ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రూపొందించిన బిల్లులో అభ్యంతరాలు ఉన్నాయంటూ గవర్నర్ తమిళిసై బిల్లును అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ లేవనెత్తిన అభ్యంతరాలపై ప్రభుత్వం వివరణ ఇచ్చింది. ఈమేరకు కాపీని రాజ్‌భవన్‌కు పంపించింది. ఆర్టీసీ కార్మికులకు కార్పొరేషన్ కంటే మెరుగైన జీతాలు ఉంటాయని ప్రభుత్వం అందులో పేర్కొన్నది. విలీనమైన తర్వాత రూపొందించే గైడ్‌లైన్స్‌లో అన్ని అంశాలు ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వ వాటా, 9వ …
Read More »రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేస్తున్నారా?
ప్రముఖ నటుడు రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేందుకు సిద్ధమవుతున్నారా? తెరవెనుక అలాంటి ప్రయత్నాలేమైనా జరుగుతున్నాయా? ఇప్పుడు తమిళనాడులో అలాంటి చర్చే నడుస్తోంది. తమిళనాడు గవర్నర్ ఆర్.ఎన్.రవితో రజనీకాంత్ సమావేశమయ్యారు. చెన్నైలోని రాజ్‌భవన్‌లో సుమారు అరగంటపాటు గవర్నర్‌తో ఆయన పలు అంశాలపై చర్చించారు. దీంతో ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారంటూ ఊహాగానాలు మళ్లీ మొదలయ్యాయి. ఈ విషయంపై మీడియా ప్రతినిధులు రజనీకాంత్‌ను ప్రశ్నించగా ఆయన మర్యాదపూర్వకంగానే గవర్నర్‌ను కలిసినట్లు చెప్పారు. రాజకీయాలపైనా ఇద్దరమూ చర్చించుకున్నామని.. …
Read More »గవర్నర్ తమిళ సై తో భేటీ కానున్న వైఎస్ షర్మిల
వైఎస్ఆర్డీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఈరోజు సోమవారం సాయంత్రం నాలుగు గంటలకు రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలవనున్నారు. తెలంగాణలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఆమె ఈ సందర్భంగా ఫిర్యాదు చేయనున్నారు. రాష్ట్రంలోని వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి సోమవారం పాదయాత్ర ప్రారంభించాలని వైఎస్ షర్మిల భావించినప్పటికీ గవర్నర్ ను కలుస్తున్న దృష్ట్యా మంగళవారానికి వాయిదా వేసుకున్నారు.
Read More »రాజ్‌భవన్‌ను రాజకీయ భవన్‌గా మార్చేశారు: జీవన్‌రెడ్డి
గవర్నర్ తమిళిసై ప్రజాదర్బార్ నిర్వహించడం ప్రజాస్వామ్య విరుద్ధమని.. రాజ్‌భవన్‌ను ఆమె రాజకీయ భవన్‌గా మార్చేశారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి విమర్శించారు. అది ప్రజాదర్బార్ కాదని.. పొలిటికల్ దర్బార్ అని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జీవన్‌రెడ్డి మాట్లాడారు. దేశంలోనే ఎక్కడా లేని సంప్రదాయాన్ని తమిళిసై తీసుకొస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ తమిళిసైకి రాజకీయాలు చేయాలని ఉంటే బండి సంజయ్ స్థానంలో బీజేపీ అధ్యక్షురాలిగా రావాలని ఆయన …
Read More »కేసీఆర్‌ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరు?: ప్రొ.నాగేశ్వర్
తెలంగాణ ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ తమిళిసై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ నాగేశ్వర్ తీవ్రంగా తప్పుబట్టారు. తాను తలచుకుంటే ప్రభుత్వం పడిపోయేదని.. బడ్జెట్ సమావేశాలకు అనుమతివ్వకుండా 15 రోజులు పెండింగ్‌లో పెడితే అసెంబ్లీ రద్దయ్యేదంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు నాగేశ్వర్ ట్వీట్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలు ఎన్నుకున్నారని.. ఆయన్ను ఇంటికి పంపడానికి గవర్నర్ ఎవరని నాగేశ్వర్ ప్రశ్నించారు. …
Read More »గవర్నర్ తనకు తానే అన్నీ ఊహించుకోకూడదు: కేటీఆర్
గవర్నర్ తమిళిసైతో తమకు ఎలాంటి పంచాయతీ లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్, మంత్రి కేటీఆర్ తెలిపారు. సిరిసిల్లలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌తో వివాదంపై తొలిసారిగా స్పందించారు. గవర్నర్ అంటే తమకు గౌరవం ఉందని.. ఆమెను ఎక్కడా తాము అవమానించలేదని చెప్పారు. ఎక్కడ అవమానం జరిగిందో చెప్పాలన్నారు. కౌశిక్‌రెడ్డి విషయంలో రాజకీయ నేపథ్యం ఉందని గవర్నర్ ఆయన్ను ఎమ్మెల్సీగా నియమించేందుకు ఆమోదం తెలపలేదని తెలిసిందన్నారు. తనను ఇబ్బంది పెడుతున్నట్లు తమిళిసై …
Read More »గవర్నర్‌తో సీఎం జగన్ భేటీ.. మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణపై చర్చ!
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌తో సీఎం జగన్‌మోహన్‌రెడ్డి భేటీ అయ్యారు. విజయవాడలోని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణ చేపట్టనున్న నేపథ్యంలో దీనికి సంబంధించిన అంశాలపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. రేపు సాయంత్రం కేబినెట్ భేటీ జరగనుంది. ఆ సమావేశంలో ఎవరెవరిని మంత్రివర్గం నుంచి తప్పిస్తున్నారనే సమాచారాన్ని మంత్రులకు సీఎం వివరించనున్నారు. సీఎం జగన్ నిర్ణయం మేరకు ఈనెల 8న మంత్రులు తమ రాజీనామాలను సమర్పించే …
Read More »టీకాంగ్రెస్ నేతలు అరెస్ట్
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో రాజ్ భవన్ ఘెరావ్ పేరుతో కాంగ్రెస్ చేపట్టిన ఆందోళనలను పోలీసులు నిలువరించారు. నిరసనలను అదుపులోకి తెచ్చేందుకు కాంగ్రెస్ సీనియర్ నేతలు వీహెచ్, పొన్నాలను అరెస్ట్ చేశారు. ఇప్పటికే లుంబినీ పార్క్ వద్దకు భారీగా కాంగ్రెస్ కార్యకర్తలు చేరుకోన్నారు. దీంతో పోలీసులు బందోబస్తు పటిష్టం చేశారు. సంపత్ సహా మరికొంతమంది కాంగ్రెస్ నేతలను సైతం ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు.
Read More »ఒడిశా గవర్నర్ కి కరోనా
ఒడిశా గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్ జీ కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యారు. గవర్నర్‌తోపాటు ఆయన సతీమణి, మరో నలుగురు కుటుంబ సభ్యులకు కరోనా సోకిందని రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. దీంతో వారంతా భువనేశ్వర్‌లోని ఎస్‌యూఎం కోవిడ్ దవాఖానలో చేరారని అధికారులు ప్రకటించారు. ప్రస్తుతం వారి పరిస్థితి బాగానే ఉందని తెలిపారు. కాగా, ఈ మధ్యకాలంలో గవర్నర్ దంపతులను కలిసినవారు కరోనా టెస్టులు చేయించుకోవాలని సూచించారు. కరోనా బారినపడిన …
Read More »గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్ భేటీ
రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ భేటీ అయ్యారు. గవర్నర్‌ను సీఎం కేసీఆర్ కలిసి బడ్జెట్ సమావేశాలకు ఆహ్వానించారు. ఈ నెల 6 నుంచి ప్రారంభం కానున్న శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై ప్రసంగించనున్నారు. కరోనా నియంత్రణ చర్యలను గవర్నర్ దృష్టికి సీఎం కేసీఆర్ తీసుకెళ్లారు. శుక్రవారం ఉదయం 11 గంటలకు అసెంబ్లీ, శాసనమండలి సమావేశాలు మొదలవుతాయి. ఉభయసభల సంయుక్త సమావేశంలో గవర్నర్ …
Read More »