తెలంగాణ వ్యాప్తంగా గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలు జనజీవనాన్ని స్తంభింపజేస్తున్నాయి. పలు జిల్లాల్లో నదులు, చెరువుల్లోకి వరదనీరు చేరడంతో ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం జిల్లాల్లో గోదావరి ఉగ్రరూపం దాలుస్తోంది. మరో రెండు మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని ఇప్పటికే వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రానున్న ఐదు గంటల్లో ఐదు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ …
Read More »రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »హైదరాబాద్‌లో మూడు రోజులు అతి భారీ వర్షాలు
హైదరాబాద్ నగరవాసులకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రానున్న మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. నగర వ్యాప్తంగా శుక్రవారం ఉదయం నుంచే వర్షం పడుతోంది. నగరంతో పాటు తెలంగాణలోని 14 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని స్పష్టం చేసింది. భారీ వర్షాలు కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంత ప్రజలు సురక్షిత ప్రాంతాలకు …
Read More »హైదరాబాద్‌కు భారీ వర్షసూచన..త్వరగా ఇళ్లకు చేరుకోండి..
రానున్న ఒకట్రెండు గంటల్లో హైదరాబాద్ నగర పరిధిలో భారీ వర్షం కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది. నైరుతి రుతుపవనాలు తెలంగాణలో ప్రవేశించిన నేపథ్యంలో సోమవారం నుంచే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడ్డాయి. హైదరాబాద్ సిటీలోని సోమవారం రాత్రి వర్షం కురిసింది. మంగళవారం కూడా భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ తెలపడంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది అప్రమత్తమయ్యారు. నగరంలోని ఉద్యోగులు, ప్రజలు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. మరోవైపు సహాయ …
Read More »తెలంగాణకు మూడురోజుల వర్షసూచన
ఎండవేడిమి, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు కాస్త రిలీఫ్ ఇచ్చే వార్త ఇది. రానున్న మూడు రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా వర్షాలు పడతాయని.. పలుచోట్ల ఈదరుగాలులు కూడా వీచే అవకాశముందని పేర్కొంది. మరోవైపు ఈనెల 6, 7 తేదీల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వీలుందని.. మూడు డిగ్రీల వరకు పెరగొచ్చని …
Read More »హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. ఉక్కపోత నుంచి కాస్త రిలీఫ్
ఎండల వేడి, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న హైదరాబాద్ వాసులకు కాస్త ఉపశమనం లభించింది. నగరంతో పాటు చుట్టుపక్కల పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురిశాయి. సికింద్రాబాద్, ఈస్ట్ మారేడ్‌పల్లి, వెస్ట్ మారేడ్‌పల్లి,తిరుమలగిరి, అల్వాల్, బోయిన్‌పల్లి, చిలకలగూడ,బేగంపేట్, లంగర్‌హౌస్, కార్వాన్, గోల్కొడ ప్రాంతాల్లో వర్షం పడింది. ఆర్టీసీ క్రాస్‌రోడ్డు, ముషీరాబాద్, చిక్కడపల్లి, కవాడిగూడ, విద్యానగర్, భోలక్‌పూర్, బీఆర్కే భవన్, ట్యాంక్‌బండ్, ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, హిమాయత్‌నగర్ మొదలైన చోట్ల …
Read More »తౌక్టే తుపాను బీభత్సం
తౌక్టే తుపాను ధాటికి బాంబే హై తీరంలో కొట్టుకుపోయిన P-305 నౌకలో 26 మంది సిబ్బంది మరణించారు. వారి మృతదేహాలను గుర్తించారు. మరో 49 మంది ఆచూకీ తెలియట్లేదు. వారి కోసం నేవీ, కోస్ట్ గార్డు సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. సోమవారం కొట్టుకుపోయిన ఈ నౌకను ముంబైకి 35 నాటికల్ మైళ్ల దూరంలో గుర్తించారు. నౌకలో మొత్తం 261 మంది ఉన్నారని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 186 మందిని …
Read More »వరద సాయం కోసం మీ సేవ కేంద్రాలకు వెళ్లొద్దు : GHMC కమిషనర్
వరద సాయం కోసం బాధితులు మీ సేవ సెంటర్లు వెళ్లాల్సిన అవసరం లేదని గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ లోకేశ్‌కుమార్ తెలిపారు. జీహెచ్ఎంసీ బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటించి ఇంకా వరదసాయం అందని వారి వివరాలను సేకరిస్తున్నాయని పేర్కొన్నారు. బాధితుల వివరాలు, ఆధార్ నెంబర్ ధ్రువీకరణ జరుగుతోందని, తర్వాత వారి అకౌంట్‌లోనే నేరుగా వరద సాయం డబ్బులు జమవుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీ నుంచి వరద సహాయం …
Read More »విద్యుత్ శాఖ అప్రమత్తంగా ఉండాలి : సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు బుధవారం సమీక్షించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షిస్తూ అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజలను కూడా విద్యుత్ విషయంలో అప్రమత్తం చేయాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని, పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా …
Read More »తెలంగాణకు వర్ష సూచన
రెండు రోజుల్లో రాష్ట్రంలో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తా ఆంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతుందని, అలాగే నైరుతి రుతుపవనాలు సైతం చురుగ్గా కదులుతున్నాయని వీటితో ప్రభావంతో రాబోయే రెండు రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా తేలికపాటి వర్షాలు, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. …
Read More »