తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మౌలాలిలో 21.51 ఎకరాల లీజుకు నోటిఫికేషన్ త్వరలో చిలుకలగూడలో 18 ఎకరాలకు కూడా.ఇప్పటికే ఎన్నో భారీ ప్రభుత్వ సంస్థలను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టిన మోదీ ప్రభుత్వం.. పేదోడి జీవనాడి అయిన రైల్వేను ప్రైవేటుపరం చేసేందుకు రైలంత వేగంతో పరుగెడుతున్నది. అధిక లాభాలార్జిస్తున్న అనేక మార్గాల్లో ప్రైవేటుకు తలుపులు తెరిచిన కేంద్రం, తాజాగా దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే …
Read More »మోదీకి ఢిల్లీ సీఎం క్రేజీ ఫంచ్
దేశంలో వ్యాక్సినేషన్ కొరతపై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేంద్రంపై తీవ్ర విమర్శలు చేశారు. కేంద్రం ఎందుకు టీకాలు కొనడం లేదని ప్రశ్నించారు. ఒకవేళ పాకిస్తాన్ దేశంపై దాడులు చేస్తే, రక్షించుకునే బాధ్యతను కూడా రాష్ట్రాలకే వదిలేస్తారా? సొంతంగా యుద్ధ ట్యాంకులు కొనుక్కోమని అంటారా? అంటూ మండిపడ్డారు. ఇతర దేశాల లాగా కాకుండా దేశంలో 6 నెలలు ఆలస్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైందని విమర్శించారు.
Read More »ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ
ప్రధాని మోదీకి కేరళ సీఎం పినరయి విజయన్ లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ల కోసం కేంద్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను పిలవాలన్న ఆయన.. కేంద్రమే రాష్ట్రాలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాలన్నారు. కరోనా వ్యాక్సిన్ల కోసం పలు రాష్ట్రాలు గ్లోబల్ టెండర్లకు వెళ్లాయి.. వ్యాక్సిన్లు ఇచ్చేందుకు మోడర్నా, ఫైజర్ వంటి అమెరికా సంస్థలు కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే వ్యాక్సిన్లు ఇస్తామన్న నేపథ్యంలో కేరళ సీఎం లేఖ ఆసక్తిగా మారింది.
Read More »సినిమాల్లోకి మోదీ
కరోనాపై పోరాడుతున్న వైద్యులు, ఆరోగ్య సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రధాని మోదీ భావోద్వేగానికి లోనవడం పట్ల కాంగ్రెస్ స్పందించింది. మోదీ సినిమాల్లో నటించాలని ఆ పార్టీ ప్రతినిధి పవన్ ఖేరా ఎద్దేవా చేశారు. కరోనాతో దేశ ప్రజలు చనిపోతుంటే, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ ఇప్పుడు మొసలికన్నీరు కారుస్తున్నారని విమర్శించారు.
Read More »కంటతడిపెట్టిన ప్రధాని మోదీ
కరోనాతో పాటు ప్రధాన సవాల్ గా ముందుకొచ్చిన బ్లాక్ ఫంగస్ నిరోధానికి ప్రజలు జాగ్రత్తలు పాటించాలని ప్రధాని మోదీ కోరారు. మహమ్మారి సమసిపోయేవరకూ ప్రజలు సేదతీరరాదని చెప్పారు. కొవిడ్ పరిస్థితులపై నేడు ఆరోగ్య కార్యకర్తలతో మాట్లాడిన ఆయన.. వైరస్ వల్ల ప్రాణాలు కోల్పోయిన వారిని గుర్తుచేసుకుని కన్నీటి పర్యంతమయ్యారు. కొవిడ్తో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
Read More »మోదీకి వైసీపీ ఎంపీ లేఖ
ప్రధాని మోదీకి మచిలీపట్నం ఎంపీ బాలశౌరి లేఖ రాశారు. మెడికల్ ఆక్సిజన్, రెమిడెసివిర్పై 28 నుంచి 12శాతానికి తగ్గించిన జీఎస్టీని సున్నా శాతం స్లాబ్లోకి తీసుకురావాలని కోరారు. అంబులెన్సులపై ఉన్న 28శాతం జీఎస్టీని కూడా పూర్తిగా తొలగించాలన్నారు. కరోనా తగ్గే వరకూ సున్నాశాతం స్లాబు కొనసాగించాలన్న ఆయన.. వెంటనే జీఎస్టీ కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని లేఖలో కోరారు.
Read More »కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ సెకండ్ వేవ్ నానాటికీ విజృంభిస్తోంది. అత్యంత వేగంగా విస్తరిస్తున్న ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు ఇప్పటికే వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. తాజాగా వ్యాక్సినేషన్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మే 1 నుంచి 18 ఏళ్లు పైబడిన వారందరికి వ్యాక్సిన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది
Read More »కుటుంబానికి ఓ ఉద్యోగం -బీజేపీ మరో నినాదం
పశ్చిమ బెంగాల్ ఎన్నికల మ్యానిఫెస్టోను విడుదల చేసిన హోంమంత్రి అమిత్ షా.. కుటుంబానికి ఓ ఉద్యోగం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్, కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామన్నారు. నోబెల్ తరహాలో ఠాగూర్ అవార్డులను ఇస్తామని BJP పేర్కొంది. 75 లక్షల మంది రైతులకు రుణమాఫీ, PM కిసాన్ కింద రైతుల ఖాతాల్లోకి ₹10వేల జమ, భూమిలేని రైతులకు ₹4వేల ఆర్థిక …
Read More »ఈ రోజు (17న) సీఎంలతో ప్రధాని సమావేశం… దేశంలో మళ్లీ లాక్‌డౌన్ విధిస్తారా?
ఇండియాలో కరోనా ఏ రేంజ్‌లో పెరుగుతోందో చూస్తూనే ఉన్నాం. ఇలాగే ఊరుకుంటే కొంపలు మునుగుతాయని భావించిన కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ వీడియో కాన్ఫరెన్స్ సమావేశం మధ్యాహ్నం 12.30కి జరగనుంది. ఇందులో రాష్ట్రాలు ఏం చేస్తున్నాయో మోదీ తెలుసుకోనున్నారు. ఏం చెయ్యాలో చెప్పనున్నారు. ఈ సందర్భంగా… మళ్లీ కొన్ని ప్రాంతాల్లో లాక్‌డౌన్లు ప్రకటించమని …
Read More »దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు
దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేందర్ మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రజలంతా నీటి నిల్వపై అవగాహన పెంచుకోవాలని ప్రధాని మోదీ ‘మన్ కీ బాత్’లో పిలుపునిచ్చారు. అందులో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ ‘క్యాచ్ ద రెయిన్ కార్యక్రమం తీసుకురానున్నట్లు తెలిపారు. హరిద్వార్‌లో ప్రపంచ నీటి దినోత్సవం’ రోజైన మార్చి 22న కుంభమేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈరోజు ‘జాతీయ సైన్స్ దినోత్సవం’ సందర్భంగా సర్ CV.రామన్ సేవలను కొనియాడారు. యువత …
Read More »