దేశ, విదేశీ ఉన్నత చదువుల కోసం రైతులతో పాటు డీసీసీబీ విద్యార్థులకు కూడా రుణాలు అందజేస్తుందని వ్యవసాయ,సహకార శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని తన నివాసంలో డీసీసీబీ ద్వారా విదేశీ విద్య కోసం రుణం అందుకున్న తొలి విద్యార్థి కరకాల హేమంత్ రెడ్డిని సన్మానించి రూ.23 లక్షల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ఉన్నత విద్య పేదలకు అందని ద్రాక్ష కాకూడన్నదే సీఎం కేసీఆర్ …
Read More »TRS ఎంపీలపై సస్సెన్షన్ వేటు సిగ్గుచేటు-మంత్రి కేటీఆర్
పార్లమెంట్ సమావేశాల్లో జీఎస్టీ,ధరల పెరుగుదలపై నిరసనలు వ్యక్తం చేస్తున్న టీఆర్ఎస్ ఎంపీల పై రాజ్యసభ నుంచి సస్సెన్షన్ వేటు సిగ్గుచేటని మంత్రి కేటీఆర్ అన్నారు. ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, జీఎస్టీ పెంపుపై చర్చకు ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.‘ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదల, నిత్యావసరాల మీద జీఎస్టీ పెంపుపై చర్చకు అంగీకరించకుండా కేంద్ర ప్రభుత్వం టీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ముగ్గురు …
Read More »నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం
నాగార్జున సాగర్ జలాశయానికి వరద ప్రవాహం కొనసాగుతున్నది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 57,669గా ఉన్నది. విద్యుత్ ఉత్పత్తికి 5,378 క్యూసెక్కుల నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 544.50 అడుగుల నీరుండగా.. పూర్తిస్థాయినీటిమట్టం 590 అడుగులు. సాగర్ డ్యామ్ గరిష్ఠస్థాయి 312.04 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 201.13 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.
Read More »నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత,రాష్ట్ర సీఎం కేసీఆర్ నేడు సోమవారం సాయంత్రం దేశ రాజధాని మహానగరం ఢిల్లీ వెళ్లే అవకాశమున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు చెబుతున్నాయి. మూడు రోజులు అక్కడే ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులను కలిసే అవకాశం ఉంది.
Read More »డాక్టర్ అవతారమెత్తిన గవర్నర్ తమిళ సై
తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళపై ఓ వ్యక్తికి చికిత్స అందించారు. నిన్న శుక్రవారం అర్థరాత్రి ఢిల్లీ-హైదరాబాద్ ఇండిగో విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి ఛాతిలో నొప్పితో పాటు ఇతర సమస్యలు వచ్చాయి. దీంతో విమానంలో ఎవరైనా డాక్టర్లు ఉంటే సాయం చేయాలని ఫ్లైట్ సిబ్బంది అనౌన్స్ చేశారు.. అదే విమానంలో ప్రయాణిస్తున్న గవర్నర్ అతడికి ప్రాథమిక చికిత్స అందించి ధైర్యం చెప్పారు. రాజకీయాల్లోకి రాకముందు ఎంబీబీఎస్, ఎండీ-డీజీఓ ను తమిళపై …
Read More »రానున్న 3, 4 రోజులు జాగ్రత్త- సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో సర్కారు అప్రమత్తమైంది. మరో 3, 4 రోజుల పాటు వర్గాలు ఉన్నందున ఎగువ నుంచి గోదావరి నదిలోకి వరద వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. గోదావరి నది పరీవాహక ప్రాంత మంత్రులు, ప్రజాప్రతినిధులు అలెర్ట్ గా ఉండాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని, ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని సూచించారు.
Read More »వర్షాలు.. అప్రమత్తంగా ఉండండి-మంత్రి ఐకే రెడ్డికి సీఎం కేసీఆర్ ఫోన్
తెలంగాణలో గత మూడురోజులుగా కురుస్తున్న ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ప్రాజెక్ట్ లు, చెరువులు, కుంటల్లో పరిస్థితిపై సీయం కేసీఆర్ ఆరా తీశారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో ఫోన్లో మాట్లాడిన సీయం… ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా అన్ని చర్యలు తీసుకోవాలని, వరద ముంపునకు గురయ్యే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు …
Read More »ప్రపంచ పెట్టుబడులకు నిలయంగా రాజధాని నగరం హైదరాబాద్
తెలంగాణ సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విప్లవాత్మకమైన విధానాలు ప్రపంచ పెట్టుబడులకు రాజధాని నగరం హైదరాబాద్‌ను నిలయంగా మార్చాయని రాష్ట్ర ఆర్థిక & వైద్యారోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఈ రోజు శనివారం ఉదయం నగరంలోని గచ్చిబౌలిలోని ఆస్పైర్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ ప్రయివేట్ లిమిటెడ్ సేవలను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ అధ్వర్యంలో …
Read More »తెలంగాణ నిరుద్యోగ యువతకు శుభవార్త
తెలంగాణలో సర్కారు కొలువులకై ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు శుభవార్త. ఈ క్రమంలో రాష్ట్రంలో ఉద్యోగాల జాతరలో భాగంగా మరో 2,440 పోస్టుల భర్తీకి రాష్ట్ర ఆర్థికశాఖ పచ్చజెండా ఊపింది. విద్యాశాఖతో పాటు, స్టేట్ ఆర్కైవ్స్ డిపార్ట్‌మెంట్లలో పోస్టుల భర్తీకి అనుమతిఇచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కే రామకృష్ణారావు శుక్రవారం 5 వేర్వేరు జీవోలను జారీ చేశారు. ఇంటర్ విద్యలో 1,523 పోస్టులకు జీవో-117, కళాశాల విద్యలో …
Read More »KTR Birthday-మంత్రి కేటీఆర్ సంచలన నిర్ణయం
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు పురపాలక శాఖమంత్రి,అధికార టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు రేపు పుట్టిన రోజు సందర్భంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలున్న నేపథ్యంలో తన జన్మదిన వేడుకలకు దూరంగా ఉంటున్నట్లు టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారకరామారావు తెలిపారు. వర్షాల వలన, పలు జిల్లాల్లో వరదల వలన ప్రజలు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు …
Read More »