తెలంగాణ ఉద్యమ గాయకుడు,ప్రజా కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పోరేషన్ చైర్మన్ సాయిచంద్ అకస్మిక మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణం పట్ల సిఎం సంతాపాన్నిప్రకటించారు. ఇంత చిన్న వయస్సులో సాయిచంద్ మరణం తనను తీవ్రంగా కలచివేసిందని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. సాయిచంద్ మరణంతో తెలంగాణ సమాజం వొక గొప్ప గాయకున్ని కళాకారున్ని కోల్పోయిందన్నారు. చిన్నతనంలోనే అద్భుతమైన ప్రతిభను సొంతం చేసుకున్న …
Read More »అల్లా దయతో తెలంగాణ సుభిక్షంగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి వర్యులు శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు ముస్లిం సోదర, సోదరీమణులకు ఈద్ ఉల్ అధా (బక్రీద్ )పండుగ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగం, సహనం బక్రీద్ పండుగ ఇచ్చే సందేశాలన్నారు. ‘‘దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ.. ఈ పండుగ జరుపుకొంటారన్నారు. భక్తి భావం, విశ్వాసం, కరుణ, ఐక్యతకు సంకేతమైన ఈ పండుగను భక్తి శ్రద్ధలతో ఘనంగా …
Read More »బీఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే మిషన్
బీఆర్‌ఎస్‌ను తెలంగాణ పార్టీ అంటున్నారని.. కానీ బీఆర్‌ఎస్ భారతదేశ గతిని మార్చే, పరివర్తన తెచ్చే ఒక మిషన్ అని సీఎం కేసీఆర్ అన్నారు. ఇది జాతీయ స్థాయిలో పనిచేసే పార్టీ అని స్పష్టం చేశారు. మహారాష్ట్రలోని సర్కోలి బహిరంగ సభలో ప్రసంగించిన సీఎం కేసీఆర్.. మన దేశానికి ఏదైనా లక్ష్యం ఉందా లేక మనం దారి తప్పి చీకట్లో మగ్గుతున్నామా? అని ప్రశ్నించారు. ఈ విషయంపై ప్రజలు ఆలోచించాల్సిన అనివార్య …
Read More »టీఎస్‌పీఎస్సీ అభ్యర్థులకు అలెర్ట్
హార్టికల్చర్ ఆఫీసర్ నియామక పరీక్షకకు సంబంధించిన ప్రాథమిక ‘కీ’, రెస్పాన్స్ షీట్లను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మంగళవారం విడుదల చేసింది. వెబ్‌సైట్ అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. రేపటి నుంచి జులై ఒకటో తేదీ వరకు ప్రాథమిక కీపై అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు పేర్కొంది. ఆన్‌లైన్‌లో ఇంగ్లిష్‌లో మాత్రమే అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు స్పష్టం చేసింది.జులై 26 వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉండనున్న రెస్పాన్స్ షీట్లు వెబ్‌సైట్ అందుబాటులో ఉంటాయని స్పష్టం చేసింది. …
Read More »ఆగస్టు చివరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు – మంత్రి హరీష్ రావు..
ఆగస్ట్ చివరలో కొత్త రేషన్ కార్డులు, పెన్షన్లు ప్రారంభం కానున్నాయని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. కొత్త రేషన్ కార్డులపై మంత్రి హరీష్ రావు కీలక ప్రకటన చేశారు. ఆగస్టు చివరి వారంలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని, కార్డులు ఇచ్చేందుకు అంతా సిద్ధమైందని తెలిపారు. ఆగస్టు చివరి వారంలో కొత్త పెన్షన్లు కూడా వచ్చేలా చూస్తామని చెప్పారు. మరోవైపు 2014 నుంచి …
Read More »తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఆయన ఉన్నత విద్యామండలి ఇన్‌చార్జిగా కొనసాగుతున్నారు. గత ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి పదవీ కాలం ముగిసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. మూడేళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. మరో వైపు ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్‌గా ఎస్‌కే మహమూద్‌ను నియామకమయ్యారు. ఆయన …
Read More »మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి పట్ల మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంతాపం.
సిద్దిపేట జిల్లాకు చెందిన తొలితరం కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ రైతాంగ పోరాట పోరాట యోధులు మాజీ MP సోలిపేట రామచంద్రారెడ్డి (92) అని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు యువజన సర్వీసుల శాఖల మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ కీర్తించారు. వారు సర్పంచ్ గా, సమితి అధ్యక్షుడిగా, దొమ్మాట శాసన సభ్యునిగా, రాజ్యసభ సభ్యునిగా, పలు హోదాల్లో విశిష్ట సేవలు అందించి మచ్చలేని వ్యక్తిగా పేరుపొందారన్నారు. …
Read More »మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ సంతాపం
సుదీర్ఘ కాలం రాజకీయ, ప్రజా జీవితాన్ని గడిపి, అనేక పదవులు నిర్వహించిన తొలితరం కమ్యూనిస్టు నేత, నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుడు, సర్పంచ్ స్థాయి నుండి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన నాయకుడు సోలిపేట రామచంద్రా రెడ్డి జీవితం అందరికీ ఆదర్శమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, …
Read More »మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మరణం పట్ల సీఎం కేసీఆర్ సంతాపం
తొలితరం కమ్యూనిస్టు నేతగా, నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పాల్గొన్న సోలిపేట’ జీవితం ఆదర్శవంతమైనది అని సిఎం కేసీఆర్ తెలిపారు. తన రాజకీయ జీవితంలో సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ప్రజా జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగిన క్రమం రేపటి తరానికి స్ఫూర్తిదాయకమని సిఎం అన్నారు. సిద్దిపేట ప్రాంత వాసిగా, రాజకీయ సామాజిక రంగాల్లో వారు ఆచరించిన కార్యాచరణ,ప్రజా జీవితంలో కొనసాగుతున్న తమ లాంటి ఎందరో నేతలకు …
Read More »మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి మృతి
తెలంగాణలోని సిద్దిపేట జిల్లా చిట్టాపూర్ గ్రామానికి చెందిన రాజ్యసభ మాజీ సభ్యులు సోలిపేట రామచంద్రారెడ్డి (92) ఈరోజు మంగళవారం ఉదయం హైదరాబాద్‌లో అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతదేహాన్ని బంజారాహిల్స్ శాసనసభ్యుల నివాసం 272 (ఏ)లో ఉంచారు. ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సిటీ కాలేజీలో పట్టభద్రులైన రామచంద్ర రెడ్డి …
Read More »