Home / Tag Archives: omicron (page 10)

Tag Archives: omicron

తెలంగాణలో కొత్తగా 1,963 మందికి కరోనా వైరస్

తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.

Read More »

ఏపీలో కొత్తగా 4,955 కరోనా కేసులు

ఏపీలో గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 35,673 టెస్టులు చేయగా.. కొత్తగా 4,955 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 397 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 22,870 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది. నిన్నటి కంటే 400పై చిలుకు కేసులు నమోదయ్యాయి.

Read More »

తెలంగాణలో 1,963 మందికి కరోనా వైరస్

తెలంగాణలో నిన్నటితో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 53,073పరీక్షలు చేయగా 1,963 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,017 యాక్టివ్ కేసులున్నాయి. నిన్న రాష్ట్రంలో 2,398 కరోనా కేసులు వచ్చాయి.

Read More »

TDP నేత పరిటాల శ్రీరామ్ కి కరోనా

ఏపీలో అనంతపురం జిల్లా రాప్తాడు టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కరోనా బారినపడ్డారు. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్లో వెల్లడించారు. తనకు స్వల్ప లక్షణాలు ఉన్నాయని తెలిపారు. ఇటీవల తల్లి సునీతతో కలసి ధర్మవరం నియోజకవర్గంలో ఆయన విస్తృతంగా పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తనను కలసిన వారందరూ జాగ్రత్తగా ఉండాలని, లక్షణాలుంటే టెస్టులు చేసుకోవాలని శ్రీరామ్ సూచించారు.

Read More »

నిజామియా టీబీ ఆసుపత్రిలో కరోనా కలవరం

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోనిచార్మినార్లోని నిజామియా టీబీ ఆసుపత్రిలో శుక్రవారం62 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు… వీరిలో39 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయినట్లు వైద్యాధికారులు తెలిపారు. కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కరోనా లక్షణాలు ఉన్నవారు దగ్గర్లోని ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాక్సిన్ తీసుకోని వారు తప్పనిసరిగా వ్యాక్సిన్ తీసుకోవాలన్నారు.

Read More »

సర్జరీ చేయించుకునే వారు కరోనా టెస్ట్ చేయించుకోవాలా..?వద్దా..?

లక్షణాలు ఉంటేనే కరోనా పరీక్షలు చేయాలని.. సర్జరీలు చేయించుకునే వారికి కరోనా పరీక్ష తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సర్జరీ చేయించుకునే వారిలో లక్షణాలు ఉన్నప్పుడే నిర్ధారణ పరీక్షకు వెళ్లాలని సూచించింది. కరోనా నిర్ధారణ అయ్యాక తీసుకోవాల్సిన చికిత్సపై వైద్యుల సలహాను తప్పనిసరిగా పాటించాలంది. N95 మాస్కును రోజంతా.. క్లాత్ మాస్కును 8 గంటలకోసారి మార్చి కొత్తది ధరించాలని కేంద్రం పేర్కొంది.

Read More »

ఏపీలో కొత్తగా 4,528 కరోనా కేసులు

గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 38,816 టెస్టులు చేయగా.. కొత్తగా 4,528 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు కోవిడ్తో మరణించారు. మరోవైపు 418 మంది పూర్తిగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 18,313 కేసులు ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య ఆందోళనకరంగా పెరుగుతోంది.

Read More »

దేశంలో కొత్తగా 2,47,417 కరోనా కేసులు

దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 2,47,417 కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 27 శాతం అధికంగా వెలుగు చూశాయి. బుధవారం 84,825 మంది బాధితులు కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 11,17,531 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారి పాజిటివిటీ రేటు 13.11 శాతానికి పెరిగింది. అటు దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 5,488కి పెరిగింది.

Read More »

ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విధ్వంసం

కరోనా మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా విధ్వంసం సృష్టిస్తోంది. అన్ని దేశాల్లో కలిపి ఒక్కరోజు వ్యవధిలోనే 31 లక్షల కొత్త కేసులు వెలుగు చూశాయి. ఒక్క అమెరికాలోనే 8 లక్షల మందికి పాజిటివ్గా తేలింది. అన్నిదేశాల్లో కలిపి కరోనా వల్ల మరో 7,855 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కేసులు సంఖ్య 31 కోట్ల 93 లక్షలకు చేరువైంది.

Read More »

నిబంధనలు పాటించకపోతే రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోందని హెల్త్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు తెలిపారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు ఉల్లంఘిస్తూ పోతే.. ఈ నెల చివరి నాటికి రాష్ట్రంలో రోజుకు 50 వేలకు పైగా కొత్త కేసులు నమోదవుతాయని హెచ్చరించారు. ప్రజలు నిబంధనలు పాటించాలని.. ఎట్టి పరిస్థితుల్లోనూ గుంపుల్లోకి వెళ్లకూడదని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్రంలో 18వేలకు పైగా యాక్టివ్ కేసులు ఉన్నట్లు పేర్కొన్నారు.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat