దేశంలో అన్ని రంగాల వార్ని మోసం చేసిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాతీయస్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడంలేని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ జన్మదినం (ఫిబ్రవరి17) సందర్భంగా LB స్టేడియంలో జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని మాట్లాడుతూ..రాష్ట్ర ప్రభుత్వం క్రీడలను, క్రీడాకారులను అన్ని విధాలుగా ప్రోత్సహిస్తుందన్నారు. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేలా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుందని …
Read More »