టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి టీడీపీ కోవర్టుగా ఉన్నారంటూ వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటైన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్‌కు చంద్రబాబు 28 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసిన విషయం రేవంత్‌కు గుర్తులేదా? అని ప్రశ్నించారు. తన ఇంటికి జగన్ ఎప్పుడూ రాలేదని ఇక కేసీఆర్‌తో మంతనాలు ఎలా జరుపుతారని రోజా అన్నారు. తన ఇంటికి జగన్ ఎప్పుడు వచ్చారో రేవంత్ చెప్పాలని రోజా అన్నారు. తెలుగుదేశం కోవర్టులా …
Read More »బల్దియా అధికారులపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్
బల్దియా అధికారులపై పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పార్లమెంట్, అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పటికీ కౌన్సిల్ మీటింగ్ వర్చువల్‌గా చేయడం వెనుక దరుద్ధేశాలు ఏంటని ప్రశ్నించారు. మీడియాని జీహెచ్ఎంసీలోకి ఎందుకు అనుమతించట్లేదని నిలదీశారు. మేయర్‌ని కలిసి మీడియాని లోపలికి అనుమతించాలని కోరినట్లు తెలిపారు. ‘‘తూతూ మంత్రంగా.. టుత్ పాలిష్‌లాగా …హైదరాబాద్‌ని చెత్త నగరంగా చేస్తున్నారు’’ అని మండిపడ్డారు. 16 పట్టణాల్లో నివాసాయిగ్యమైన ప్రాంతాల్లో హైదరాబాద్ లేదన్నారు. చెత్త నగరంగా హైదరాబాద్‌ని తయారు …
Read More »కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అలక
టీపీసీసీ విషయంలో ఎవరి అభిప్రాయం వాళ్లు చెప్పొచ్చని కాంగ్రెస్ సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి తెలిపారు. సోమవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సమయం, సందర్భం వచ్చినప్పుడు టీపీసీసీపై మాట్లాడతానని చెప్పారు. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ నాయకత్వంలోనే పని చేస్తామని స్పష్టం చేశారు. వి. హనుమంతురావు పార్టీలో చాలా సీనియర్.. వారి ఆవేదన వారిదన్నారు. తనకు టీపీసీసీ ఇవ్వాలని సోనియాగాంధీకి లేఖ రాశానని జగ్గారెడ్డి చెప్పారు. టీపీసీసీ ఇవ్వకుంటే.. వర్కింగ్ ప్రెసిడెంట్ …
Read More »ఢిల్లీలో ఎంపీ రేవంత్ రెడ్డి
టీపీసీసీ అధ్యక్షుడి నియమాకంపై కాంగ్రెస్ అధిష్ఠానం మరో సారి దృష్టి సారించింది. అతి త్వరలో టీపీసీసీపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పంజాబ్ పార్టీలోని వివాదాన్ని పరిష్కరించేందుకు ఏర్పాటైన కమిటీ ఒక ఫార్ములాను రూపొందించిందని, దీన్ని అమలు చేసిన వెంటనే తెలంగాణపై దృష్టి సారించే అవకాశం ఉందని ఢిల్లీలో పార్టీ ముఖ్య నేత కేసీ వేణుగోపాల్ చెప్పారు. కాగా, టీపీసీసీ అధ్యక్ష పదవి ఆశిస్తున్న రేవంత్‌రెడ్డి …
Read More »ఎంపీ రేవంత్ కు భారీ షాక్
దేశంలోనే సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో తెలంగాణ ఎంపీ రేవంత్ రెడ్డికి చుక్కెదురైంది. ఈ కేసు ఏసీబీ పరిధిలోకి రాదు. ఎన్నికల కమిషన్ పరిధిలోకి వస్తుందంటూ హైకోర్టులో ఎంపీ రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఈ పిటిషన్ను విచారించకుండానే హైకోర్టు కొట్టి వేసింది. గతంలో ఏసీబీ కోర్టులో ఇదే పిటిషన్ రేవంత్ రెడ్డి దాఖలు చేయగా అక్కడా ఇదే పరిస్థితి ఎదురైంది. ఇటీవలే ఈ కేసుపై …
Read More »టీపీసీసీ అధ్యక్షుడు ఎవరు..?
తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని ఎన్నికలు ముగిసిన వేళ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి వ్యవహారం మళ్లీ తెరపైకి వస్తోంది. గతంలో TPCC అధ్యక్షుడిగా జీవన్ రెడ్డి పేరును ఖరారు చేసినా.. సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో ప్రక్రియ ఆపేశారు. ఇప్పుడు మళ్లీ ఆ అంశంపై అందరిలో ఉత్కంఠ మొదలైంది. అధిష్టానం నిర్ణయం మార్చుకుందని, రేసులో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్ రెడ్డి, శ్రీధర్ బాబు పేరు కూడా ఉందని …
Read More »తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్
తెలంగాణలో ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియగానే కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే తగిలింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీకి మంచి అండగా ఉన్న మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫోన్ చేసి పార్టీకి రాజీనామా చేసిన విషయాన్ని తెలిపారు. ఏఐసీసీ నుంచి రాష్ట్ర నాయకత్వం వరకూ ప్రభుత్వంతో అమీతుమీ పోరాటం చేయట్లేదన్న అసంతృప్తితోనే ఆయన …
Read More »మంత్రి కేటీఆర్ కు ఎంపీ రేవంత్ సవాల్
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావుకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ,ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుముల రేవంత్ రెడ్డి బహిరంగ సభ లేఖ రాశారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ,ప్రతిపక్ష పార్టీ అయిన బీజేపీ శరీరాలే వేరని, ఆత్మ ఒక్కటేనన్నారు. ఎన్నికలప్పుడు కుస్తీ తర్వాత దోస్తే చేస్తారని ఆరోపించారు. అటు విభజన హామీలు, సాగునీటి ప్రాజెక్టుకు జాతీయ హోదాపై ఢిల్లీ జంతర్ మంతర్ …
Read More »ఎంపీ రేవంత్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ ఎంపీ,ఆపార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రానున్న మూడేళ్ల పాటు తాను రైతుల కోసం ఉద్యమిస్తానని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల అకౌంట్లలో వేస్తున్న సొమ్ము వారి అప్పుల వడ్డీకే సరిపోతుంది తప్ప పెట్టుబడికి సాయపడటం లేదన్నారు. ఫార్మాసిటీ పేరుతో ప్రజల భూములు లాక్కుని ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని మండిపడ్డారు. సీఎం కేసీఆర్ …
Read More »రేవంత్ అరెస్ట్ తప్పదా…?
తెలంగాణ ,ఏపీ రాష్ట్రాల్లో పెనుసంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసు విచారణకు హాజరుకాకపోతే వారెంట్ జారీ చేస్తామని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని ఏసీబీ కోర్టు హెచ్చరించింది. నిన్న విచారణకు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, సెబాస్టియన్ ఉదయ్ సింహ హాజరుకాగా, పాదయాత్రలో ఉన్న రేవంత్ రెడ్డి రాలేదు. ఇవాళ మాత్రం తప్పనిసరిగా హాజరుకావాలని కోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు హైకోర్టు ఆదేశాలతో వీలైనంత వేగంగా విచారణ చేపట్టాలని పేర్కొంది
Read More »