ఈ కొవిడ్ ప్రజల్ని ఇప్పట్లో వదిలిపెట్టేలా కనిపించడం లేదు. వరల్డ్‌వైడ్‌గా కేసులు తగ్గాయి.. ఇక రిలీఫ్ వచ్చినట్లే అని భావిస్తున్న దశలో కొత్త వేరియంట్లు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటి వరకు బ్రిటన్‌లో మాత్రమే వెలుగుచూసిన ఒమిక్రాన్ కొత్తరకం వేరియంట్ ‘XE’ ఇండియాలోనూ బయటపడింది. ముంబయిలో ‘XE’ తొలికేసు నమోదైనట్లు అక్కడి మున్సిపల్ కార్పొరేషన్ వెల్లడించింది. సాధారణ కొవిడ్ పరీక్షల్లో భాగంగా ముంబయిలో 230 మంది శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కి పంపారు. …
Read More »చైనాలో మళ్లీ కరోనా విజృంభణ
కరోనా పుట్టినిళ్లు చైనాలో మరోమారు కరోనా విజృంభిస్తున్నది. ఒమిక్రాన్ వ్యాప్తితో స్వల్ప వ్యవధిలోనే రోజువారీ కేసులు రెండింతలయ్యాయి. దేశంలో కొత్తగా 2388 కేసులు నమోదయ్యాయని అధికారిక గణాంకాలు వెల్లడించాయి. గురువారం 1742 కేసులు నమోదవగా, అంతకుముందురోజు 1206 కేసులు రికార్డయ్యాయి. 2020లో వుహాన్‌లో కరోనా కలకలం తర్వాత భారీ సంఖ్యలో కేసులు నమోదవడం ఇదే మొదటిసారి.
Read More »మళ్లీ కరోనా విలయతాండవం .. Be Alert..?
ప్రపంచంలో మళ్లీ కరోనా పంజా విసురుతుంది. తాజాగా దక్షిణ కొరియాలో కరోనా మహమ్మారి తీవ్ర కల్లోలం సృష్టిస్తోంది.నిన్న బుధవారం ఒక్కరోజే 4 లక్షల 741 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి ఇంతమొత్తంలో దక్షిణ కొరియాలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇక్కడ వారం రోజులుగా రోజూ సగటున రోజుకు 3 లక్షల కేసులు నమోదవుతున్నాయి. వారం రోజుల్లో సౌత్ కొరియాలో …
Read More »చైనాలో మళ్లీ లాక్ డౌన్ – వణికిస్తున్న కొత్త వైరస్
ఇప్పటికే కరోనా మూడు వేవ్ లతో అతలాకుతలం అయిన ప్రపంచాన్ని మరోసారి వణికించేందుకు కొత్త వైరస్ పుట్టుకోస్తుంది చైనా నుండి. కరోనా వైరస్ తొలిసారి బయటపడిన చైనా దేశంలో తాజాగా ఆ దేశ ప్రజలను స్టెల్త్ ఒమిక్రాన్ అనే వైరస్ వణికిస్తుంది. దాదాపు రెండేళ్ల తర్వాత తొలిసారి నిన్న మంగళవారం అత్యధికంగా 5280 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ముందు రోజు కంటే తర్వాత రోజు కేసులు రెట్టింపయ్యాయి. అయితే …
Read More »దేశంలో తగ్గుతున్న కరోనా కేసులు
దేశంలో గత కొన్ని వారాలుగా కొవిడ్ మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది.ఈ క్రమంలో వరుసగా రెండోరోజు 3వేలకు దిగువనే కొత్తగా కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో 2,568 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది… గడిచిన ఇరవై నాలుగంటల్లో కరోనా మహమ్మారి భారీన పడి 97 మంది కరోనాతో ప్రాణాలు వదిలారు. ఒక్క కేరళలోనే 78 మంది మరణించడం విశేషం. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 33,917కి …
Read More »దేశంలో కొత్తగా 3,614 కరోనా కేసులు
దేశ వ్యాప్తంగా గడిచిన 24గంటల్లో కొత్తగా 3,614 కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా వైరస్ తో 89మంది మృతిచెందారు. తాజాగా 5,185 మంది వైరస్ ను జయించారు. ఫలితంగా రికవరీ రేటు 98.71 శాతానికి చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య 0.09శాతానికి తగ్గింది. దేశంలో ప్రస్తుతం 40,559 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »దేశంలో కొత్తగా 5,476 కరోనా కేసులు
దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 5,476 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 158మంది కోవిడ్ వల్ల మృతిచెందారు. దేశంలో ప్రస్తుతం 59,442 యాక్టివ్ కేసులు ఉన్నాయి. నిన్న 26,19,778 కరోనా టీకా డోసులు పంపిణీ చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Read More »కరోనా ఏ జంతువు నుండి వచ్చిందో తెలుసా..?
చైనా వుహాన్ నగరంలోని హ్వానాన్ చేపల మార్కెట్ నుంచే కరోనా వైరస్ వ్యాపించిందని, ల్యాబ్ నుంచి కాదని తాజా అధ్యయనంలో వెల్లడైంది. మొదటిసారి కరోనా జంతువుల నుంచి మానవులకు 2019, నవంబర్ లేదా డిసెంబర్లో వ్యాపించినట్లు స్పష్టం చేసింది. ఆ తర్వాత కొద్ది వారాల్లో మార్పు చెందిన కొవిడ్ వైరస్లో కేసులు నమోదయ్యాయని తెలిపింది. కానీ, కచ్చితంగా ఏ జంతువు నుంచి మానవులకు సోకిందో ఆ అధ్యయనాలు నిర్ధారించలేకపోయాయి.
Read More »దేశంలో కొత్తగా 6,915 కరోనా కేసులు
దేశంలో కరోనా తగ్గుముఖం పడుతోంది. గడిచిన 24గంటల్లో 9,01,647 కోవిడ్ టెస్టులు నిర్వహించారు. ఇందులో 6,915 కొత్త కేసులు నమోదయ్యాయి. 180 మంది ప్రాణాలను కోల్పోయారు. ఇప్పటివరకు దేశంలో కోవిడ్ తో 5,14,203 మంది మృతిచెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 92,472కు తగ్గింది. ఇప్పటివరకు దేశంలో 177.70 కోట్ల టీకా డోసులు పంపిణీ చేశారు.
Read More »దేశంలో కొత్తగా 8,013 కరోనా కేసులు
దేశంలో గత వారం రోజులతో పోల్చుకుంటే రోజువారీ కరోనా కేసుల సంఖ్య 10,000 దిగువకు పడిపోయింది. గడిచిన గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 8,013 పాజిటివ్ కేసులు వచ్చినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. కరోనా వల్ల 119 మంది మరణించారు. ఇప్పటివరకు మొత్తం 5,13,843 మంది చనిపోయారు. ప్రస్తుతం 1,02,601 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 1.11 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 7,23,828 …
Read More »