కాంగ్రెస్ సీనియర్ నేత, పార్టీ ట్రబుల్ షూటర్ అహ్మద్ పటేల్ కన్నుమూశారు. అక్టోబర్ 1న ఆయన కరోనా బారినపడ్డారు. దీంతో గురుగ్రామ్‌లోని మేదాంత దవాఖానలో నెల రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. కాగా, ఆయన అవయవాలు చికిత్సకు సహకరించక పోవడంతో ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటలకు మరణించారు. ఈమేరకు ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాంగాధీకి ఆయన సుదీర్ఘకాలం రాజకీయ సలహాదారుగా పనిచేశారు. …
Read More »మళ్లీ కాంగ్రెస్ లో చేరతా -మాజీ ఎంపీ
‘నేను తిరిగి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నా. ఉత్తరప్రదేశ్‌లో దళిత బాలికపై అత్యాచారం, హత్య కేసులో బాధితులకు అండగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, ప్రియాంక చేసిన పోరాటం చూస్తుంటే ఇందిరాగాంధీ రోజులు గుర్తుకొస్తున్నాయి. దేశంలో పేద, దళిత, మైనారిటీ ప్రజలకు అండగా ఉండేది.. ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ ఒక్కటే’ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ పేర్కొన్నారు. ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. హీరోలా 120 కిలోమీటర్ల దూరం నడిచి …
Read More »ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా
ఏఐసీసీ అధ్యక్ష పదవికి సోనియాగాంధీ రాజీనామా చేశారు. ఇవాళ ఉదయం 11గంటలకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమైంది. ఈ సందర్భంగా సమావేశంలో తన రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అధ్యక్ష పదవి తనకు ఆసక్తి లేదని ఈ సందర్భంగా సోనియాగాంధీ తెలిపారు. మరో అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సభ్యులకు సూచించారు. సోనియా రాజీనామాను సభ్యులకు కేసీ వేణుగోపాల్ చదివి వినిపించారు. ఈ సందర్భంగా అధ్యక్ష పదవికి సోనియా మాజీ …
Read More »ఆసుపత్రి నుండి సోనియా గాంధీ డిశ్చార్జ్
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఆరోగ్య పరీక్షల నిమిత్తం జూలై 30 గురువారం రోజున న్యూఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండటంతో ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయినట్లు ఆస్పత్రి చైర్మన్ డీఎస్ రాణా తెలిపారు.
Read More »ఇందిరను ముందే హెచ్చరించిన పీవీ
పీవీ నరసింహారావు హోంమంత్రిగా ఉన్న సమయంలోనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ హత్య జరిగింది. దీంతో హోంమంత్రిగా పీవీ విఫలమయ్యారంటూ ఆయనపై విమర్శలొచ్చాయి. వాస్తవానికి ప్రధాని అంతర్గత భద్రత పూర్తిగా ప్రధాని చేతిలోనే ఉంటుంది. ఇందులో హోంమంత్రికి పెద్దగా అధికారాలుండవు. అయినప్పటికీ ప్రధాని తన భద్రతా విభాగంలో కొందరిని పెట్టుకోవడంపై ఇందిరాగాంధీని పీవీ ముందే హెచ్చరించారు. కొందరు అనుమానాస్పదంగా కనిపిస్తున్నారని హెచ్చరించారు. అయినప్పటికీ ఇందిరాగాంధీ వినలేదు. అంతేగానీ ఇందిర హత్య విషయంలో …
Read More »ఎవరు సింధియా.. ఎందుకు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాడు..?
18ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలందించిన సింధియా మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ వైఖరితో బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు.దీంతో ప్రధాని నరేంద్ర మోదీని కలిసిన తర్వాత జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా తన రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి పంపారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు లేఖలో పేర్కొన్న సింధియా కీలక అంశాలను లేఖలో పేర్కొన్నారు. ‘కాంగ్రెస్‌లో ఉండి దేశానికి ఏమీ …
Read More »కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా కొత్త పేరు..!
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం ఇటీవల విడుదలైన ఢిల్లీ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖాతా తెరవని విషయం తెల్సిందే. ఈ ఎన్నికల్లో ఆప్ అరవై రెండు స్థానాల్లో.. బీజేపీ ఎనిమిది స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. అయితే గత పార్లమెంట్ ఎన్నికల దగ్గర నుండి ఇప్పటివరకు జరిగిన ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమిని కొనసాగిస్తూ.. ఆ పార్టీ ప్రతిష్టను రోజురోజుకు దిగజార్చుకుంటుంది. ప్రస్తుతం ఢిల్లీ …
Read More »ఉత్తమ్ సంచలన నిర్ణయం
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు.. నల్లగొండ పార్లమెంట్ సభ్యులు.ఆ పార్టీ సీనియర్ నేత ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిన్న మంగళవారం జిల్లాలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ” నాకు పార్టీలో ఎవరూ సహాకరించడంలేదు. సొంత నియోజకవర్గానికి చెందిన నేతలకు.. కార్యకర్తలకు సమయం కేటాయించలేకపోతున్నాను. పార్టీలోసం.. పార్టీ అభ్యున్నతికై అహర్నిశలు …
Read More »రాహుల్ కు పీకే దిమ్మతిరిగే రిప్లై
అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు,ఎంపీ రాహుల్ గాంధీకి ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త,జేడీయూ ఉపాధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ ఒకవైపు కృతజ్ఞతలు చెబుతూనే మరోవైపు ఘాటుగా రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), జాతీయ పౌరుల జాబితా (ఎన్‌ఆర్సీ)లకు వ్యతిరేకంగా జరుతున్న ‘ప్రజాందోళన’కు రాహుల్ మద్దతుగా నిలవడంపై పీకే హర్షం వ్యక్తం చేశారు. అయితే ఇది మాత్రమే సరిపోదనీ.. కాంగ్రెస్ పాలిత …
Read More »మనది ఇందిరా కాంగ్రెస్సా.. వైఎస్సార్ కాంగ్రెస్సా-వీహెచ్ సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… సీనియర్ మాజీ రాజ్యసభ సభ్యులు.. మాజీ పీసీసీ చీఫ్ వి హన్మంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో వీహెచ్ మాట్లాడుతూ ప్రస్తుత రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ నాయకత్వాన్ని ప్రశ్నించారు. ఇటీవల రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో పంజాగుట్ట సర్కిల్లో ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగించిన సంగతి విదితమే. ఆ సమయంలో వీహెచ్ కేసీఆర్ సర్కారును ప్రశ్నించారు. …
Read More »