ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. అమెరికాలో గత 24 గంటల్లో 3లక్షలకు పైగా కేసులు నమోదయ్యాయి. 18 వందల మందికి పైగా మహమ్మారి వల్ల చనిపోయారు. ఫ్రాన్స్లోనూ కొవిడ్ విజృంభిస్తోంది. అక్కడ నిన్న ఒక రోజే 2లక్షల మందికి కరోనా నిర్ధారణ అయింది. పోర్చుగల్లో 26 వేలకు పైగా కేసులు నమోదు కాగా.. పొలాండ్లో 15వేలు, రష్యాలో 21 వేల కేసులు నమోదయ్యాయి.
Read More »మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం
మహారాష్ట్రలో ఒమిక్రాన్ కల్లోలం సృష్టిస్తోంది. గత 24గంటల్లో కొత్తగా 85 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 252కు పెరిగింది. వీటిలో ఒక ముంబైలోనే 137 కేసులు ఉన్నాయి. మరోవైపు గత 24గంటల్లో కొత్తగా 3,900 కరోనా కేసులు మహారాష్ట్రలో నమోదైనట్లు అధికారులు తెలిపారు. కొవిడ్ వల్ల 20 మంది చనిపోయినట్లు చెప్పారు. ప్రస్తుతం 14,065 యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.
Read More »ముంబైలో కరోనా అలజడి
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కరోనా అలజడి సృష్టిస్తోంది. గడిచిన 24 గంటల్లో ముంబైలో 2,510 కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం ముంబైలో 1,377 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇవాళ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నిన్న మహారాష్ట్ర వ్యాప్తంగా 2,172 కేసులు రాగా.. ఇవాళ ఒక్క ముంబై నగరంలోనే ఇన్ని కేసులు నమోదవ్వడం గమనార్హం. కాగా మహారాష్ట్రలో ప్రస్తుతం నైట్ కర్ఫ్యూ అమల్లో ఉంది.
Read More »కోలుకుంటున్న దాదా
ఇటీవల కరోనా బారిన పడిన మాజీ క్రికెటర్, బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ ఆరోగ్యం నిలకడగా ఉందని కోల్కతాలోని వుడ్అండ్ ఆస్పత్రి యాజమాన్యం ప్రకటించింది. ప్రస్తుతానికి ఆయనకు జ్వరం లేదని తెలిపింది. నిపుణులైన వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారని, భయపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. గంగూలీకి కొన్ని నెలల కిందట యాంజియోప్లాస్టీ జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆయన కోవిడ్ టీకా రెండు డోసులు తీసుకున్నారు.
Read More »ఏపీలో పెరుగుతున్న కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. గత 24 గంటల్లో కొవిడ్తో ఎవరూ చనిపోలేదు. 186 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మొత్తం కేసుల సంఖ్య- 20,76,849 మరణాల సంఖ్య – 14,492 మొత్తం కోలుకున్న వారి సంఖ్య- 20,61,308 ప్రస్తుతం యాక్టివ్ కేసులు- 1,049
Read More »UKలో కరోనా కలవరం
UKలో గత 24 గంటల్లో 1,29,471 కొత్త COVID-19 కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇదే రికార్డు. తాజా కేసులతో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,23,38,676కి చేరుకుంది. ఒక్కరోజే 18 మంది ఈ వైరస్ కారణంగా మరణించారు. వీటితో మొత్తం మరణాల సంఖ్య 1,48,021కి చేరుకుంది. కరోనా వ్యాప్తికి ఒమిక్రాన్ వేరియంట్ ప్రధాన కారణమని తెలుస్తోంది.
Read More »TRS Mp కె. కేశవరావు కి కరోనా
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కె. కేశవరావు కరోనా బారినపడ్డారు. RTPCR పరీక్షల్లో ఆయనకు కరోనా సోకినట్లు తేలింది. వెంటనే ఆయన నిమ్స్ ఆసుపత్రికి వెళ్లి వైద్యులను సంప్రదించారు. వారి సలహా మేరకు ఇంటికి వెళ్లి క్వారంటైన్లో ఉన్నారు.
Read More »దేశంలో 781 ఒమిక్రాన్ కేసులు
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఇప్పటివరకు 781 కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఇందులో 241 మంది డిశ్చార్జ్ అయినట్లు పేర్కొంది. అత్యధికంగా ఢిల్లీలో 238, మహారాష్ట్రలో 167 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. ఇక తెలంగాణలో 62 కేసులు రాగా 10 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఏపీలో ఆరుగురికి ఒమిక్రాన్ సోకగా ఒకరు కోలుకున్నారు.
Read More »ఒమిక్రాన్ వేరియంట్ పై WHO హెచ్చరిక
ఒమిక్రాన్ వేరియంట్ రిస్క్ ఇంకా తీవ్రంగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తెలిపింది. అంతకుముందు వారంతో పోలిస్తే డిసెంబర్ 20 నుంచి 26 వరకు ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్ కేసులు 11% పెరిగాయని పేర్కొంది. డెల్టా వేరియంట్తో పోలిస్తే ఒమిక్రాన్ అత్యంత వేగంగా వ్యాపిస్తున్నట్లు నిరూపితమైందని చెప్పింది. వివిధ దేశాల రిపోర్టులను బట్టి చూస్తే 2-3 రోజుల్లోనే కేసులు రెట్టింపు అవుతున్నాయని వివరించింది.
Read More »Tollywood హీరో మంచు మనోజ్ కు కరోనా
ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో సెలబ్రెటీలు వరుసగా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా మంచు మనోజ్ కు కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో తెలిపాడు. “నాకు కరోనా నిర్ధారణ అయ్యింది. నన్ను గత వారం నుంచి కలిసిన వారందరూ టెస్ట్ చేయించుకోండి. జాగ్రత్తలు తీసుకోండి. నా గురించి ఆందోళన చెందవద్దు. క్షేమంగా ఉన్నాను. మీ ప్రేమ, ఆశీర్వాదాలు నాతోనే ఉన్నాయి” అని ట్విట్టర్లో పేర్కొన్నాడు.
Read More »