తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ.. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ లోక్‌సభ, రాజ్యసభ సభ్యులు పాల్గొన్నారు. ప్రధాని మోదీ వ్యాఖ్యలను ఖండిస్తున్నాం.. సీఎం కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి.. జై తెలంగాణ అంటూ టీఆర్ఎస్ ఎంపీలు నినాదాలు చేశారు.అన్ని పార్టీలు మద్దుతు ఇచ్చిన బిల్లు అశాస్త్రీయం ఎలా అవుతుందని …
Read More »ప్రధాని మోదీ హైదరాబాద్ కు రాక – చివరి నిమిషంలో సీఎం కేసీఆర్ అందుకే పోలేదు..
నేడు ప్రధాని మోదీ హైదరాబాద్‌కు రానున్న విషయం తెలిసిందే. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి రాష్ట్రానికి వస్తున్న మోదీకి ఇవాళ మధ్యాహ్నం 02:10 గంటలకు సీఎం కేసీఆర్ స్వాగతం పలకడమే కాకుండా… శంషాబాద్ ఎయిర్‌పోర్టులో అడుగు పెట్టింది మొదలు.. మళ్లీ ఢిల్లీకి పయనమై వెళ్లే వరకు ప్రధాని వెంట ముఖ్యమంత్రి ఉంటారని సీఎంవో వర్గాలు శుక్రవారం తెలిపాయి. ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ శంషాబాద్ …
Read More »అబద్ధాల ప్రధాని.. చెత్త ప్రభుత్వం
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర ప్రభుత్వం దేశానికి చెప్పేవన్నీ అబద్ధాలేనని ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. ఈ దేశాన్ని చెత్త ప్రభుత్వం, పనికిమాలిన ప్రభుత్వం పరిపాలిస్తున్నదని ధ్వజమెత్తారు. అబద్ధాల్లో బతుకుతూ, మతపిచ్చి లేపుతుందని మండిపడ్డారు. ‘ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం దేశ సమగ్రతను నాశనం చేస్తున్నది. నేను భారత ప్రభుత్వంపై ఆరోపణ చేస్తున్నాను. అఫ్గానిస్థాన్‌లో పెట్టుబడి పెట్టమంటే ఎవరైనా అక్కడ పెట్టుబడి పెడుతారా? అక్కడ ఎందుకు …
Read More »ఉత్తరాఖండ్ లోని యమకేశ్వర్ నియోజకవర్గానికో స్పెషల్.. అది ఏమిటంటే..?
ఉత్తరాఖండ్లోని యమకేశ్వర్ నియోజకవర్గానికి ఓ ప్రత్యేకత ఉంది. 2000 సంవత్సరంలో రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి అక్కడ మహిళలే గెలుస్తున్నారు. 2002 నుంచి 2012 వరకు బీజేపీ అభ్యర్థి విజయ బర్హ్వాల్ వరుసగా మూడు సార్లు, 2017లో రితూ ఖండూరీ గెలిచారు. ఈసారి బీజేపీ తరఫున రేణు బరిలో ఉండగా, వివిధ పార్టీల నుంచి ఆరుగురు పురుష అభ్యర్థులూ పోటీ పడుతున్నారు. మరి ఎవరు గెలుస్తారో వేచిచూడాలి.
Read More »భారత దేశ ప్రతిష్టను చెడగొట్టే ప్రయత్నం జరుగుతోంది-ప్రధాని మోదీ
అంతర్జాతీయంగా భారత దేశానికిగల కీర్తి, ప్రతిష్ఠలను సర్వ నాశనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చెప్పారు.’స్వాతంత్ర్య అమృత మహోత్సవాల నుంచి సువర్ణ భారత్ దిశగా’ కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో గురువారం ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అవుతున్న నేపథ్యంలో నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా బ్రహ్మ కుమారీస్ సంస్థ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. మన …
Read More »ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ
ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. లేఖలో.. ‘పెంచిన ఎరువుల ధరలను కేంద్రం తగ్గించాలని కోట్ల మంది రైతుల తరఫున కోరుతున్నా. ఇప్పటికే అనేక రైతు వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచారు.. ధాన్యం కొనుగోళ్లు ఆపారు. వ్యవసాయ ఖర్చును విపరీతంగా పెంచారు. రైతులకు విద్యుత్ మీటర్లు పెట్టి వారి ప్రయోజనాలు దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.
Read More »మోదీకి మంత్రి కేటీఆర్ షాకింగ్ ట్వీట్
భారత ప్రధాని నరేంద్ర మోదీకి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఈ జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా తెలంగాణ యువత, విద్యార్థుల తరపున మీరు త్వరగా సవరణలు చేయవలసిందిగా కోరుతున్నాను. గత 7 సంవత్సరాలలో రాష్ట్రం నుంచి అనేక అభ్యర్థనలు ఉన్నప్పటికీ, NDA ప్రభుత్వం తెలంగాణకు ఒక్క విద్యా సంస్థను కూడా మంజూరు చేయలేదు’ అని ఆ ట్వీట్లో పేర్కొన్నారు. దేశంలో మంజూరైన విద్యాసంస్థల వివరాలను కేటీఆర్ పంచుకున్నారు.
Read More »ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ
ఏపీ అధికార వైసీపీ అధినేత,రాష్ట్ర సీఎం జగన్ నేడు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆయన ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ కానున్నారు. ఉదయం. 10.50 గంటలకు గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరి, మధ్యాహ్నం 01.05 గంటలకు ఢిల్లీ చేరుకుంటారు. అధికారిక నివాసం నుంచి సాయంత్రం 03.45గంటలకు ప్రధాని కార్యాలయానికి వెళతారు.
Read More »రేపు ఢిల్లీకి సీఎం జగన్
ఏపీ సీఎం ,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు సోమవారం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లనున్నారు. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయిట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ఏపీ,తెలంగాణ రాష్ట్రాల మధ్య నెలకొన్న జల వివాదాలు, ప్రాజెక్టుల వ్యవహారంతో పాటు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలపై కేంద్ర పెద్దలతో సీఎం జగన్ చర్చింనున్నట్లు సమాచారం. ముఖ్యంగా …
Read More »రేపు గోవాకు ప్రధాని నరేందర్ మోదీ
ప్రధాని నరేంద్రమోదీ రేపు గోవాకు వెళ్లనున్నారు. గోవాలో జరుగనున్న గోవా లిబరేషన్ డే ఉత్సవాలకు ఆయన హాజరుకానున్నారు. గోవాలోని డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జి స్టేడియంలో గోవా లిబరేషన్ డే సంబరాలు జరుగనున్నాయి. ఈ సందర్భంగా భారత భూభాగాలైన గోవా, డామన్ అండ్ డయ్యూ ప్రాంతాల విముక్తి కోసం పోరాడిన వారిని, 1961లో ఆపరేషన్ విజయ్‌లో పాల్గొన్నవారిని ప్రధాని మోదీ సత్కరించనున్నారు. భారతదేశానికి 1947లో స్వాతంత్ర్యం వచ్చినా గోవా, డామన్ …
Read More »