరిలో …
Read More »వాకింగ్ వెళ్తుండగా యాక్సిడెంట్.. సినీ నిర్మాత మృతి
వాకింగ్‌కు వెళ్తుండగా యాక్సిడెంట్ జరిగి ఓ సినీ నిర్మాత మృతచెందారు. ఈ ఘటన బెంగళూరులో చోటుచేసుకుంది. కన్నడ సినీ నిర్మాత బాల్ రాజ్ వాకింగ్ చేసేందుకు జేపీ నగర్‌లోని తన ఇంటి నుంచి బయల్దేరారు. వాకింగ్ చేసేందుకు తన కారు ఆపి రోడ్డు దాటుతుండగా అటుగా వెళ్తున్న ఓ వెహికల్ ఆయన్ను ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స …
Read More »బీబీ నగర్ – టోల్ గేట్ మధ్య రోడ్డు ప్రమాదంపై మంత్రి ఎర్రబెల్లి విచారం
హైదరాబాద్ వరంగల్ ప్రధాన రహదారిపై బీబీ నగర్ టోల్గేట్ మధ్య ఈ తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని ట్రాలీ ఢీ కొట్టిన ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా డ్రైవర్ పక్క సీట్ లో ఉన్న మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం లోని పలు కార్యక్రమాలకు హాజరు కావడానికి అదే దారిలో వెళ్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, …
Read More »వెంటాడిన మృత్యువు.. టైరు పేలి కారును ఢీకొట్టిన బస్సు..
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో కారు కంట్రోల్ తప్పిపోయి చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందగా.. ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ వద్ద చోటుచేసుకుంది. బస్సు టైరు పేలడంతోనే ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, మరో ఇద్దరు …
Read More »గచ్చిబౌలిలో కారు బీభత్సం.. అతివేగమే కొంపముంచింది!
హైదరాబాద్: హోలీ పండగ వేళ భాగ్యనగరంలో విషాదం చోటుచేసుకుంది. అతివేగం ముగ్గురు ప్రాణాలను బలిగొంది. నగరంలోని గచ్చిబౌలిలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఎల్లా హోటల్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందారు. ఎల్లా హోటల్ సమీపంలో రోడ్ల మధ్య చెట్లకు నీరు పెడుతున్న మహేశ్వరమ్మ అనే మహిళను కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద తీవ్రతకు మహేశ్వరమ్మ అక్కడికక్కడే మృతిచెందగా.. అదే వేగంతో వెళ్తూ కారు కూడా …
Read More »DMK MP ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి
తమిళనాడు రాష్ట్ర అధికార పార్టీ అయిన డీఎంకే రాజ్యసభ సభ్యుడు ఇళంగోవన్ కుమారుడు రాకేష్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పుదుచ్చేరి నుంచి చెన్నై వస్తుండగా కారు అదుపుతప్పి డివైడరు ఢీకొట్టింది. ప్రమాదంలో రాకేష్ అక్కడికక్కడే మరణించగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇళంగోవన్ తమిళనాడు సీఎం ఎం.కే స్టాలిన్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన కుమారుడి మరణవార్త తెలియడంతో సీఎం సహా పార్టీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం …
Read More »రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు
తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు రోడ్డు ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. మండలంలోని ఏడో మైలు చెక్‌పోస్ట్ సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరరావు కారు దెబ్బతింది. ఎమ్మెల్యే నాగేశ్వరరావు కారులో హైదరాబాద్ నుంచి ప్రకాశం జిల్లా త్రిపురాంతకం వెళ్తుండగా ఎత్తిపోతల అటవీశాఖ చెక్‌పోస్ట్ సమీపంలోకి రాగానే మాచర్ల వైపు నుంచి సాగర్ వైపు వస్తున్న మరో కారు వేగంగా ఢీ కొట్టింది. రెండు …
Read More »రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని రాజేంద్రనగర్ లో రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని బైక్ ఢీకొన్న ఘటనలో అక్కడికక్కడే ముగ్గురు మృతి చెందారు.. మృతులు ఖమరుద్దీన్, జమీల్, బబ్లూగా గుర్తించారు. అతివేగంగా బైక్ నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు నిర్ధారణ కాగా.. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
Read More »