హైదరాబాద్: తెలంగాణ శాసనసభ బడ్జెట్ సమావేశాల తొలిరోజే బీజేపీ ఎమ్మెల్యేలకు ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక మంత్రి హరీష్‌రావు సభలో బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండగా బీజేపీ సభ్యులు ఈటల రాజేదర్, రఘునందన్‌రావు, రాజాసింగ్ పదేపదే అడ్డుతగిలారు. బడ్జెట్ ప్రసంగం సజావుగా సాగేందుకు ఇబ్బంది కావడంతో బీజేపీ ఎమ్మెల్యేలను సభ నుంచి సస్పెండ్ చేయాలంటూ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సభలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీంతో స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి వారిని సస్పెండ్ చేశారు. బడ్జెట్ …
Read More »సీఎం కేసీఆర్ పై రాజాసింగ్ ఫైర్
దేశంలో ఉన్న దళిత సోదరులతో పెట్టుకున్న కేసీఆర్ సర్వనాశనం అయిపోతాడని బీజేపీ ఎమ్మెల్యే రాజసింగ్ శపించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని మార్చే దమ్ము కేసీఆర్‌కు లేదన్నారు. సీఎం కుర్చీలో కూర్చోపెట్టిన దళితులే కేసీఆర్‌ను కిందకు దించుతారని హెచ్చరించారు. బండి సంజయ్ దెబ్బకు కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చారన్నారు. ప్రగతి భవన్ నుంచి ప్రజలు రోడ్డు మీదకు ఈడ్చుతారని కేసీఆర్‌కు అర్థమైందని అన్నారు. తిట్లు తిట్టడం ఎలా అనే పుస్తకాలను మాత్రమే …
Read More »Music Director DSP కి ఎమ్మెల్యే రాజాసింగ్ వార్నింగ్
Tollywood Top Music Director దేవీశ్రీ ప్రసాద్‌కు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. హిందూ సమాజం ఇచ్చే గౌరవాన్ని స్వీకరించటానికి సిద్ధంగా ఉండాలని హెచ్చరించారు. ‘పుష్ప’ సినిమా ఐటమ్ సాంగ్‌లో పదాలను.. దేవుడి శ్లోకాలతో పోల్చటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. దేవీశ్రీ ప్రసాద్ హిందువుల మనోభావాలను కించపరిచారన్నారు. దేవీశ్రీ హిందువులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. టాలీవుడ్ ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా నటించిన …
Read More »మాజీ మంత్రి ఈటల బీజేపీలో చేరికపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన ఈటల రాజేందర్ బీజేపీలో చేరబోతున్నారనే వార్తల నేపథ్యంలో ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని పార్టీలో ఉన్నట్లే బీజేపీలో కూడా గ్రూపులు ఉన్నాయన్నారు. అయితే ఈటలతోపాటు కొందరు టీఆర్ఎస్ నేతలు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పార్టీలో చోటులేదన్నారు. చేరికలను వ్యతిరేకిస్తే వాళ్లకే నష్టమని రాజాసింగ్ అన్నారు. ఈటల బీజేపీలోకివస్తే …
Read More »పోలీసుల అదుపులో బీజేపీ ఎమ్మెల్యే
తెలంగాణ బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజాసింగ్‌తో పాటు పలువురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆవులను వధించకుండా కాపాడేందుకు అదేవిధంగా రవాణా చేయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తు ఎమ్మెల్యే రహదారిపై బైఠాయించి ధర్నాకు దిగారు. గోరక్షకులు, తన మద్దతుదారులతో ఎమ్మెల్యే రోడ్డుపై నిరసన తెలపడంతో ట్రాఫిక్ అసౌకర్యానికి కారణమయ్యారు. దీంతో ఎల్బీనగర్ పోలీసులు అదనపు సిబ్బందితో కలిసివెళ్లి రాజాసింగ్‌ను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read More »ఎమ్మెల్యే రాజాసింగ్ కు కరోనా పరీక్ష..ఫలితం ఏమంటే…?
ఎమ్మెల్యే రాజాసింగ్ గన్‌మెన్‌కు కరోనా పరీక్ష చేయగా పాజిటీవ్‌గా నిర్ధారణ అవ్వడంతో.. రాజాసింగ్, ఆయన కుటుంబ సభ్యులు కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ రిపోర్టులు తాజాగా విడుదల అయ్యాయి. ఎమ్మెల్యే గన్‌మెన్‌కు పాజిటీవ్ అని తేలడంతో ఇటీవల ఎమ్మెల్యేను కలిసిన వారు, సన్నిహితుల్లోనూ ఆందోళన గురయ్యారు. రాజాసింగ్ కుటుంబం హోం క్వారంటైన్ అయ్యింది. ఈ విషయాన్ని రాజాసింగే ట్వీటర్ ద్వారా తెలియజేశారు.
Read More »అడ్డంగా బుక్ అయిన ఎమ్మెల్యే రాజాసింగ్..!
తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకుడు, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తనకు తానే రాయితో కొట్టుకున్నాడని, వీడియోలో స్పష్టంగా కనబడుతున్నదని పశ్చిమ మండల డీసీపీ శ్రీనివాస్ స్పష్టం చేశారు. గోషామహల్ నియోజకవర్గ పరిధిలోని జుమ్మెరాత్ బజార్‌లో నిన్న రాత్రి స్వాతంత్య్ర సమరయోధురాలు రాణి అవంతి బాయ్ లోథ్ విగ్రహాన్ని ప్రతిష్టించేందుకు కొందరు యువకులు ప్రయత్నించారని డీసీపీ తెలిపారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విగ్రహా ప్రతిష్టాపనను అడ్డుకున్నారు. ఈ …
Read More »పాతబస్తీ ఎమ్మెల్యే ఇంట్లో….మహిళలు..!
బాలీవుడ్ మూవీ పద్మావతి వివాదం రోజు రోజుకు ముదురుతుంది. కొద్దికాలం క్రితం వరకు ఈ తరహా నిరసనలు రాజస్థాన్‌లో మాత్రమే ఉండగా..ప్రస్తుతం ఆ ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా పక్క ప్రాంతాలలోను వివాదాలకు ఆధ్యంగా మారుతోంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించి బీజేపీ ఎంపీ చింతామణి మాలవ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది. సినిమా కుటుంబాల్లో ఉండే ఆడవాళ్లు రోజుకో భర్తను మారుస్తారని, అలాంటి వాళ్లకు తన …
Read More »సోనియా లవ్‌స్టోరీని సినిమా తీస్తే…
హైదరాబాద్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ మరోమారు కలకలం రేకెత్తించే కామెంట్లు చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజ్‌పుత్ కర్ణసేన అధ్యక్షుడు లోకేందర్ సింగ్ కల్వితో కలిసి మాట్లాడారు. రాజ్‌పుత్‌ల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ తెరకెక్కించిన పద్మావతి చిత్రాన్ని వెంటనే బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు. రాజస్థాన్‌లో పద్మావతిని దేవతలా పూజిస్తారని, కాని దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ పూర్తిగా చరిత్రను వక్రీకరిస్తూ సినిమాను తీశారన్నారు. …
Read More »