రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతుంటే కడుపుమంటతో టీడీపీ అనవసర రాద్ధాంతం చేస్తోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. కొంతమంది టీడీపీ కార్యకర్తలే ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని ఆరోపించారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో మూడేళ్లలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఓడిపోయిన టీడీపీ నేతలను గడపగడపకు పంపాలని.. ధైర్యం ఉంటే వాటన్నింటినీ వీడియో తీసిపెట్టాలని సజ్జల సవాల్ …
Read More »నేపాల్ నైట్ క్లబ్‌లో రాహుల్ గాంధీ..
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఓ నైట్ క్లబ్‌లో పార్టీ చేసుకుంటున్నట్లు ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నేపాల్ రాజధాని ఖాట్మండులో ఓ పెళ్లికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కడి నైట్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన పార్టీలో ఓ మహిళతో రాహుల్ మాట్లాడుతున్నట్లుగా ఉన్న వీడియో బయటకు వచ్చింది. తన జర్నలిస్ట్ ఫ్రెండ్ పెళ్లి రాహుల్ హాజరైనట్లు లోకల్ మీడియా వెల్లడించింది. అయితే ప్రస్తుతం వైరల్ …
Read More »టీడీపీ వాళ్లే నాపై దాడి చేయించారు: వైసీపీ ఎమ్మెల్యే తలారి వెంకట్రావు
జి.కొత్తపల్లిలో వైసీపీ నేతలు తనపై దాడి చేయలేదని..టీడీపీ వాళ్లే వెనకుండి దాడి చేయించారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. ఏలూరు జిల్లా జి.కొత్తపల్లిలో తనపై జరిగిన దాడి ఘటనపై ఎమ్మెల్యే స్పందించారు. జి.కొత్తపల్లిలో వైసీపీ నేతల మధ్య విభేదాలు ఉన్నమాట వాస్తవమేనని.. వారి మధ్య వివాదాన్ని రాజీ చేసినట్లు చెప్పారు. వైసీపీ నేత గంజి ప్రసాద్ హత్యపై దర్యాప్తు జరిపి చర్యలు తీసుకునేలా చూస్తామన్నారు. హత్యకు గురైన గంజి …
Read More »ఆవేశంలోనే అలా అనేశాను: వైసీపీ ఎమ్మెల్యే బాబూరావు
మంత్రి పదవి విషయంలో మాట్లాడిన మాటలు ఆవేశంతో అన్నవే తప్పించి తన మనసులో నుంచి రాలేదని పాయకరావుపేట వైసీపీ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు అన్నారు. ఇటీవల ఏపీ కేబినెట్ విస్తరణలో చోటు దక్కకపోవడంపై ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో పాయకరావుపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో బాబూరావు మాట్లాడారు. మంత్రి పదవి విషయంలో తనకు ఎలాంటి అసంతృప్తి లేదని చెప్పారు. నియోజకవర్గ ప్రజల కోసం …
Read More »‘గవర్నర్‌జీ..ఎన్టీఆర్ టైమ్‌లో జరిగిందేంటో గుర్తు చేసుకోండి’
ఢిల్లీ పర్యటనలో తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు రాజకీయాల్లో హట్‌టాపిక్‌గా మారుతున్నాయి. గవర్నర్ బీజేపీ నేతలా మాట్లాడుతున్నారని ఇప్పటికే పలువురు టీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. గురువారం సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్ కూడా గవర్నర్ కామెంట్స్‌పై రెస్పాండ్ అయ్యారు. గవర్నర్ గౌరవానికి భంగం కలిగించలేదని.. ఆమెను అవమానించలేదని చెప్పారు. గవర్నరే అన్నీ ఊహించుకుని మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. లేటెస్ట్‌గా టీఆర్‌ఎస్‌కు చెందిన మహిళా …
Read More »ఏపీ కేబినెట్.. 24 మంది మంత్రుల రాజీనామా
ఏపీ మంత్రివర్గంలో 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. కేబినెట్ భేటీ అనంతరం తమ రాజీనామాలను సీఎం జగన్‌కు అందజేశారు. కేబినెట్ సమావేశంలో 36 అంశాలకు సంబంధించి నిర్ణయాలు తీసుకున్నారు. సంగం బ్యారేజ్‌కి దివంగత మంత్రి గౌతమ్‌రెడ్డి పేరు, మిల్లెట్ మిషన్ పాలసీ, డిగ్రీ కాలేజీల్లో 574 టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టుల భర్తీ వంటి ప్రతిపాదనలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజీనామాలను ఈ రాత్రికే గవర్నర్ ఆమోదించే అవకాశం …
Read More »డీకే శివకుమార్ ఛాలెంజ్.. కేటీఆర్ కౌంటర్
కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్, టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ మధ్య ట్విటర్‌లో ఆసక్తికర చర్చ జరిగింది. దీనికి ఖాతాబుక్ సీఈవో రవీష్ నరేష్ చేసిన కామెంట్సే ప్రధాన కారణం. బెంగుళూరులో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సరిగా లేదని.. రోజూ పవర్‌కట్‌లు వేధిస్తున్నాయంటూ కొద్దిరోజుల క్రితం రవీష్ నరేష్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌పై కేటీఆర్ స్పందిస్తూ మీరంతా హైదరాబాద్ రావొచ్చని.. ఇక్కడ బెస్ట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఉందని పేర్కొన్నారు. …
Read More »పాలిటిక్స్‌లోకి ఎన్టీఆర్ వస్తున్నారా? క్లారిటీ ఇచ్చిన తారక్!
జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడనే చర్చ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతూనే ఉంటుంది. 2009 ఎన్నికల సమయంలో టీడీపీ తరఫున ఎన్నికల ప్రచారం చేసినా.. ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాలతో ఆ పార్టీకి ఎన్టీఆర్ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆర్‌ఆర్‌ఆర్ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో ఓ హిందీ ఛానల్‌కు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో రాజకీయరంగ ప్రవేశంపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం చెప్పారు. తన …
Read More »రేవంత్.. ఫ్యూచర్‌లో నీకు ఝలక్ ఇస్తా చూడు: జగ్గారెడ్డి
హైదరాబాద్: పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితోనే తనకు పంచాయితీ అని.. కాంగ్రెస్‌తో కాదని సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. నిజాలను నిర్మోహమాటంగా నిజాలు మాట్లాడటం తన స్వభావమని చెప్పారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రేవంత్‌రెడ్డితో ఉన్న విభేదాలపై చెప్పారు. ‘ఇది మా ఇద్దరి గుణగణాల పంచాయితీ. మెదక్ పర్యటనకు రేవంత్ వెళ్తే నాకు చెప్పలేదు. నాకు పిలవకపోవడంతో కోపం వచ్చింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచా. అలాంటి వ్యక్తికి …
Read More »అసలు వాళ్లు తెలంగాణ బిడ్డలేనా?: కవిత
హైదరాబాద్: యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్ర బీజేపీ నేతలు వితండ వైఖరి అవలంబిస్తున్నారని టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అసలు వీళ్ల వైఖరి చూస్తుంటే తెలంగాణ బిడ్డలేనా అనిపిస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఈ మేరకు కవిత ట్వీట్ చేశారు. ధాన్యం సేకరణకు దేశమంతా ఒకే విధానం ఉండాలంటూ రైతుల పక్షాన సీఎం కేసీఆర్ స్పష్టంగా డిమాండ్ చేశారని చెప్పారు. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు ఒక నీతి, ఇతర …
Read More »