ప్రముఖ పాత్రికేయులు, మాజీ ప్రెస్ అకాడమీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్ను మూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం విజయనగర్ కాలనీలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. 1934 ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లాలో జన్మించిన పొత్తూరి పత్రికా రంగంలో 5 దశాబ్దాలకు పైగా సేవలందించారు. 2000లో ‘నాటి పత్రికల మేటి విలువలు’ పేరిట పుస్తకం రచించారు. అదే విధంగా 2001లో చింతన, చిరస్మరణీయులు పుస్తకాలను రచించారు. పీవీ గురించి …
Read More »పొత్తూరి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిపట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పత్రికా, సామాజికరంగాల్లో చేసిన కృషిని, అందించిన సేవలను సీఎం కొనియాడారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పొత్తూరి అందించిన నైతిక మద్దతును కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. పొత్తూరి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Read More »పొత్తూరి వెంకటేశ్వరరావు కన్నుమూత
ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు(86) కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన తన నివాసంలో కన్నుమూశారు. తెలుగు జర్నలిజంలో తనదైన ముద్ర వేసిన పొత్తూరి వెంకటేశ్వరరావు ఈనాడు, ఆంధ్రభూమి, వార్తా పత్రికల్లో పనిచేశారు. పత్రికారంగంలో ఐదు దశాబ్దాలకు పైగా సేవలు అందించారు. పొత్తూరి 1934 ఫిబ్రవరి 8వ తేదీన ఏపీలోని గుంటూరు జిల్లా పొత్తూరులో జన్మించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ప్రెస్ అకాడమీ చైర్మన్‌గా పనిచేశారు.
Read More »ప్రముఖ పాత్రికేయలు పొత్తూరి మృతిపట్ల వేణుంబాక సంతాపం !
ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతిచెందిన విషయం అందరికి తెలిసిందే. పత్రికా, సామాజికరంగాల్లో ఆయన చేసిన కృషి అందించిన సేవలు మరువలేనివి. ఆయన మృతి పట్ల వైసీపీ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా సంతాపం పలికారు. “ప్రముఖ సీనియర్ పాత్రికేయలు పొత్తూరి వెంకటేశ్వరరావు మృతికి నా ప్రగాఢ సంతాపం. పాత్రికేయుడిగా, పత్రికా సంపాదకుడిగా తెలుగు పత్రికా రంగానికి అయిదు దశాబ్దాలపాటు ఆయన అందించిన …
Read More »