శర్వానంద్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. కిషోర్ తిరుమల దర్శకుడు. సోమవారం కథానాయిక రష్మిక మందన్న జన్మదినం సందర్భంగా ఆమె ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదలచేసింది. ఇందులో ఆమె పసుపు రంగు చీరలో బంతిపూల మాల అల్లుతూ కనిపిస్తోంది. త్వరలో షూటింగ్ ప్రారంభిస్తామని చిత్రబృందం పేర్కొంది.
Read More »