కరోనా రోగుల కాంటాక్టులకు వారం రోజులే క్వారంటైన్ ఉంటుందని కేంద్రం తెలిపింది. అలాగే స్వల్ప లక్షణాలు ఉన్న కరోనా బాధితులు సైతం 7 రోజుల్లోనే డిశ్చార్జ్ కావొచ్చని పేర్కొంది. కాగా దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ వల్ల ఒక్కరు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిపింది. ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నట్లు వెల్లడించింది. బెంగాల్(32%), ఢిల్లీ(23%), మహారాష్ట్ర (22%)లో పాజిటివిటీ రేటు అధికంగా ఉందని వివరించింది.
Read More »