తన అన్నయ్య చిరంజీవి, తమ్ముడు పవన్‌కళ్యాణ్‌ను ఉద్దేశించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే గట్టిగా కౌంటర్ ఇస్తానని సినీనటుడు నాగబాబు చెప్పారు. చిరంజీవి బర్త్‌డే సందర్భంగా నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. ఎలాంటి సినిమా బ్యాగ్రౌండ్ లేకపోయినా చిరంజీవి 21 ఏళ్ల వయసులో ఇండస్ట్రీలోకి వచ్చి ఇంతటి సామ్రాజ్యాన్ని నెలకొల్పారని చెప్పారు. ఎంత సాధించినా ఆయన్ను కొందరు ఎందుకు విమర్శిస్తారో అర్థం కావట్లేదన్నారు. తనను నిర్మాతగా …
Read More »టీడీపీ గ్రాఫ్ లేవడం లేదు.. అందుకే ఆ సర్వే..: పేర్ని నాని
ఏపీ సీఎం జగన్ గ్రాఫ్ పడిపోయిందనడం విచిత్రంగా ఉందని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పేర్ని నాని అన్నారు. సెంటర్ ఫర్‌నేషనల్ స్టడీస్ సంస్థ టీడీపీ జీతగాడు రాబిన్ శర్మదేనని.. అందుకే వాళ్లు అలా నివేదిక ఇచ్చారని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో కలిసి గ్రాఫ్‌పెంచుకోవాలని టీడీపీ చూసిందని.. కానీ అలా జరగలేదన్నారు. తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్ వల్ల గ్రాఫ్ లేవడం లేదని.. టీడీపీని కాపాడుకోవడానికే చేయించిన …
Read More »ఇంతకీ పవన్ బీజేపీతో పొత్తులో ఉన్నట్టా? లేనట్టా?: అంబటి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిలకడలేని వ్యక్తి అని.. ఆయన ఎప్పుడు ఏ పార్టీతో పొత్తు పెట్టుకుంటారో జనసేన కార్యకర్తలకు కూడా అర్థం కాదని మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీ ఇచ్చే రోడ్డు మ్యాప్ కోసం వెయిట్ చేస్తున్నామన్న పవన్… ఆత్మకూరులో బీజేపీ పోటీ చేస్తుంటే ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఇంతకీ ఆయన …
Read More »పవన్ యాత్ర ఎందుకో ఆయనకైనా తెలుసా?: ఆర్కే రోజా
టెన్త్ ఫలితాలపైనా టీడీపీ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని ఏపీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టింది జనం కోసమా? చంద్రబాబు కోసమా? అని ప్రశ్నించారు. చంద్రబాబుకు కష్టం వస్తే పవన్ ప్రెస్ మీట్ పెట్టడమో.. యాత్ర చేయడమో చేస్తారని చెప్పారు. ఇప్పుడు బస్సు యాత్ర అంటూ వస్తున్నారని.. అది ఎందుకో ఆయనకైనా తెలుసా? …
Read More »మనల్ని తిట్టిన వాళ్లే సడెన్‌గా పొగుడుతారు: పవన్ ట్వీట్ వైరల్
పొత్తులపై జనసేన ముందు మూడు ఆప్షన్లు అంటూ ఇటీవల ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ మాట్లాడిన విషయం తెలిసిందే. బీజేపీతో ప్రభుత్వాన్ని స్థాపించడం, టీడీపీ+బీజేపీతో కలిసి స్థాపించడం , జనసేన ఒక్కటే స్థాపించడం.. ఇలా మూడు ఆప్షన్ల గురించి ఆయన చెప్పారు. అక్కడితో ఆగకుండా 2014, 2019 ఎన్నికల్లో వెనక్కి తగ్గామని.. ఈసారి మాత్రం అలా ఒప్పుకోబోమంటూ పరోక్షంగా సీఎం పదవి జనసేనకే దక్కాలంటూ వ్యాఖ్యానించారు. అప్పటి వరకూ …
Read More »పవన్ కల్యాణ్‌కి కేఏ పాల్ బంపర్ ఆఫర్!
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బంపరాఫర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ తన పార్టీలో చేరితే ఎంపీ, ఎమ్మెల్యే.. ఈ రెండింట్లో ఏదో ఒకటి అయ్యేలా చేస్తామన్నారు. అలా చేయకపోతే రూ.వెయ్యికోట్లు ఇస్తానని చెప్పారు. ఓ న్యూస్ ఛానల్‌తో మాట్లాడుతూ కేఏ పాల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకున్నా గెలవరన్నారు. ప్రజాశాంతి పార్టీలో ఏ పదవి కావాలన్నా …
Read More »చిరంజీవి ఫ్యాన్స్‌కు నాగబాబు బ్లాక్‌మెయిల్: వెలంపల్లి
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఏపీకి పనికిరాని వ్యక్తి అని.. చిరంజీవి లేకపోతే పవన్ ఎవరికి తెలుసని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ అన్నారు. మెగాస్టార్ లేనిదే పవర్ స్టార్ ఎక్కడని ప్రశ్నించారు. విజయవాడలోని పశ్చిమ నియోజకవర్గంలో నిర్వహించిన ‘గడప గడపకి మన ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన పాల్గోన్నారు. ఈ సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ మెగా బ్రదర్, జనసేన నేత నాగబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. …
Read More »పవన్‌కు ఆ ప్రొసీజర్ కూడా తెలీదు: కొడాలి నాని ఎద్దేవా
డా.బీఆర్.అంబేడ్కర్‌ను వ్యతిరేకించే వాళ్లను ఈ దేశం నుంచి బహిష్కరించాలని వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడలో ‘గడప గడపకు ప్రభుత్వం’ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్‌లను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ చదువుతున్నారని విమర్శించారు. చిన్నపిల్లలను రెచ్చగొట్టి తన పబ్బం గడుపుకుంటున్నారని ఆయన ఆరోపించారు. కొత్త జిల్లాలపై అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వడం రాజ్యాంగం ప్రకారం ప్రొసీజర్ అని.. అది కూడా పవన్‌కు …
Read More »చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ చదువుతున్నారు: మంత్రి రోజా
వైసీపీ పాలనపై బురద చల్లేందుకే ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఏపీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. అమలాపురం ఘటనల్లో తప్పు చేసిన వారిని విడిచిపెట్టేదే లేదని ఆమె తేల్చి చెప్పారు. అమరావతిలో రోజా మీడియాతో మాట్లాడారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్ పేరు పెడితే ఆందోళనలు చేయడం బాధాకరమని విమర్శించారు. ఈ కుట్రల వెనుక ఎవరున్నారో వాళ్లని బయటకు తీస్తామని చెప్పారు. చంద్రబాబు స్క్రిప్ట్‌నే పవన్ కల్యాణ్ చదువుతున్నారని.. ప్యాకేజీ తీసుకుని …
Read More »వెనకుండి రెచ్చగొట్టడం కాదు.. మీడియా ముందుకు రండి: వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్
పచ్చని కోనసీమలో కొన్ని సంఘ విద్రోహ శక్తులు అశాంతిని రేకెత్తించాయని వైసీపీ ఎంపీ పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఆరోపించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకే కోనసీమకు డా బీఆర్ అంబేడ్కర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం పెట్టిందని చెప్పారు. చంద్రబాబు కూడా అంబేడ్కర్ జిల్లా పేరు పెడతామని చెప్పారని సుభాష్‌చంద్రబోస్ గుర్తుచేశారు. బయట ఒకలా..లోపల మరోలా చెప్పొద్దని.. చంద్రబాబు, పవన్‌కల్యాణ్ మీడియా ముందుకు రావాలన్నారు. వెనుకనే ఉండి రెచ్చగొట్టడం సరికాదని ఆగ్రహం …
Read More »