ప్రధాని మోదీకి భూటాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని ప్రకటించింది. భూటాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా నడాగ్ పెల్ గి ఖొర్లో అవార్డును ప్రకటించారు. భారత ప్రధాని మోదీకి తమ దేశ అత్యున్నత పౌర పురస్కారాన్ని ఇవ్వడానికి సంతోషిస్తున్నట్లు భూటాన్ ప్రధాని లోటే షేరింగ్ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఆయన ఈ విషయాన్ని చెప్పారు. భూటాన్ ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ అవార్డు ప్రకటనపై ఫేస్‌బుక్‌లో ఓ ప్రకటన చేసింది. …
Read More »ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్
ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ ఖాతా హ్యాక్ అయింది. అయితే దాన్ని కొంతసేపటి తర్వాత ట్విటర్ యాజమాన్యం పునరుద్ధరించింది. ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్ అకౌంట్‌లో బిట్‌కాయిన్‌లు కొనాలంటూ ఆగంతకులు పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్లను కొనుగోలుచేసి ప్రజలకు పంచుతున్నదని లింక్‌లు పోస్ట్ చేశారు.హ్యాకర్ల ట్వీట్‌పై ప్రధాని కార్యాలయం అధికారులు ట్విటర్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో …
Read More »మళ్లీ MODI నే నెం-1
అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరోసారి తొలి స్థానంలో నిలిచారు. మొత్తం 70% రేటింగ్‌తో మోదీ అగ్ర స్థానం నిలబెట్టుకున్నారు. మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రెటర్ 66%తో, ఇటలీ ప్రధాని మారియో 58%తో, జర్మనీ ఛాన్సెలర్ ఏంజెలా మెర్కెల్ 54%తో, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మారిసన్ 47%తో, అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ 44%తో తర్వాతి స్థానాల్లో …
Read More »ఉచిత రేషన్ ఈ నెలకే ఆఖరు: కేంద్రం
ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన కింద పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్‌ను పొడిగించే ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి సుధాంశు పాండే శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. కరోనా మహమ్మారి నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకొన్నదని చెప్పారు. ఉచిత రేషన్ విధానం ఈ నెల 30వరకే అమల్లో ఉంటుందని తెలిపారు. కరోనా నేపథ్యంలో పేదలకు గరీబ్ కల్యాణ్ యోజన కింద గతేడాది మార్చి నుంచి కేంద్ర ప్రభుత్వం …
Read More »దేశ ప్రజలకు మోదీ దీపావళి శుభాకాంక్షలు
దీపావళి పర్వదినం సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్వెల పండుగ మీ జీవితంలో సుఖ సంతోషాలు, శ్రేయస్సు, అదృష్టాన్ని తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ఇదిలా ఉండగా.. ప్రధాని ఇవాళ సైనికులతో కలిసి దీపావళి వేడుకలను జరుపుకోనున్నారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరి సెక్టార్‌లోని సైనిక శిబిరాల్లో నిర్వహించే వేడుకల్లో పాల్గొనున్నారు. 2014 నుంచి ఏటా సైనికులతో ప్రధాని దీపావళి వేడుకలు జరుపుకుంటున్నారు. మోదీ పర్యటన …
Read More »స్వలంగా పెరిగిన మోదీ ఆస్తులు
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది ఆయన ఆస్తుల విలువ రూ.2.85 కోట్లు ఉండగా, అది ఈ ఏడాది రూ.3.07 కోట్లకు పెరిగింది. ప్రధాని వెబ్‌సైట్‌లో ఈ వివరాలు ఉంచారు.మోదీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయనకు రూ.1.5 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మార్చి …
Read More »ప్రధానికి సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు
ప్రధానమంత్రి నరేందర్ మోదీ 71వ పుట్టినరోజు సందర్భంగా సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రభుత్వం, రాష్ట్ర ప్రజల తరఫున ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని భవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఎక్కువ కాలం దేశానికి సేవలందించాలి’ అని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు.
Read More »ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా పర్యటన
ఉత్తరాఖండ్‌లో వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా ఆ రాష్ట్రంలో రెండు రోజుల పర్యటన చేపట్టారు. ఆప్ఘనిస్తాన్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చేతుల్లో దేశం భద్రంగా ఉందని నడ్డా పేర్కొన్నారు. అత్యాధునిక ఆయుధాల కొనుగోలుకు మోదీ హయాంలో ఇప్పటివరకూ రూ 1.35 లక్షల కోట్లను కేంద్ర ప్రభుత్వం వెచ్చించిందని చెప్పారు.డెహ్రాడూన్, రైవాలలో మాజీ సైనికులతో నడ్డా ముచ్చటించారు. వాజ్‌పేయి …
Read More »దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది బాహుబలులు ఉన్నారు-ప్రధాని మోదీ
టీకాలను భుజాలకు ఇస్తారని, అయితే కోవిడ్ టీకాలను వేయించుకున్నవాళ్లు బాహుబలులు అయినట్లు ప్రధాని మోదీ తెలిపారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో ఇవాళ ఆయన పార్లమెంట్ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కనీసం ఒక డోసు వ్యాక్సిన్ తీసుకుని ఉంటారని, ప్రతి ఒక్కరూ కోవిడ్ నియమావళిని పాటించాలని, దేశవ్యాప్తంగా 40 కోట్ల మంది కోవిడ్ టీకా తీసుకున్నారని, వాళ్లంతా బాహుబలులు అయినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని, …
Read More »ఢిల్లీకి సీఎం కేసీఆర్
ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ప్రస్తుతం హాట్ టాఫిక్ గా మారిన కృష్ణా నీటి వినియోగంపై వివాదం రోజురోజుకూ ముదురుతోంది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి చేస్తుండటంపై ఏపీ సీఎం జగన్ ప్రధాని మోదీకి లేఖ రాశారు. అయితే ఈ అంశంపై పరిష్కారం చూపాలని ప్రధానిని కలవాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఇందుకోసం ఆయన అపాయింట్మెంట్ కోరే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమస్యకు శాశ్వత …
Read More »