భారతీయ బ్యాంకింగ్ సంస్కరణల పితామహుడు, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఎం.నరసింహం (94) కన్నుమూశారు. కరోనాతో హైదరాబాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు RBI ప్రతినిధి ఒకరు తెలిపారు. 1977 మే నుంచి నవంబర్ మధ్య నరసింహం RBI గవర్నర్ బాధ్యతలు నిర్వర్తించారు. అంతకుముందు ఆర్థిక వ్యవహారాల శాఖ అదనపు కార్యదర్శిగా పనిచేశారు. వరల్డ్ బ్యాంక్, IMFలో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించారు.
Read More »