పశ్చిమ బెంగాల్ సీఎం.. టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ సింగర్ గా మారారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓ పాటను కూడా పాడారు. పక్కన మ్యూజిక్ ప్లే చేస్తుండగా సీఎం మమతా పాటను పాడటం ఆసక్తిగా మారింది. కొంతమంది కోరస్ ఇస్తుండగా సుమారు రెండు నిమిషాలపాటు బెంగాలీలో ఉన్న సాంగ్ను పాడారు. రాష్ట్రానికి నిధుల విడుదలలో కేంద్రం వివక్ష చూపిస్తోందన్న ఆరోపణలతో పాటు ఉపాధిహామీ పథకం నిధులు మంజూరు చేయడం …
Read More »దేశంలో కొవిడ్ ఉద్ధృతి
దేశంలో తాజాగా కొవిడ్ ఉద్ధృతి తీవ్రంగా కొనసాగుతోంది. గడిచిన గత ఇరవై నాలుగంటల్లో కొత్తగా 1,805 మంది కరోనా బారిన పడగా.. మరో ఆరుగురు వైరస్ కారణంగా మృతిచెందారు. దీంతో మొత్తం మృతుల సంఖ్య 5,30,837కు పెరిగింది. మరోవైపు కరోనా పాజిటీవ్ యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ఆందోళనకర స్థాయికి చేరింది. తాజాగా యాక్టివ్ కేసులు 10వేలు దాటాయి. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో నేడు కేంద్రం రాష్ట్రాల …
Read More »కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మోదీ సర్కారు షాక్
కేంద్ర ప్రభుత్వ పరిధిలో సర్కారు కొలువులు చేస్తోన్న ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం షాకిచ్చింది. ఇందులో భాగంగా కాలపరిమితికి మించి డిప్యుటేషన్ పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఇతర శాఖల్లో కొనసాగితే క్రమశిక్షణ చర్యలు తప్పవని బీజేపీ ప్రభుత్వం హెచ్చరించింది. డిప్యుటేషన్లపై సమీక్ష చేయాలని, కాలపరిమితి మించిన తర్వాత డిప్యుటేషన్పై ఉద్యోగులు కొనసాగకుండా చూడాలని అన్ని శాఖలను ఆదేశించింది. రాతపూర్వక అనుమతి ఇస్తే తప్ప …
Read More »రాహుల్ గాంధీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ కి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాని మోదీ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యల కేసులో గుజరాత్ సూరత్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో రాహుల్ గాంధీని దోషిగా తేల్చిన న్యాయస్థానం.. రెండేండ్లు జైలు శిక్ష విధించింది.మోదీ ఇంటి పేరును ఉద్దేశించి కర్ణాటకలో 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా రాహుల్ తీవ్ర విమర్శలు చేశారు. దొంగలందరి ఇంటిపేరు మోదీయే ఎందుకంటూ..? ఆయన …
Read More »మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ మృతి
జాతిపిత మహాత్మాగాంధీ మనవరాలు ఉషా గోకనీ (89) మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మంగళవారం ముంబయిలో కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.ఉషా గోకనీ గత ఐదేండ్లుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. రెండేండ్లుగా మంచానికే పరిమితమయ్యారు. ముంబయిలోని గాంధీ స్మారక నిధి కి గతంలో ఆమె చైర్ పర్సన్‌గా పని చేశారు. గాంధీ స్థాపించిన వార్ధా సేవాగ్రామ్ ఆశ్రమం లో గోకనీ బాల్యం గడిచింది.
Read More »అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి బీజేపీకి రూ.1,161 కోట్లు విరాళం
దేశంలోని ఏడు ప్రధాన జాతీయ పార్టీలకు 2021-2022లో అజ్ఞాత వ్యక్తులు, సంస్థల నుంచి రూ.2,172 కోట్ల ఆదాయం వచ్చిందని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పేర్కొంది. అయితే పార్టీలకు వచ్చిన మొత్తం ఆదాయంలో 66 శాతం వారినుంచే అందినట్లు తెలిపింది. బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీ, ఎన్సీపీ, సీపీఐ, సీపీఎం, నేషనల్ పీపుల్స్ పార్టీలకు ఈ ఆదాయం లభించింది. వీటిలో బీజేపీకే రూ.1,161 కోట్లు వచ్చాయని ADR సంస్థ తెలిపింది.
Read More »ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరో సంచలనం
దేశ రాజధాని మహానగరం ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అరుణ్ రామచంద్ర పిళ్లైని ఈడీ అరెస్టు చేసింది. ఇటీవల అతన్ని ఈడీ రెండు రోజుల పాటు ప్రశ్నించింది. రాబిన్ డిస్టలరీస్ పేరిట సౌత్ గ్రూప్ నుంచి మనీలాండరింగ్ కు పాల్పడినట్లు పిళ్లైపై ఆరోపణలు ఉన్నాయి. కాగా, ఇప్పటివరకు ఈ కేసులో 11 మంది అరెస్టు అయ్యారు.
Read More »మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా
మేఘాలయ సీఎంగా నేషనల్ పీపుల్స్ పార్టీ చీఫ్ కొన్ రాడ్ సంగ్మా వరుసగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. తాజాగా 59 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో NPP 26 చోట్ల గెలిచి అతిపెద్ద పార్టీగా అవతరించింది. ప్రభుత్వ ఏర్పాటుకు మ్యాజిక్ ఫిగర్ 31 సీట్లు కావాల్సి ఉండగా, బీజేపీ (2)తోపాటు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు.
Read More »