USAకు చెందిన మరిసా ఫొటియో అనే మహిళ షికాగో నుంచి ఐర్లాండ్ వెళ్లే విమానం ఎక్కింది. గొంతు నొప్పిగా ఉండటంతో.. బాత్రూంకు వెళ్లి స్వయంగా ర్యాపిడ్ టెస్ట్ చేసుకోగా పాజిటివ్ గా తేలింది. దీంతో అటెండెంట్కు విషయం చెప్పి.. విమానం ల్యాండ్ అయ్యేవరకు 3గంటల పాటు బాత్రూంలో ఐసోలేషన్లో గడిపింది. గత నెల 19న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా బయటకు రాగా.. తోటి ప్రయాణికులకు కరోనా సోకకుండా ఆమె …
Read More »ఆ వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా వాడోచ్చు..!
హెల్త్ వర్కర్లు, ఫ్రంట్ లైన్ వర్కర్లకు (పోలీసులు, రెవెన్యూ, మున్సిపల్, పంచాయతీరాజ్ ఉద్యోగులు) జనవరి 10 నుంచి బూస్టర్ డోసులు ఇవ్వనున్నారు. దీర్ఘకాలిక వ్యాధులుండి, 60 ఏళ్లు దాటిన వారూ బూస్టర్ డోసు పొందేందుకు అర్హులు .. ఇందుకోసం రెండు డోసులు పొంది 9 నెలలు పూర్తికావాలి. ఇంతకుముందు ఏ వ్యాక్సిన్ పొందారో అదే వ్యాక్సిన్ బూస్టర్ డోసుగా ఇస్తారు. ఇందుకోసం కొవిన్ యాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
Read More »ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు
ఏపీలో కొత్తగా మరో ఒమిక్రాన్ కేసు నమోదైంది. దీంతో ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 17కు చేరింది. UAE నుంచి బెంగళూరు ఎయిర్పోర్టులో దిగి ప్రకాశం జిల్లాకు వచ్చిన 52 ఏళ్ల మహిళకు డిసెంబర్ 24న కరోనా పాజిటివ్ గా తేలింది. ఆమె నమూనాలను HYD సీసీఎంబీలో పరిశీలించగా.. ఒమిక్రాన్గా నిర్ధారణ అయ్యింది. ఆమెకు సన్నిహితంగా ఉన్న 14 మందికి కరోనా టెస్టులు చేయగా.. నెగిటివ్ వచ్చినట్లు అధికారులు చెప్పారు.
Read More »ముంబైలో కరోనా కలవరం
ముంబైలో కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉంది. గత 24 గంటల్లో 5,428 కోత్త కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే ఈ కేసుల 2,510 అధికం. అటు మహారాష్ట్రవ్యాప్తంగా 8,067 కేసులు నమోదయ్యాయి. 8 మంది కొవిడ్ వల్ల చనిపోయారు. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ఆ రాష్ట్ర సర్కారు అప్రమత్తమైంది. ఆస్పత్రుల్లో ఆక్సిజన్, అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించింది.
Read More »తెలంగాణలో కొత్తగా 311 కరోనా కేసులు
తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 36,759 టెస్టులు చేయగా.. 311 మందికి పాజిటివ్ వచ్చింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,81,898కు చేరాయి. .. గడిచిన 24 గంటల్లో 222 మంది కరోనా నుంచి కోలుకున్నారు. అటు విదేశాల నుంచి వచ్చిన 159 మందికి టెస్టులు చేయగా.. 7 మందికి పాజిటివ్ రాగా, వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్కు పంపారు.
Read More »అమెరికాలో కరోనా కల్లోలం
అమెరికాలో కరోనా కల్లోలం సృష్టిస్తోంది. క్రిస్మస్, న్యూఇయర్ వేడుకల కోసం జనం పెద్ద సంఖ్యలో ప్రయాణాలు చేస్తుండటంతో వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అమెరికాలో రోజువారీ కరోనా కొత్త కేసులు ఇప్పుడు 2లక్షల మార్కుకు చేరువయ్యాయి. అతి త్వరలోనే ఆ సంఖ్య తొలిసారి 5లక్షల మార్కును తాకే అవకాశం ఉంది. జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం వెల్లడించిన డేటా ప్రకారం ప్రతిరోజూ సగటున 1,98,404 కొత్త కేసులు నమోదవుతున్నాయి.
Read More »ఇంగ్లండ్ క్యాంప్ లో కరోనా కలవరం
ఇంగ్లండ్ క్యాంప్ లో మొత్తం 6 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయిందని తెలుస్తోంది. అయితే.. జట్టు సపోర్టింగ్ స్టాఫ్, ఆటగాళ్ల కుటుంబ సభ్యులకు మాత్రమే పాజిటివ్ వచ్చిందట. ప్రస్తుతానికి ఆటగాళ్లకెవరికీ వైరస్ సోకలేదని తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఆస్ట్రేలియాతో జరుగుతున్న యాషెస్ సిరీస్లో ఓటమి ముంగిట ఇంగ్లండ్ జట్టు కొట్టుమిట్టాడుతోంది. మరి ఈ సిరీస్ కొనసాగుతుందా..? లేక రద్దవుతుందా..? వేచి చూడాలి.
Read More »తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య తాజాగా 12
తెలంగాణలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా మరో 12 కేసులు నమోదు కాగా.. మొత్తం కేసుల సంఖ్య 55కి చేరింది. తాజా కేసుల్లో రాజన్న సిరిసిల్ల ముస్తాబాద్ (మ) గూడెం గ్రామానికి ఇటీవల వచ్చిన ఓ యువకుడికి ఒమిక్రాన్ వచ్చింది .. తాజాగా అతడి తల్లి, భార్యకు కూడా ఒమిక్రాన్ గా నిర్ధారణ అయ్యింది. అలాగే ఎల్లారెడ్డిపేట(మ) నారాయణపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ …
Read More »తెలంగాణలో తగ్గని కరోనా కేసులు
తెలంగాణలో కొత్తగా 2,070 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. తాజాగా 18 మంది మహమ్మారికి బలయ్యారు. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 3,762 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,89,734కు చేరింది. ఇప్పటికీ 5,57,162 మంది కోలుకున్నారు. మొత్తం ఇప్పటివరకూ కరోనాతో 3,364 మంది చనిపోయారు. యాక్టివ్ కేసులు 29,208 ఉన్నాయి. ఒక్కరోజు వ్యవధిలో 1,38,182 టెస్టుల చేసినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది.
Read More »