ఏపీలో ఆరు శాతం నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. 2019లో ఏపీ పోలీసుల పనితీరును వివరించారు. ఏపీలో మహిళాభద్రతకు ప్రధాన ప్రాధాన్యత ఇస్తున్నామని పేర్కొన్నారు. కేవలం రెండు జిల్లాలకే (విశాఖ,తూర్పు) మావోయిస్ట్ కార్యకలాపాలు పరిమితమయ్యాయని తెలిపారు. గుట్కా, ఇసుక, బెల్టుషాపులు, గంజాయిపై ఉక్కుపాదం మోపామని చెప్పారు. సామాన్యులపై ప్రభావం చూపుతున్న జూదం, పేకాట క్లబ్‌లను మూసివేశామని పేర్కొన్నారు. …
Read More »