పారిజాతం, మందారం, సంతాన వృక్షం, కల్పవృక్షం, హరిచందనం ఈ ఐదింటిని దేవతా వృక్షాలని అంటారు. వీటికి మాలిన్యం ఉండదు. లక్ష్మీదేవితోపాటు క్షీరసాగరం నుంచి పుట్టిన పారిజాతం ఎంతో శ్రేష్ఠమైనది. సత్యభామ కోరిక మేరకు శ్రీకృష్ణుడు దేవలోకానికి వెళ్లి, ఇంద్రుణ్ని జయించి పారిజాత వృక్షాన్ని భూలోకానికి తెచ్చాడని పురాణ గాథ.పారిజాత పూలు సువాసనలు గుప్పిస్తూ తెలుపు, నారింజ వర్ణంలో ఆహ్లాదకరంగా కనిపిస్తాయి. వీటితో దేవతార్చన చేస్తే సకల శుభాలూ కలుగుతాయని నమ్మకం. …
Read More »