ఉక్రెయిన్ దేశంపై గత కొన్ని నెలలుగా రష్యా దేశం బాంబుల వర్షం కురిపిస్తున్న సంగతి తెల్సిందే. ఈ నేపథ్యంలో రష్యా అధ్యక్షుడైన వ్లాదిమిర్ పుతిన్ గురించి ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంకా బతికే ఉన్నారో లేదో ఖచ్చితంగా తెలియదని జెలెన్స్కీ వ్యాఖ్యానించారు. వ్లాదిమిర్ పుతిన్ గత కొన్ని వారాలుగా బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉన్నారని ఆయన …
Read More »69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్న రష్యా అధ్యక్షుడు
రష్యా అధ్యక్షుడు పుతిన్ 69 ఏళ్ల వయసులో మరోసారి తండ్రి కాబోతున్నట్లు జనరల్ ఎస్వీఆర్ టెలిగ్రాం ఛానల్ వెల్లడించింది. ఆయన ప్రేయసి, మాజీ జిమ్నాస్ట్ అలీనా కబయెవా ప్రెగ్నెంట్ అని పేర్కొంది. లింగ నిర్ధారణ పరీక్షల్లో ఆడపిల్లగా తేలిందని తెలిపింది. వీరికి ఇప్పటికే ఇద్దరు కొడుకులున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయం బయటపడకుండా ఆమెను రహస్యంగా స్విట్జర్లాండ్లో కొన్నేళ్లపాటు ఉంచారు.
Read More »ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ లకు రష్యా అధ్యక్షుడు పుతిన్ షాక్
ఒకవైపు ఉక్రెయిన్ పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై ఒత్తిడి తెచ్చేందుకు అనేక దేశాలు ఆంక్షలు విధిస్తున్నాయి. మరోవైపు రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ సర్కార్ తగ్గేదే లే అంటూ ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, న్యూజిలాండ్ ప్రైమ్ మినిస్టర్ అయిన ఆర్డెర్ లను తమ దేశంలోకి ప్రవేశించకుండా రష్యా నిషేధం విధించింది. అలాగే ఆస్ట్రేలియాకు చెందిన మంత్రులు, పార్లమెంటేరియన్లు 228 మంది,న్యూజిలాండక్కు చెందిన 130 …
Read More »యుద్ధం ఆపేందుకు రష్యా మరో ప్రతిపాదన
ఉక్రెయిన్ దేశంపై రష్యా చేస్తున్న యుద్ధం ఆపేందుకు మరో ప్రతిపాదన చేసింది. చర్చల సందర్భంగా సూచించిన షరతులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంగీకరిస్తే మిలిటరీ ఆపరేషన్ నిలిపివేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇందులో భాగంగా నాటోలో చేరాలనే అన్ని ప్రణాళికలను ఉక్రెయిన్ విరమించుకోవాలని స్పష్టం చేసింది. అయితే ఇటీవల పుతిన్, జెలెన్ స్కీ మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.. అయితే ఉక్రెయిన్లోని బుచాలో రష్యా …
Read More »దిగోచ్చిన రష్యా- కారణాలు ఇవే..?
గత కొన్ని రోజులుగా రష్యా ఉక్రెయిన్ పై బాంబుల దాడి కురిపిస్తున్న సంగతి విదితమే. అయితే మంగళవారం టర్కీలోని ఇస్తాంబుల్ వేదికగా జరిగిన రష్యా -ఉక్రెయిన్ దేశాల ప్రతినిధుల మధ్య చర్చలు మొట్టమొదటి సారిగా సానుకూలంగా ముగిశాయి. ఇందులో భాగంగా రష్యా కీవ్ లో ఉన్న తమ బలగాలను వెనక్కి రప్పించడమే కాకుండా చేస్తున్న దాడులను తగ్గించింది రష్యా. అయితే యుద్ధం ప్రారంభమై ముప్పై నాలుగురోజులైన ఉక్రెయిన్ పై పైచేయి …
Read More »రష్యాకు సామ్‌సంగ్ షాక్
ఉక్రెయిన్‌పై దాడి నేపథ్యంలో బహుజాతి సంస్థలు ఒక్కొక్కటిగా రష్యాలో తమ సేవలను నిలిపివేస్తున్నాయి. ఇప్పటికే యాపిల్, నైక్, ఐకియా, యూటూబ్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు రష్యాలో తమ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేయగా, తాజాగా సామ్‌సంగ్ (Samsung) కూడా ఆ జాబితాలో చేరింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి ఫోన్లు, చిప్‌ల సరఫరాను నిలిపివేసినట్లు ప్రకటించింది సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ ప్రకటించింది. పరిస్థితులను బట్టి తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకుంటామని స్పష్టం చేసింది. …
Read More »ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి అరుదైన ఆహ్వానం అందింది. అమెరికా సేనేట్‌లో ప్రసంగం చేయడానికి జెలెన్‌స్కీకి ఆహ్వానం వచ్చింది. జూమ్ ద్వారా జరిగే సభా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఇటీవల జెలెన్‌స్కీతో టచ్‌లో ఉన్నారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి దిగిన నాటి నుంచి ఆ దేశానికి బైడెన్ మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. సేనేట్‌లో ఉన్న సభ్యులందరితో జెలెన్‌స్కీ మాట్లాడనున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన అంబాసిడర్ ఒక్‌సానా మర్కరోవా …
Read More »పుతిన్ ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్లు -వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన
రష్యాను రాజకీయ ఒత్తిళ్లతో వీడి అమెరికాలో ఉంటున్న వ్యాపారవేత్త కొనానిఖిన్ సంచలన ప్రకటన చేశాడు. పుతిన్ను అరెస్ట్ చేసినా లేదా చంపేసినా వన్ మిలియన్ డాలర్ల సొమ్మును బహుమతిగా ఇస్తానని తెలిపాడు. ఉక్రెయినపై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నాడని మండిపడ్డాడు. రష్యన్ పౌరుడిగా తన దేశాన్ని నాజీయిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత ఉందన్నాడు.
Read More »రష్యాకు గట్టి షాక్ ఇచ్చిన ఉక్రెయిన్
రష్యా సైనిక దళానికి చెందిన మేజర్ జనరల్ ను హతమార్చి రష్యాకు షాక్ ఇచ్చిన ఉక్రెయిన్ ఆ దేశానికి మరో గట్టి షాక్ ఇచ్చింది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన యుద్ధ విమానం సుఖోయ్ (SU-30 ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ను ఒక్క దెబ్బతో కూల్చేసింది. తమ గగనతలం మీదికి వచ్చిన సుఖోయ్ను పడగొట్టినట్లు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది. మరోవైపు రష్యా-ఉక్రెయిన్ మధ్య రెండోదశ చర్చలు కొనసాగుతున్నాయి.
Read More »ఉక్రెయిన్ యుద్ధం-6000 మంది రష్యన్లు మృతి
రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ఏడో రోజు కొనసాగుతోంది. 6 రోజుల్లో సుమారు 6000 మంది రష్యన్లు మరణించారని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ వెల్లడించారు. రష్యా దాడుల్లో తమ దేశానికి చెందిన 300 మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారు. అందులో 14 మంది పిల్లలు కూడా ఉన్నారన్నారు. మిసైళ్లు, షెల్లింగ్స్, యుద్ధ ట్యాంకులతో రష్యా విరుచుకుపడుతోంది. దక్షిణ ఉక్రెయిన్లోని ఖెర్సన్ నగరాన్ని స్వాధీనం చేసుకున్నామని ప్రకటించింది.
Read More »