తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు అండగా నిలుస్తున్న ప్రజాప్రతినిధులకు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేనంత భారీ వర్షాలు తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ప్రాంతాల్లో సంభవిస్తున్న వరదలకు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వరద బాధితులకు అండగా నిలవాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాలతో పార్టీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొంటున్నారని …
Read More »భద్రాచలం కు హెలికాప్టర్ పంపండి -సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. భద్రాచలం వద్ద గోదావరి 68 అడుగులు దాటి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపథ్యంలో వరదలకు జలమయం అవుతున్న లోతట్టు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికార యంత్రాంగాన్ని సీఎం కేసీఆర్ ఆదేశించారు. రక్షణ చర్యలు చేపట్టేందుకు కావాల్సిన ఎన్డీఆర్ఎస్, రెస్క్యూ బృందాలు సహా హెలికాప్టర్లను భద్రాచలానికి తరలించాలని సీఎస్ …
Read More »తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు పొడిగింపు
తెలంగాణ రాష్ట్రంలో విద్యాసంస్థలకు తెలంగాణ ప్రభుత్వం సెలవులు పొడిగించింది. రాష్ట్ర వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సోమ, మంగళ, బుధవారాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. నేటితో సెలవులు ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో వర్షాలు ఏ మాత్రం తగ్గలేదు. అన్ని జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు రోజులు విద్యాసంస్థలకు సెలవులను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గురు, శుక్ర, …
Read More »తెలంగాణ ఫుడ్స్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో అర్హులకు ఆరోగ్యమైన ఆహారం
మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణలో తెలంగాణ ప్రభుత్వం అగ్రస్ధానంలో వుందని తెలంగాణ రాష్ట్ర గిరిజన,స్ర్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారు అన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ కార్యాలయంలో తెలంగాణ ఫుడ్స్ కార్పొరేషన్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన మేడే రాజీవ్ సాగర్ ను మంత్రి సత్యవతి రాథోడ్ గారు, ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి …
Read More »వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
తెలంగాణలో కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు ప్రజలకు సూచించారు. కార్యాలయంలో ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. గతవారం రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఇప్పుడు సీజనల్ వ్యాధులతో పోరాడాలన్నారు. బ్యాక్టీరియా, వైరస్‌తో సీజనల్ వ్యాధులు ప్రబలుతాయని, పాముకాట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో ఇప్పటి వరకు 1,184 డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు.హైదరాబాద్‌లో 516, …
Read More »అభాగ్యులకు అండగా ఎమ్మెల్సీ కవిత
TRS ఎమ్మెల్సీ కవిత కష్టకాలంలో అభాగ్యులకు అండగా నిలుస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వర్ష బాధితులకు ఎమ్మెల్సీ కవిత చేయూతనిస్తున్నారు. ఆమె ఆదేశాల మేరకు జాగృతి కార్యకర్తలు లోతట్టు ప్రాంత ప్రజల ఆకలిని తీరుస్తున్నారు.వర్షపు నీరు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పలు కాలనీల ప్రజలకు ఆహార పొట్లాలను అందించారు. అలాగే కేసీఆర్ బువ్వకుండా ద్వారా వారి ఆకలిని తీర్చారు. నగరంలోని ధర్మపురి కాలనీ నాగారం, …
Read More »ప్రజలు కూడా అనవసరంగా ఇళ్ల నుండి బయటకు రావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగాన్ని మంత్రి కేటీఆర్ అప్రమత్తం చేశారు.జిల్లా కలెక్టర్, ఎస్పీ తో ఫోన్లో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కురుస్తున్న వర్షాల పై ఆరా తీశారు.అన్ని శాఖల జిల్లా అధికారులు జిల్లా కేంద్రంలోనే అందుబాటులో ఉండాలని ఆదేశించారు.భారీ వర్షాలకు వాగులు,వంకలు పొంగి పొర్లుతున్న కారణంగా ప్రజలను అప్రమత్తం చేయాలని అన్నారు.పాఠశాలలకు సెలవు ప్రకటించినందున …
Read More »రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావొద్దు
తెలంగాణ రాష్ట్రంలో భారీగా వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల పట్ల నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. భారీ వర్షాలు, వరదల పరిస్థితులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మరియు స్పెషల్ ఆఫీసర్ క్రిస్టిన తో ఫొన్ లో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత, లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. …
Read More »హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో మరో విదేశీ సంస్థ భారీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. విమానయాన రంగ ఉత్పత్తులను తయారుచేసే ఫ్రాన్స్ కు చెందిన దిగ్గజ సంస్థ శాఫ్రాన్ తన మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్ హాల్ (MRO) కేంద్రాన్ని ఏర్పాట చేసేందుకు హైదరాబాద్ ను ఎంచుకుంది. 15 కోట్ల అమెరికన్ డాలర్లతో ఈ విమాన ఇంజన్ల నిర్వహణ, మరమ్మత్తు కేంద్రాన్ని శాఫ్రాన్ ఏర్పాటు చేస్తుంది. ఇండియాలో తన …
Read More »ప్రజలపై ఆర్ధిక భారం మోపుతున్న మోడీ ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
కేంద్ర ప్రభుత్వం మరోసారి రూ.50 పెంచిన గ్యాస్ ధరలను నిరసిస్తూ కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని చింతల్ లో మహిళా నాయకురాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పాల్గొన్నారు. మహిళలు ఖాళీ సిలిండర్ ల ముందు మోడీ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ బిజెపి కేంద్ర ప్రభుత్వం ప్రజలపై ఆర్ధిక భారం మోపుతూ ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. …
Read More »