పుట్టిన పసిగుడ్డు లోకాన్ని చూడకముందే కత్తిగాటు పెడితే? అది నేరం మాత్రమే కాదు మహా పాపం. ఆ పాపానికి ఒడిగట్టినవారు క్షమించమని అడుగాల్సింది పోయి.. తప్పు మాది కాదని దబాయిస్తే? అంతకన్నా ఘోరం మరొకటి ఉండదు. బీజేపీ నాయకత్వం, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేస్తున్నది ఇదే. నాడు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్న సంతోషాన్ని తెలంగాణ ప్రజలకు మిగిల్చని క్రూర మనస్తత్వం బీజేపీది. రాష్ట్రం అధికారికంగా అమల్లోకి రాకముందే పోలవరం ముంపు …
Read More »వెకిలి నేత.. మకిలి మాట-రేవంత్ రెడ్డి ఒక సామాజిక చీడ పురుగు-ఎడిటోరియల్ కాలమ్
బహుజన హితాయః అని నినదించిన బుద్ధుడు, సర్వ సమతను కాంక్షించిన అంబేద్కర్, ఆర్థిక స్వాతంత్య్రాన్ని స్వప్నించిన కార్ల్ మార్క్స్ , స్వతంత్ర భారతంలో సోషల్ ఇంజినీరింగ్ కోసం కృషి చేసిన ఎందరో మహనీయుల స్ఫూర్తికి మహా విఘాతం, ఆచరణకు అడ్డంకి రేవంత్ రెడ్డి అనే ఒక కుసంస్కారి!వ్యక్తి కేంద్రక, స్వార్థ రాజకీయాలు; అందుకోసం ఎంత నీచానికైనా తెగబడే రేవంత్ రెడ్డి వాచాలత ఇది మొదటిసారి కాదు. ఆయనకు పగ్గాలు …
Read More »పొలిటికల్ టూరిస్టులకు కేసీఆర్ భయం పట్టుకుంది: ప్రశాంత్‌రెడ్డి
హనుమకొండ సభలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ చూస్తే జాలేస్తుందని.. ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను చదివి ఆయన తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని తెలంగాణ మంత్రి ప్రశాంత్‌రెడ్డి అన్నారు. తెలంగాణ కంటే గొప్పగా కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారో చెబితే బాగుండేదని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రశాంత్‌రెడ్డి మాట్లాడారు. రాహుల్‌పర్యటనతో తెలంగాణ ప్రజలకు ఒరిగేదీమీ లేదన్నారు. రైతుల పక్షపాతి ఎవరనే విషయం దేశ …
Read More »కాంగ్రెస్ పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా?: కేటీఆర్ ఎద్దేవా
సొంత నియోజకవర్గంలో ఎంపీగా గెలవని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. తెలంగాణలో కాంగ్రెస్‌ను గెలిపిస్తారా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ సభలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్‌ను రాహుల్ చదివారని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. రాహుల్ గాంధీ పొత్తుల గురించి మాట్లాడుతున్నారని.. కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేవారు ఎవరైనా ఉన్నారా? అని ప్రశ్నించారు. పొత్తు కావాలని ఆ పార్టీని ఎవరైనా …
Read More »పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా సోనియా తెలంగాణ ఇచ్చారు: రాహుల్
ఎంతోమంది యువత, తల్లుల రక్తం, ఆయా కుటుంబాల కన్నీళ్లతో సాధించుకున్న రాష్ట్రం తెలంగాణ అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‌లో నిర్వహించిన రైతు సంఘర్షణ సభలో రాహుల్ మాట్లాడారు. ఏ కలలు నెరవేర్చుకోవాలని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో వాటిని టీఆర్‌ఎస్ ప్రభుత్వం నెరవేర్చిందా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లేవని.. అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుతో …
Read More »వ్యవసాయంపై రాహుల్‌గాంధీకి అవగాహన ఉందా?: వినోద్ కుమార్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి వ్యవసాయంపై కనీస అవగాహనైనా ఉందా అని మాజీ ఎంపీ, తెలంగాణ ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బి.వినోద్‌కుమార్ ప్రశ్నించారు. వరంగల్‌లో రేపు రాహుల్ ప్రకటించనున్న వ్యవసాయ విధానం రాష్ట్రానికా? దేశానికా? అని నిలదీశారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వినోద్ మాట్లాడారు. రాష్ట్రంలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ విధానాన్ని స్పష్టం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ విధానం దేశంలోని …
Read More »రాహుల్.. మీరు రిటైర్ అవుతారా? ఫైటర్‌గా మారుతారా?: బాల్క సుమన్
ఆరుదశాబ్దాలుగా బీజేపీ, కాంగ్రెస్ కలిసి తెలంగాణకు అన్యాయం చేస్తూనే ఉన్నాయని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. రెండు జాతీయ పార్టీల నేతలు ఇప్పుడు తెలంగాణపై దండయాత్రకు వస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుమన్ మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ నుంచి ప్రజలకు విముక్తి కావాల్సి ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ విజన్ ఎందుకు లేదో జేపీ …
Read More »రాహుల్ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ హైదరాబాద్‌లోని పలు చోట్ల బ్యానర్లు
టీ పీసీసీ అధ్యక్షుడు,మల్కాజిగిరి కాంగ్రెస్ ఎంపీ అనుముల రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వైట్ ఛాలెంజ్‌కు సిద్ధమా అంటూ హైదరాబాద్‌లోని పలు చోట్ల బ్యానర్లు వెలిశాయి. ‘రాహుల్ జీ ఆర్ యూ రెడీ ఫర్ వైట్ ఛాలెంజ్?’ అని బ్యానర్లలో ప్రశ్నించారు. ఇక బ్యానర్లలో ఇటీవల నేపాల్ రాజధాని ఖాఠ్మండ్‌లో ఓ మహిళతో పబ్‌లో కనిపించిన దృశ్యాలను …
Read More »రాహుల్ రాకముందే టీకాంగ్రెస్ లో మహిళా నేతలకు అవమానం
తెలంగాణలో రాహుల్ గాంధీ సభలకు హాజరయ్యేందుకు గాంధీ భవన్లో పాసులు జారీ చేస్తున్నారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన అధినాయకత్వం. అయితే మహిళా కాంగ్రెస్ విభాగానికి పాసులు పంపిణీ సరిగా జరగడం లేదని మహిళా కార్యకర్తలు ఆందోళన చేశారు. ముఖ్య నేతలకు పాసులు ఇవ్వకపోవడం ఏమిటని మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ సునీతారావు అసహనం వ్యక్తం చేశారు. మహిళా కాంగ్రెస్కు బిచ్చం వేసినట్లు పాసులు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More »ఓయూలో రాహుల్ పర్యటన.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఓయూ క్యాంపస్‌లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ …
Read More »