పచ్చని వాతావరణంతో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరిసరాలు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు ప్రాణవాయువును అందిస్తున్నాయని రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారం కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ డెవలప్ మెంట్ అథారిటీ హెచ్ఎండీఏ సహకారంతో ఉస్మానియాలో ఏర్పాటు చేసిన ఆక్సీజన్ పార్క్ ను ఓయూ ఉపకులపతి ఆచార్య డి. రవిందర్ తో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీతో కలిసి ఆక్సీజన్ పార్క్ …
Read More »పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
తెలంగాణలో పీజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష.. సీపీజీఈటీ-2022 నోటిఫికేషన్ విడుదలైంది. రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ లింబాద్రి దీన్ని విడుదల చేశారు. దీని ద్వారా ఉస్మానియా, కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మాగాంధీ, పాలమూరు, జేఎన్‌టీయూ హైదరాబాద్,మహిళా యూనివర్సిటీల్లో పీజీ కోర్సులకు ప్రవేశాలు కల్పిస్తారు. జులై 4 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. లేట్ ఫీతో జులై 15 వరకు అవకాశముంది. జులై 20న ఆన్‌లైన్‌లో ప్రవేశ …
Read More »ఓయూలో రాహుల్ పర్యటన.. ఎన్‌ఎస్‌యూఐ పిటిషన్ కొట్టేసిన హైకోర్టు
ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పర్యటనకు అనుమతిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ ఎన్‌ఎస్‌యూఐ నేతలు దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించిన నేపథ్యంలో ఎన్‌ఎస్‌యూఐ నేతలు ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. పిటిషన్‌ను కొట్టివేసింది. ఓయూ క్యాంపస్‌లో రాజకీయ, మతపరమైన సమావేశాలకు అనుమతించకూడదని.. అందుకే సభకు పర్మిషన్ ఇవ్వలేమని ఇటీవల వీసీ పేర్కొన్నారు. వీసీ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ …
Read More »రాహుల్ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం మాకు లేదు: మంత్రి జగదీశ్‌రెడ్డి
నిరుద్యోగుల మద్దతు ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీ కలలు కంటోందని టీఆర్‌ఎస్ సీనియర్ నేత, మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తెలంగాణ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు. హైదరాబాద్‌లో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జాబ్ నోటిఫికేషన్లు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందని.. అందుకే యూనివర్సిటీల్లో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. అంతర్గ కుమ్ములాటలో తెరాసపై కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. …
Read More »తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి
తెలంగాణ ఉన్నత విద్యామండలి నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి నియమితులయ్యారు. మండలి వైస్ చైర్మన్-1గా ఉన్న ఆయనను కౌన్సిల్ నూతన అఫిషియేటివ్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో లింబాద్రిని నియమిస్తూ విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా ఉత్తర్వులిచ్చారు. ప్రొ ఫెసర్ పాపిరెడ్డి చైర్మన్ పదవీ బాధ్యతలను మంగళవారమే లింబాద్రికి అప్పగించారు. 2014 ఆగస్టులో ఉన్నత విద్యామండలిని …
Read More »