తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా బారిన పడ్డారు. ఇటీవల ఢిల్లీలో వారం రోజులు పర్యటించి, నిన్న రాత్రి హైదరాబాద్ మహానగరానికి వచ్చిన మంత్రి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. రోనా చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. ప్రస్తుతం హోం ఐసోలేషన్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు.
Read More »ఏపీలో ఒమిక్రాన్ కలవరం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. తాజాగా ఆంధ్రప్రదేశ్లో మరో 2 కొత్త కేసులు నమోదయ్యాయి. దక్షిణాఫ్రికా, యూకే నుంచి వచ్చిన ప్రకాశం, అనంతపురం జిల్లా వాసులకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారణ అయింది. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 6కి చేరింది. ఇదిలా ఉండగా.. విదేశాల నుంచి 67 మంది రాష్ట్రానికి వచ్చారు. వారిలో 12 మందికి కరోనా సోకినట్లు తేలింది.
Read More »తెలంగాణలో కొత్తగా 177కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 38,219 కరోనా టెస్టులు చేయగా కొత్తగా 177 కొవిడ్ కేసులు నమోదయ్యాయి. ఒకరు వైరస్ తో మరణించారు. మొత్తం 190 మంది కోలుకున్నారు.మొత్తం కేసుల సంఖ్య- 6,80,251 .మరణించిన వారి సంఖ్య – 4,018. ప్రస్తుతం యాక్టివ్ కేసులు – 4,470.మొత్తం ఒమిక్రాన్ కేసులు- 38
Read More »రాజన్న సిరిసిల్ల లో ఒమిక్రాన్ కలవరం
తెలంగాణలోని సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ (మ) గూడెంలో ఒక వ్యక్తికి ఒమిక్రాన్ నిర్ధారణ కాగా.. అతని భార్య, తల్లికి కూడా కరోనా పాజిటివ్ గా తేలింది. దీంతో గ్రామంలో లాక్ డౌన్ విధించనున్నట్లు పంచాయతీ పాలకవర్గం తెలిపింది. గూడెంలో ఇప్పటికే షాపులు, హోటళ్లు, బడులను మూసివేయగా.. రానున్న 10 రోజుల పాటు గ్రామంలోకి ఎవరూ రాకుండా, ఎవరూ బయటకు వెళ్లకుండా చర్యలు తీసుకోనున్నట్లు స్థానిక పాలకవర్గం తెలిపింది.
Read More »దేశంలో కొత్తగా 7,495 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7,495 పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. కరోనా నుంచి మరో 6,960 మంది బాధితులు కోలుకున్నారు. కరోనా పాజిటివ్ కేసులు 2020 మార్చి తర్వాత కనిష్ఠానికి చేరుకున్నాయి. దేశంలో ప్రస్తుతం 78,291 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. కరోనా రికవరీ రేటు 98.40 శాతానికి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 139.70 కోట్లకు పైగా కొవిడ్ టీకా డోసులు పంపిణీ జరిగింది. …
Read More »డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి
డెల్టా కంటే ఒమిక్రాన్ వేరియంట్లో స్వల్ప లక్షణాలే ఉన్నాయని, కానీ ఇది దాని కంటే వేగంగా వ్యాపించగలదని ఒమిక్రాన్ను తొలిసారి గుర్తించిన సౌతాఫ్రికా వైద్యురాలు ఏంజెలిక్ కోట్టీ అన్నారు. తాను ఇప్పటివరకు ఒమిక్రాన్ సోకిన వందమందికి చికిత్స చేశానని, సౌతాఫ్రికాలో తీవ్రమైన కేసులు లేవన్నారు. కాగా, కోట్టీ ఒమిక్రాన్ వేరియంట్ను గుర్తించి ఆ దేశ వైద్యారోగ్య శాఖను వెంటనే అప్రమత్తం చేశారు.
Read More »మూడు డోసులు వేసుకున్నవారిని వదలని ఒమిక్రాన్
కరోనా కొత్త వేరియంట్ ప్రపంచాన్ని వణికిస్తున్నది. వ్యాక్సిన్ తీసుకోనివారితోపాటు రెండు కాదు మూడు డోసులు వేసుకున్నవారిని కూడా వదిలిపెట్టడం లేదు. ఈ నెల 9న ఓ వ్యక్తి న్యూయార్క్ నుంచి ముంబై వచ్చాడు. విమానాశ్రయంలో కరోనా పరీక్ష నిర్వహించగా అతనికి పాజిటివ్ వచ్చింది. అయితే అతడు ఫైజర్ వ్యాక్సిన్ మూడు డోసులు తీసుకున్నాడని, అయినా అతనికి వైరస్ సోకిందని బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) అధికారులు చెప్పారు. బాధితుడు …
Read More »దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7145 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,47,33,194కు చేరింది. ఇందులో 3,41,71,471 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మరో 4,77,158 మంది మహమ్మారి వల్ల మృతిచెందారు. ఇంకా 84,565 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు 569 రోజుల కనిష్ఠానికి చేరాయని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కాగా, గత 24 గంటల్లో 8706 మంది కరోనా నుంచి కోలుకున్నారని, మరో …
Read More »ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ
ప్రపంచసుందరి పోటీలకు కరోనా మహమ్మారి సెగ తగిలింది. మిస్ ఇండియా వరల్డ్ మానస వారణాసితోపాటు మొత్తం 17 మంది పోటీదారులు, సిబ్బందికి కరోనా పాజిటివ్ రావడంతో మిస్ వరల్డ్-2021 పోటీలు తాత్కాలికంగా వాయిదాపడ్డాయి. పోటీల నిర్వాహకులు గురువారం నాడు ఈవెంట్ ప్రారంభానికి కేవలం కొన్ని గంటల ముందు ఈ మేరకు ప్రకటన చేశారు. ప్రస్తుతం పోటీదారులంతా మిస్ వరల్డ్ ఫినాలే జరుగాల్సిన పోర్టారికోలోనే ఐసోలేషన్‌లో ఉన్నారు. కంటెస్టెంట్లలో కరోనా పాజిటివ్ …
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దు
ఒమిక్రాన్ వేరియంట్ పట్ల భయాందోళన చెందొద్దని, వైరస్ వల్ల ప్రాణాపాయం లేదని వైద్యారోగ్య సంచాలకులు శ్రీనివాసరావు అన్నారు. ఇప్పటివరకు ఒమిక్రాన్ సామూహిక వ్యాప్తిలేదని చెప్పారు. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు తొమ్మిదికి చేరాయని వెల్లడించారు. హనుమకొండకు చెందిన మహిళకు ఒమిక్రాన్ నిర్ధారణ అయిందన్నారు. ఒమిక్రాన్ బాధితుల్లో 95 శాతం మందిలో లక్షణాలు కనిపించట్లేదని పేర్కొన్నారు. నాన్‌రిస్క్ దేశాల నుంచి వచ్చిన ఏడుగురికి ఒమిక్రాన్ నిర్ధారణ అయిందని చెప్పారు. కరోనా మూడో వేవ్‌ను …
Read More »