కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. ఆ పార్టీ పార్లమెంటరీ చైర్ పర్శన్ శ్రీమతి సోనియా గాంధీ దేశ రాజధాని మహానగరం ఢిల్లీలోని గంగారం ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఆమెకు స్వల్ప జ్వరం లక్షణాలుండటంతో ముందు జాగ్రత్తలో భాగంగా గంగారం ఆసుపత్రికి తీసుకెళ్లినట్లు ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం సోనియా గాంధీ ఆరోగ్యం నిలకడగానే ఉంది. ఎలాంటి సమస్యల్లేవని తెలుస్తుంది. చత్తీస్ గడ్ ప్రభుత్వ సమావేశంలో పాల్గోనేందుకు రాయ్ …
Read More »రాహుల్ గాంధీపై కేసు నమోదు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కాపీరైట్ యాక్ట్ కింద బెంగళూరు పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. భారత్ జోడో యాత్ర సందర్భంగా రూపొందించిన వీడియోలో తమ సంస్థకు హక్కులున్న కేజీఎఫ్-2 హిందీ వర్షెన్ పాటను వాడుకున్నారని ఆరోపిస్తూ బెంగళూరుకు చెందిన ఓ సంస్థ రాహుల్ గాంధీ సహా ఇద్దరు కాంగ్రెస్ నేతలపై కేసు పెట్టింది.యాత్ర సందర్భంగా రాహుల్ గాంధీ పాదయాత్ర దృశ్యాలకు బ్యాక్ గ్రౌండ్‌గా కేజీఎఫ్-2 హిందీ సినిమా పాటలు, …
Read More »బీజేపీని గద్దె దించాలి-ప్రియాంకాగాంధీ
హిమాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతున్నది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ వాద్రా రోడ్‌షోలు, బహిరంగసభలతో ఓటర్లపై హామీల వర్షం కురిపిస్తున్నారు. ఇవాళ శుక్రవారం కాంగ్రాలో పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన బహిరంగసభలో ప్రియాంకాగాంధీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేంద్రంలో తాము అధికారంలోకి వచ్చాక మోదీ సర్కారు తెచ్చిన అగ్నిపథ్ స్కీమ్‌ను రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఏ హామీ …
Read More »కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక.. గాంధీ కుటుంబం నుంచి ఎవరూ లేనట్లే!
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నికపై రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తోంది. ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీయే అధ్యక్షుడిగా ఉండాలని కొన్ని రాష్ట్రాల పీసీసీలు ఇప్పటికే ఏఐసీసీకి తీర్మానాలు పంపాయి. రాహుల్ మాత్రం ఎప్పటి నుంచో అధ్యక్ష పదవిపై ఆసక్తి చూపడం లేదు. తనకు ఆ పదవి వద్దని చెబుతున్నా ఆ పార్టీలోని పెద్దలు, ఇతర ముఖ్యనేతలు మాత్రం ఆయన్ను ఒప్పించే ప్రయత్నాలు చేశారు. ఈ నేపథ్యంలో పార్టీ అధ్యక్ష …
Read More »కాంగ్రెస్ పార్టీకి కరువైన జాతీయ అధ్యక్షుడు
దాదాపు 137 ఏండ్ల చరిత్ర కలిగిన జాతీయ పార్టీ .. ఈ దేశాన్ని అత్యంత ఎక్కువకాలం ఏలిన కాంగ్రెస్‌ను భుజానెత్తుకుని ముందుకు నడిపే సమర్థ నాయకుడు కరువయ్యాడు. ఈ రోజు ఆదివారం నుండి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్ష పదవికి ఎన్నిక ప్రక్రియ మొదలుకానున్నది. అయితే కాంగ్రెస్ తదుపరి అధ్యక్షుడు ఎవరనే దానిపై ఇప్పటికీ స్పష్టత లేదు. రాహుల్ గాంధీ అధ్యక్షుడిగా ఉంటారని అంతా ఆశిస్తున్నా.. ఆయన నుంచి సానుకూల …
Read More »కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్
కాంగ్రెస్ పార్టీకి మరో సీనియర్ నేత షాక్ ఇచ్చారు. కేంద్ర మాజీ న్యాయశాఖ మంత్రి డాక్టర్ అశ్వని కుమార్ కాంగ్రెస్ పార్టీకి ఉద్వాసన చెప్పారు. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి పంపారు. ప్రస్తుత పరిణామాలు, దేశ విస్తృత ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని, గౌరవప్రదంగా పార్టీకి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్టు ఆ లేఖలో అశ్వని కుమార్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీతో 46 ఏళ్ల సుదీర్ఘ పయనం చేసిన విషయాన్ని …
Read More »అమరీందర్ సింగ్‌ను సీఎంగా తప్పించడంపై ప్రియాంక సంచలన వ్యాఖ్యలు
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ మరో వారం రోజులు మాత్రమే ఉన్న పంజాబ్‌లో రాజకీయం వేడెక్కింది. మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, కాంగ్రెస్, ఆమ్ అద్మీ (ఆప్) కీలక నాయకులు ఆదివారం రాష్ట్రంలో ప్రచారంలో పాల్గొని ప్రత్యర్థులపై విమర్శలకు దిగారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా లూధియానాలో, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఫరీద్‌కోట్‌లో, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అమృత్‌సర్‌లో ర్యాలీల్లో …
Read More »యూపీ సీఎం అభ్యర్థిపై ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు
యూపీ సీఎం అభ్యర్థిపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ పదవికి తాను కాకుండా ఇంకెవరైనా కనిపిస్తున్నారా అని మీడియాతో అన్నారు. అయితే ఎన్నికల్లో పోటీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. కాగా త్వరలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ స్థానాలు గెలుచుకుని అధికారంలోకి రావాలని కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అభ్యర్థుల ఎంపికపై జాగ్రత్త వహిస్తోంది.
Read More »డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు
కరోనా కారణంగా 2021 డిసెంబర్ నాటికి దేశంలో 5.3కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నారని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ తెలిపింది. ఇందులో 3.5 కోట్ల మంది ఉద్యోగం కోసం నిరంతరం ప్రయత్నిస్తున్నారు.. 1.7కోట్లమంది జాబ్ కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదంది. కాగా ఉద్యోగ వేటలో అంత యాక్టివ్గా లేనివారిలో సగానికి పైగా మహిళలే ఉన్నట్లు నివేదిక పేర్కొంది.
Read More »కర్హాల్ నియోజకవర్గం నుంచి అఖిలేశ్ యాదవ్ పోటీ
నిన్న మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని చెబుతూ వచ్చిన సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ బరిలో దిగుతున్నట్లు ప్రకటించారు. ఆయన కర్హాల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ వెల్లడించింది. ఆయన ప్రస్తుతం అజంగఢ్ ఎంపీగా ఉన్నారు. గతంలో యూపీ సీఎంగా చేసినప్పటికీ.. మండలి నుంచి ప్రాతినిథ్యం వహించారు.
Read More »