రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది. రాఖీ …
Read More »సోదరులకు ఎలాంటి రాఖీ కట్టాలి..?
సోదరులకు కట్టే రాఖీలు కొనేందుకు అమ్మాయిలు చాలా కష్టపడుతుంటారు. డిజైన్లు, రంగులు.. ఇలా చాలానే చూస్తారు. కొందరైతే వెండి, బంగారు రాఖీలు కొంటారు. కానీ నూలు దారం, దూది లేదా దారాలతో కలిపి చేతితో చేసిన రాఖీ కట్టడం మన సంప్రదాయమని పండితులు చెబుతున్నారు. పండుగ ఇలాగే మొదలైందట. ప్లాస్టిక్ షీట్లు, రంగుల్లోని రాఖీల ధర ఎక్కువేకాక అవి పర్యావరణానికి హాని చేస్తాయి. అయినా రాఖీ భావన రంగుల్లో కాదు …
Read More »ముఖ్యమంత్రి కేసీఆర్ కి రాఖీ కట్టిన సోదరీమణులు
రక్షాబంధన్ సందర్భంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావుకు ఆయన అక్కలు రాఖీ కట్టారు. ప్రగతిభవన్‌కు సోమవారం వచ్చిన సీఎం అక్కలు లలితమ్మ, సకలమ్మ, లక్ష్మీబాయి, వినోదమ్మ ఆయనకు స్వీట్లు తినిపించి రక్షాబంధన్ కట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్ రక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాఖీ పండుగ అన్నదమ్ములు అక్కాచెల్లెండ్ల ప్రేమ, అనురాగానికి గుర్తుగా నిలుస్తుందన్నారు.
Read More »మంత్రి హారీష్ రావుకు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి హరీష్‌రావుని కొండాపూర్‌లోని ఆయన నివాసంలో కలిసి టీఆర్‌ఎస్ మహిళా నేతలు రాఖీ కట్టారు. రాష్ట్ర ప్రజలకు హరీష్‌రావు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సోదర సోదరీమణుల ఆత్మీయ అనుబంధానికి ప్రతీక అని హరీష్‌రావు పేర్కొన్నారు. కరోనా నేపథ్యంలో ఆత్మీయ రక్ష బంధన్‌తో పాటు, స్వీయ రక్షణ పాటించాలని హరీష్‌రావు సూచించారు.
Read More »మంత్రి కేటీఆర్ కు రాఖీ కట్టిన టీఆర్ఎస్ మహిళ నేతలు
రక్షాబంధన్ సందర్భంగా టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌కు పార్టీ మహిళఆ నేతలు రాఖీ కట్టారు. మంత్రి సత్యవతి రాథోడ్, లోక్‌సభ సభ్యురాలు కవిత మాలోత్, ఎమ్మెల్యే సునీత రెడ్డి, జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతి, టీఆర్ఎస్ మహిళా నాయకురాలు గుండు సుధారాణి తదితరులు మంత్రి కేటీఆర్‌ను ప్రగతి భవన్‌లో కలిసి రాఖీ కట్టారు.
Read More »