కాంగ్రెస్ పార్టీకి చెందిన అగ్రనేత.. ఏఐసీసీ చీఫ్ శ్రీమతి సోనియా గాంధీ రాజకీయాలకు విరామం ప్రకటిస్తున్నట్లు వార్తలు తెగ చక్కర్లు కొట్టిన సంగతి విదితమే. అయితే సోనియా గాంధీ దేశ రాజకీయాల నుంచి తప్పుకుంటున్నారనే ప్రచారంపై ఆ పార్టీ స్పందించింది. అయితే సోనియాగాంధీ అలా అనలేదని ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ ఛార్జ్ కుమారి సెల్జా తెలిపారు. పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం మాత్రమే సంతోషంగా …
Read More »వచ్చేన్నికల్లో బీజేపీకి ఓటమి ఖాయం
దేశంలో వచ్చే లోక్ సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ప్రస్తుత అధికార పార్టీ అయిన బీజేపీ తుడిచిపెట్టుకుపోతుందని ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ జోస్యం చెప్పారు. కుల, మత ప్రాతిపదికన దేశాన్ని విభజించేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి రాకుండా అడ్డుకునేందుకు తమ కూటమి ప్రయత్నిస్తుందని చెప్పారు. కిడ్నీ మార్పిడి ఆపరేషన్ చేయించుకున్నాక తొలిసారి మహాగర్ బంధన్ ర్యాలీని ఉద్దేశించి లాలూ ప్రసాద్ యాదవ్ మాట్లాడారు.
Read More »వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి ఎంఐఎం పోటి
దేశంలో త్వరలో జరగనున్న వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఔరంగబాద్ నుంచి తమ పార్టీ పోటీ చేయనున్నట్లు ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ తెలిపారు. ఔరంగాబాద్‌తో పాటు ఇతర స్థానాల గురించి కూడా పోటీ చేసేందుకు ఆలోచిస్తున్నాము.. ఎవరితో పొత్తు కుదుర్చుకోవాలన్న దానిపై కూడా కొన్ని పార్టీలతో సంప్రదింపుల్లో ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే ఎవరితో పొత్తు పెట్టుకుంటామనే దానిపై ఇంత త్వరగా వెల్లడించలేమని ఎంఐఎం చీఫ్ తెలిపారు.
Read More »పశువులకు కూడా ఆధార్ నంబర్
దేశంలో త్వరలో పశువులకు కూడా ఆధార్ నంబర్ ఇవ్వనున్నట్టు నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. పశువులకు వచ్చే పలు రకాల వ్యాధుల పుట్టుక గురించి వీలైనంత త్వరగా తెలుసుకోవాలని అప్పుడే దాని నివారణకు వ్యాక్సిన్‌ను, ఇతర మార్గాలను అన్వేషించడం సులభమవుతుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. బయో ఏషియా సదస్సులో భాగంగా మొదటి రోజు ప్యానల్ డిస్కషన్‌లో ‘వన్ హెల్త్ అప్రోచ్, స్వదేశీ పరిజ్ఞానం, విధానం’ అంశంపై …
Read More »ప్లీనరీ సమావేశాల్లో కాంగ్రెస్ సంచలన నిర్ణయం
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తోన్న తాజా ప్లీనరీ సమావేశాల్లో ఓ కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ అత్యున్నత కమిటీ అయిన CWCకి ఇక నుంచి ఎన్నికలు నిర్వహించకూడదని తీర్మానించారు. సభ్యులను నామినేట్ చేసే అధికారం పార్టీ అధ్యక్షుడికే కట్టబెట్టారు. చత్తీస్ గఢ్ లోని రాయపూర్ లో ఆ పార్టీ 85వ ప్లీనరీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల్లో పార్టీ అగ్రనేతలు పాల్గొన్నారు.
Read More »రాహుల్ కు పెళ్ళి వద్దంటా కానీ పిల్లలు కావాలంటా..?
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 52 ఏండ్లైనా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆయన పెండ్లి ఎప్పుడు చేసుకుంటారా అన్న ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఈ విషయంలో రాహుల్ కు అనేక సార్లు ప్రశ్నలు కూడా ఎదురయ్యాయి. అయితే, తాజాగా తన వివాహంపై రాహుల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు వివాహం ఎందుకు చేసుకోలేదో తెలియదు కానీ, పిల్లలు కావాలని మాత్రం ఉందంటూ చెప్పుకొచ్చారు.
Read More »తెలంగాణలో రికార్డుస్థాయికి చేరిన విద్యుత్తు డిమాండ్…
వేసవికాలం రాకముందే విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా శుక్రవారం సాయంత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్తు డిమాండ్ నమోదైంది. గతేడాది ఫిబ్రవరి 10న డిమాండ్ 11,822 మెగావాట్లు మాత్రమే. గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా తాజాగా ఆ రికార్డు చెరిగిపోయింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం భారీగా పెరుగుతున్నందున వ్యవసాయబోర్ల వినియోగం ఎక్కువై డిమాండ్ …
Read More »త్వరలోనే కొత్త రేషన్ కార్డులు
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ అసెంబ్లీలో తెలిపారు. జాతీయ ఆహార భద్రత కింద కేంద్రం 53 లక్షల రేషన్ కార్డులు ఇచ్చింది. తాము అదనంగా 35 లక్షల కార్డులు ఇచ్చినట్లు వెల్లడించారు. మంత్రి ప్రకటనతో త్వరలో తమకు …
Read More »తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
తెలంగాణ రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ అయింది. ఈ నెల 11న నామినేషన్లను స్వీకరించనున్నారు. 12వ తేదీన మండలిలో డిప్యూటీ చైర్మన్ ఎన్నిక నిర్వహించనున్నారు. డిప్యూటీ చైర్మన్‌గా ఎమ్మెల్సీ బండ ప్రకాశ్ ముదిరాజ్ పేరు ఖరారు అయింది. బండ ప్రకాశ్ ఎమ్మెల్సీగా 2021, నవంబర్ నెలలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. చైర్మన్‌గా గుత్తా సుఖేందర్ రెడ్డి కొనసాగుతున్న విషయం విదితమే.
Read More »విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.
Read More »