కాంగ్రెస్ పార్టీకి వలసల పర్వం షాకిస్తున్న నేపధ్యంలో పంజాబ్, చత్తీస్‌ఘఢ్ అనుభవాల తర్వాత తాజాగా మేఘాలయలో ఆ పార్టీకి సంక్షోభం ఎదురుకానుంది. సీనియర్ నేత, మాజీ సీఎం ముకుల్ సంగ్మా కాంగ్రెస్‌ను వీడనున్నారనే ప్రచారం ఊపందుకుంది. సంగ్మాతో పాటు దాదాపు 12 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌ను వీడి తృణమూల్ కాంగ్రెస్‌లో చేరతారని సమాచారం. తృణమూల్ కాంగ్రెస్ ఈశాన్య రాష్ట్రాల్లో పాగా వేసే దిశగా మేఘాలయలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో …
Read More »రైతులకు మద్దతుగా రాహుల్ గాంధీ
వ్యవసాయ చట్టాల రద్దును డిమాండ్ చేస్తూ సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) సోమవారం ఇచ్చిన భారత్ బంద్ పిలుపునకు రైతు సంఘాలు, ప్రజా సంఘాలు సహా పలు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. రైతుల నిరసనలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మద్దతు పలుకుతూ నరేంద్ర మోదీ సర్కార్ దోపిడీ విధానాలను అనుసరిస్తోందని మండిపడ్డారు.రైతులు అహింసా మార్గంలో సత్యాగ్రహం సాగిస్తుంటే ఈ దోపిడీ సర్కార్ పట్టించుకోకపోవడంతో ఈరోజు భారత్ బంద్ …
Read More »లై డిటెక్టర్ టెస్టులకు రేవంత్ సిద్ధమా-మంత్రి KTR
కావాలనే కొంత మంది ఉద్దేశపూర్వకంగా తనపై దుష్ప్రచారం చేస్తున్నారు అని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టపరమైన చర్యలకు కోర్టును ఆశ్రయిస్తున్నానని పేర్కొన్నారు. న్యాయస్థానంలో పరువు నష్టం దావా దాఖలు చేశానని తెలిపారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై కోర్టు చర్యలు తీసుకుంటుందని విశ్వసిస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్‌పై కేటీఆర్ ఘాటుగా స్పందించిన విషయం విదితమే. తాను ఎలాంటి …
Read More »పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ
పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్ జిత్ సింగ్ చన్నీ సోమవారం ఉదయం 11 గంటలకు ప్రమాణస్వీకారం చేశారు. తనకు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ మద్దతు తెలిపారని చరణ్జిత్ సింగ్ తెలిపారు. అటు కొత్త సీఎంకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కంగ్రాట్స్ చెప్పారు. పంజాబ్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆకాంక్షించారు. ప్రజల విశ్వాసాన్ని కొనసాగించడం చాలా ముఖ్యమని సూచించారు.
Read More »పంజాబ్ సీఎం రాజీనామా
పంజాబ్ కాంగ్రె్‌సలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌సింగ్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్‌ను కలిసి రాజీనామా పత్రాన్ని సమర్పించారు. పంజాబ్ అసెంబ్లీకి మరో నాలుగు నెలల్లోనే ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సీఎం పదవి నుంచి అమరీందర్ వైదొలగడం ప్రాధాన్యం సంతరించకుంది. అయితే పార్టీలో అవమానాలు భరించలేకే రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు అమరీందర్‌సింగ్ ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కాంగ్రెస్ …
Read More »మాణిక్యం ఠాగూర్‌కు మంత్రి కేటీఆర్ చురకలు
ఏఐసీసీ నాయకుడు మాణిక్యం ఠాగూర్ చేసిన ట్వీట్‌పై రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ, ఆయనకు చురకలంటించారు. కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌ను పరుష పదజాలంతో విమర్శించిన రేవంత్ రెడ్డి ఆడియో క్లిప్ బయటపడిన నేపథ్యంలో.. దాన్ని ఉద్దేశించి ఠాగూర్ ట్వీట్ చేశారు. ఓ సంభాషణను జర్నలిస్టు రికార్డు చేసి, దాన్ని అధికారంలో ఉన్న వారికి పంపితే, అలాంటి జర్నలిస్టుల గురించి ఏం ఆలోచించాలి? అని ఠాగూర్ ప్రశ్నిస్తూ.. …
Read More »హ్యాపీ బర్త్‌డే.. మోదీ జీ- ట్విట్టర్లో రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీకి ఇవాళ 71 ఏళ్లు నిండాయి. ఈ సందర్భంగా ఆయనకు బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కూడా గ్రీట్ చేశారు. హ్యాపీ బర్త్‌డే, మోదీజీ అంటూ రాహుల్ తన ట్విట్టర్‌లో తెలిపారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కూడా మోదీకి బర్త్‌డే విషెస్ చెప్పారు. సుదీర్ఘ కాలం ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
Read More »కాంగ్రెస్ పార్టీకి షాక్
కాంగ్రెస్ పార్టీకి మాజీ ఎంపీ, మహిళా విభాగం అధ్యక్షురాలు సుస్మితా దేవ్ రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి లేఖను పంపారు. ఆమె రాజీనామాతో పార్టీకి ఎదురుదెబ్బ అని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. సుస్మితా దేవ్ 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై అసోంలోని సిల్చార్ స్థానం నుంచి పోటీ చేసి ఎంపీగా గెలుపొందారు. తర్వాత ఆమెకు పార్టీ అధిష్ఠానం ఆల్ ఇండియా మహిళా …
Read More »రాహుల్ గాంధీ ట్విట్టర్ అకౌంట్ అన్‌లాక్
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తో పాటు ఆ పార్టీకి చెందిన ఇతర నేతల అకౌంట్లను.. ట్విట్టర్ సంస్థ అన్‌లాక్ చేసింది. ఇటీవల ఢిల్లీలో రేప్, హత్యకు గురైన ఓ తొమ్మిదేళ్ల బాలిక ఫ్యామిలీ ఫోటోను ట్వీట్ చేసిన నేపథ్యంలో రాహుల్‌తో పాటు ఆ పార్టీ నేతల అకౌంట్లను ట్విట్టర్ సంస్థ తాత్కాలికంగా లాక్ చేసిన విషయం తెలిసిందే. అయితే శుక్రవారం రాహుల్ .. ట్విట్టర్‌పై విరుచుకుపడ్డారు. భారతీయ రాజకీయ …
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
వచ్చే ఏడాదిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. మణిపూర్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (ఎంపీసీసీ) అధ్యక్షుడు గోవిందాస్ కొంతౌజాం రాజీనామా చేశారు. పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలతో కలిసి ఆయన అధికార బీజేపీ పార్టీలో చేరనున్నారు. బిష్ణుపూర్ నుంచి వరుసగా ఆరుసార్లు ఎన్నికైన గోవిందాస్‌ను మణిపూర్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా సోనియా గాంధీ గతేడాది డిసెంబర్‌లో నియమించారు. 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. …
Read More »