వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను కేంద్రం అత్యుత్తమ పురస్కారంతో సత్కరించనున్నట్లు తెలుస్తోంది. పాక్ చెరలో చిక్కినప్పుడు ఆయన ప్రదర్శించిన ధైర్య పరాక్రమాలకుగానూ ‘వీర్ చక్ర’ పురస్కారాన్ని ప్రదానం చేయనున్నట్లు సమాచారం. సైన్యానికి పరమ్‌వీర చక్ర, మహా వీర చక్ర తర్వాత ఇది మూడో అత్యున్నత పురస్కారం. ఈ ఏడాది ఫిబ్రవరి 26న పాకిస్థాన్ ఎయిర్ ఫోర్సుకు చెందిన ఎఫ్-16ను తాను ప్రయాణిస్తున్న మిగ్ విమానంతో అభినందన్ కూల్చివేసిన సంగతి తెలిసిందే. …
Read More »