తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా విద్యార్థులను వాళ్ల తల్లిదండ్రులను మమేకం చేసేందుకు ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నెలలో ప్రతి మూడో శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల విద్యాసంస్థల్లో పేరెంట్స్ టీచింగ్ మీటింగ్ (పీటీఎం)ను నిర్వహిస్తామని ట్విట్టర్ వేదికగా తెలంగాణ విద్యాశాఖ తెలిపింది. పిల్లల ప్రగతిలో తల్లిదండ్రుల పాత్ర గురించి సరైన అవగాహన కల్పిస్తూ వారిని భాగస్వాములను చేస్తామని ఈ సందర్భంగా …
Read More »ఈ నెల 9న ఇంటర్ ఫలితాలు
తెలంగాణలో ఈ నెల 9వ తేదీన మంగళవారం ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. మంగళవారం ఉదయం 11 గంటలకు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డులో ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఎగ్జామ్స్ మార్చి 15వ తేదీ నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు ఐదు లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ …
Read More »మరికాసేపట్లో ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర ప్రారంభం
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని ఖైరతాబాద్ గణనాథుని శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానున్నది. ప్రస్తుతం మహా గణపతిని భారీ క్రేన్ సహాయంతో ట్రాలీ పైకి ఎక్కిస్తున్నారు. అనంతరం వెల్డింగ్ పూర్తిచేసి.. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభంకానుంది. ఈనేపథ్యంలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించుకుని చివరి పూజలు చేశారు. అనంతరం మాట్లాడుతూ.. గణేష్ శోభాయాత్ర, నిమజ్జనం కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. హైదరాబాద్‌లో నిర్వహించే …
Read More »తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియర్
తెలంగాణలో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియరైంది. పదోన్నతులు లేకుండా కేవలం బదిలీలకే అవకాశం కల్పిస్తామని పదోన్నతుల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో న్యాయ సలహా మేరకు బదిలీలు మాత్రమే నిర్వహిస్తామని బుధవారం సంఘ నేతలతో అధికారుల సమావేశం జరిగింది అని విశ్వసనీయ సమాచారం. ఇందులో భాగంగా వివిధ అంశాలపై చర్చించిన తర్వాత బదిలీలు మాత్రమే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు. బదిలీలు మాత్రం జూన్ మూడో వారంలోనే నిర్వహించాలని.. ఈ నెల 21 …
Read More »విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లు
తెలంగాణలోని సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థులకు వారానికి 3 సార్లు కోడి గుడ్లను తప్పనిసరిగా ఇవ్వాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన అధికారులను ఆదేశించారు. వేడిగా ఉన్న ఆహారమే వడ్డించాలని.. ముందుగా హెడ్మాస్టర్, టీచర్లు రుచి చూడాలని సూచించారు. పోషక విలువల గల భోజనం పెట్టాలన్నారు. మంచినీరు కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరోవైపు విద్యార్థులకు ఇచ్చే కోడిగుడ్ల సేకరణ ధరను ప్రభుత్వం రూ.4 నుంచి రూ.5కు పెంచింది.
Read More »టీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలోని టీఆర్‌ఎస్ పాలనలోనే గ్రామాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా.. బుధవారం జిల్లాలోని మహేశ్వరం మండలం గొల్లూరులో పల్లె ప్రగతి కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రా రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన మంత్రులు.. …
Read More »అమిత్ షా.. టూరిస్టులా వచ్చిపోతామంటే కుదరదు: మంత్రి సబితా ఇంద్రారెడ్డి
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణపై పర్యటనపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఘాటుగా స్పందించారు. ఊరికే చుట్టపు చూపులా.. టూరిస్టులా వచ్చి పోతామంటే కుదరదు అని అమిత్ షా పర్యటనను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పాలమూరు ఎత్తిపోతలకు జాతీయ హోదా ప్రకటించాలని, విభజన హామీలను నెరవేర్చాలని సబిత డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ ఎల్పీలో ఎంపీ రంజిత్ రెడ్డి, ఎమ్మెల్యేలు మంచి రెడ్డి కిషన్ రెడ్డి, జైపాల్ యాదవ్ లతో కలిసి …
Read More »వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు
వ్యవసాయం బాగుంటేనే అందరూ బాగుంటారు. సీఎం కేసీర్ తెలంగాణలో వ్యవసాయానికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్‌లో సోమవారం నిర్వహించిన వానకాలం పంటల సాగు సన్నద్ధత- అవగాహన సదస్సులో అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో కలిసి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ నిరంతరం రైతుల అభ్యున్నతి కోసం ఆలోచిస్తున్నారని తెలిపారు. …
Read More »రాబోయే పదేండ్లలో 16 లక్షల ఉద్యోగాలు
ఎలక్ట్రానిక్ పరికరాల ఉత్పత్తి రంగంలో రాబోయే పదేండ్లలో రెండున్నర లక్షల కోట్ల ఆదాయం, 16 లక్షల ఉద్యోగాలు సృష్టించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే తెలంగాణ అన్ని రంగాల్లో దూసుకెళ్తుందని, స్థిరమైన ప్రభుత్వం, సమర్థవంతమైన నాయకుడు ఉన్నందునే ఇది సాధ్యమవుతుందని ఉద్ఘాటించారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని రావిర్యాల ఈ-సిటీలో రేడియంట్ ఎలక్ర్టానిక్స్ యూనిట్‌లో మరో నూతన …
Read More »మన ఊరు- మన బడిపై రాష్ట్ర మంత్రివర్గ ఉపసంఘం భేటీ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మన ఊరు-మన బడి అమలు తీరుపై మంత్రివర్గ ఉపసంఘం భేటీ అయింది. మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరుగుతున్న ఈ సమావేశంలో మంత్రి కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవతి రాథోడ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
Read More »