కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »మరోకసారి సంచలనం సృష్టించిన ఎంపీ సుబ్రమణియన్ స్వామి
ప్రస్తుత కరోనా పరిస్థితులు అదుపులోకి వచ్చే వరకు ప్రజలకు ఇన్కమ్ ట్యాక్స్ ను రద్దు చేయడం మంచిదని రాజ్యసభ ఎంపీ సుబ్రమణియన్ స్వామి అభిప్రాయపడ్డారు. రానున్న ఆర్థిక సంవత్సరం మొదటి రోజే ఈ నిర్ణయం ప్రకటిస్తే ఆర్థిక ప్రగతికి బలం ఇచ్చినట్లు అవుతుందన్నారు. ట్యాక్సేషన్ బదులుగా ప్రత్యామ్నాయ మార్గాల్లో వనరుల్ని పెంచుకోవచ్చని గతంలోనూ ప్రభుత్వానికి సూచించానని తెలిపారు.
Read More »ఇప్పటికిప్పుడు లోక్ సభ ఎన్నికలోస్తే గెలుపు ఎవరిది..?
ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు జరిగితే ఎన్డీయే తిరిగి అధికారంలోకి వస్తుందని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో వెల్లడైంది. 543 స్థానాలున్న లోక్సభలో ఎన్డీయేకు 296, యూపీఏకు 127, ఇతరులు 120 స్థానాలు దక్కుతాయని జోస్యం చెప్పింది. ఇందులో ఒక్క బీజేపీకే 271 స్థానాలు, కాంగ్రెస్కు 62, మిగతా పార్టీలకు 210 స్థానాలు దక్కుతాయని వెల్లడించింది.
Read More »కాంగ్రెస్ లోకి ఎంపీ డీఎస్
తెలంగాణ ప్రాంతానికి చెందిన రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ త్వరలో సొంతగూటికి వెళ్లనున్నారు. ఈనెల 24న సోనియాగాంధీ సమక్షంలో కాంగ్రెస్లో చేరే అవకాశం కనిపిస్తోంది. గతంలో P.C.C అధ్యక్షుడిగా, మంత్రిగా కాంగ్రెస్లో కీలక పాత్ర పోషించిన ఆయన 2015లో తెరాసలో చేరారు. తెరాస నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన డీఎస్.. కొంత కాలంగా పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మళ్లీ కాంగ్రెస్లో చేరాలని నిర్ణయించుకున్నారు.
Read More »ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read More »బిపిన్ రావత్‌కు రాహుల్‌గాంధీ నివాళులు
తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్‌కు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఘనంగా నివాళులు అర్పించారు. బిపిన్ రావత్, ఆయన సతీమణి మధూలిక రావత్ భౌతిక కాయాలపై పుష్పగుఛ్చాలుంచి అంజలి ఘటించారు. అదేవిధంగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఉత్తరాఖండ్ మాజీ ముఖ్యమంత్రి హరీష్ రావత్ కూడా బిపిన్ రావత్ దంపతులకు నివాళులు అర్పించారు.
Read More »కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ
కాంగ్రెస్ పార్టీకి మేఘాలయ రాష్ట్రంలో ఎదురుదెబ్బ తగిలింది. మేఘాలయలో ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఎంసీలో చేరారు. వీరిలో మాజీ సీఎం ముకుల్ సంగ్మా కూడా ఉండటం గమనార్హం. మేఘాలయ అసెంబ్లీలో 60 సీట్లు ఉండగా కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం 17 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో తాజాగా 12 మంది ఎమ్మెల్యేలు గుడ్బై చెప్పారు. దీంతో టీఎంసీ ప్రధాన ప్రతిపక్షంగా అవతరించింది.
Read More »అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ హావా
పశ్చిమ బెంగాల్ లో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నికల్లో తృణమూల్ పార్టీ దుమ్మురేపుతోంది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లోనూ ఆ పార్టీ భారీ ఆధిక్యంతో దూసుకెళ్లుతోంది. అధికార తృణమూల్ పార్టీకి బీజేపీ ఇవ్వలేకపోయింది. కూచ్‌బిహార్ జిల్లాలోని దిన్‌హటా స్థానంలో టీఎంసీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. బీజేపీ స్థానమైన దిన్‌హటాలో ఈసారి టీఎంసీ తరపున ఉదయన్ గుహ పోటీలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్తి అశోక్ మండల్‌పై .. ఉదయన్ సుమారు లక్షన్నర ఓట్ల మెజారిటీతో …
Read More »భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం
భారతీయ జనతా పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. హిమాచల్ ప్రదేశ్ ఉప ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేసిన అన్ని సీట్లను కోల్పోయింది. మండి లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. ఆ పార్టీ అభ్యర్థి ప్రతిభా సింగ్.. బీజేపీ అభ్యర్థి కుషాల్ ఠాకూర్‌పై గెలుపొందారు. దాదాపు పది వేల ఓట్ల మెజారిటీతో బ్రిగేడియర్ కుషాల్ ఓటమి పాలయ్యారు. ఇక ఫతేపూర్, ఆర్కీ, జుబ్బల్ అసెంబ్లీ స్థానాలను …
Read More »