తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన గోషామహల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే రాజాసింగ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో నిన్న శుక్రవారం బీజేపీ, అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ కు చెందిన కార్యకర్తలకు గొడవ జరిగింది. ఈ గొడవలో కొంతమంది బీజేపీ నాయకులకు గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని పరామర్శించేందుకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఎల్లారెడ్డి పేటకు వెళ్తుండగా మార్గమధ్యలో అడ్డుకున్న అల్వాల్ …
Read More »ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు
ప్రతిపక్షాలకు పనిలేక సీఎం కేసీఆర్‌పై ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేస్తున్నారని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఇతర రాష్ట్రాల్లో అమలవుతున్నాయా? దమ్ముంటే చూపించాలని ప్రతిపక్షాలకు కేటీఆర్ సవాల్ విసిరారు.ముస్తాబాద్‌లో డబుల్ బెడ్రూం ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ అమలు చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఈ దేశానికే దిక్సూచిగా మారుతున్నాయని …
Read More »సీఎం KCR మాటతో సిరిసిల్ల రైతు కొత్త బాట
వరి ధాన్యం కొనబోమని కేంద్రం కొర్రీలు పెడుతుండటంతో రాష్ట్ర సర్కారు అన్నదాతలను ఆదాయం వచ్చే పంటల వైపు మరల్చేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి.రాజన్న సిరిసిల్ల జిల్లా రైతులు పంట మార్పిడికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ముస్తాబాద్ మండలంలోని మోహినికుంట, మొర్రాయిపల్లె గ్రామాలకు చెందిన సుమారు 500 మంది రైతులు కొత్త పంటల సాగుకోసం ప్రణాళికలు వేసుకుంటున్నారు. తాజాగా తంగళ్లపల్లి, ఇల్లంతకుంట మండలాల్లోని పలువురు రైతులు పంట మార్పిడి చేసుకుంటున్నారు. ఆరుతడి …
Read More »ఉమ్మడి కరీంనగర్‌లో ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలి- సీఎం కెసిఆర్
గోదావరి నదీ జలాలు ఒరుసుకుంటూ పోతున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రతి గ్రామము, ప్రతి ఎకరం గోదావరి జలాలతో అనుసంధానం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు.కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం అనంతరం సిరిసిల్ల జిల్లా తెలంగాణ జలకూడలిగా మారిందన్నారు. సిరిసిల్ల సహా కరీంనగర్ ఉమ్మడి జిల్లా నియోజకవర్గాల పరిధిలో ఏ మూలన సాగునీటి సమస్య ఉత్పన్నం కాకూడదని సీఎం తేల్చి చెప్పారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా పలు …
Read More »సిరిసిల్లలో డబుల్ బెడ్రూం ఇండ్లను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను సీఎం కేసీఆర్ ఆదివారం ప్రారంభించారు. అంతకు ముందు రోడ్డు మార్గం ద్వారా హైదరాబాద్ నుంచి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి జిల్లాకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు అధికారులు, స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. హైదరాబాద్ నుంచి మొదట నేరుగా మండేపల్లికి చేరుకున్న సీఎం కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్ల శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. …
Read More »ఐడీటీఆర్ ను ప్రారంభించిన సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డ్రైవింగ్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్ సెంటర్ (ఐడీటీఆర్)ను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా పర్యటనలో ఆయన పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా జిల్లాకు చేరుకున్నారు. మొదట తంగళ్లపల్లి మండలం మండేపల్లి వద్ద డబుల్ బెడ్రూం ఇండ్లకు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం లబ్ధిదారులు ఇండ్ల పట్టాలు పంపిణీ చేసి, …
Read More »ఆదర్శంగా రాజన్న సిరిసిల్ల జిల్లా
రాజన్న సిరిసిల్ల జిల్లాను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఐటీ, మున్సిపల్‌శాఖల మంత్రి కే చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అన్ని హంగులతో సమీకృత కలెక్టరేట్ భవనం పూర్తయిందని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే జిల్లాలో పర్యటిస్తారని చెప్పారు. సోమవారం మంత్రి కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో ఆకస్మికంగా పర్యటించారు. అంతర్జాతీయ డ్రైవింగ్ స్కూల్, టెక్స్‌టైల్స్‌పార్కు నుంచి డబుల్‌బెడ్రూంఇండ్లకు వెళ్లేందుకు నిర్మిస్తున్న వందఫీట్ల రహదారి నిర్మాణం తదితర పనులను పరిశీలించిన ఆయన నర్సింగ్ కళాశాల …
Read More »