ఏపీలో మరో నాలుగు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. గుంటూరులో ఓ మహిళతో పాటు ముగ్గురు ప్రకాశం జిల్లా వాసులకు ఒమిక్రాన్ వచ్చింది. USA నుంచి వచ్చిన ఒకరికి, యూకే నుంచి వచ్చిన ఇద్దరికి, విదేశాల నుంచి వచ్చిన వ్యక్తి నుంచి మరో మహిళకు ఒమిక్రాన్ సోకింది. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 28కి చేరింది.
Read More »ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్లున్న 5 లక్షల మందికి వ్యాక్సిన్లు
ఏపీ వ్యాప్తంగా 15-18 ఏళ్ల మధ్య వయసు వారికి టీకా పంపిణీ నిన్న ప్రారంభం కాగా.. తొలి రోజు 5 లక్షల మందికి వ్యాక్సిన్లు వేశారు. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 72,146 మందికి వ్యాక్సిన్లు వేశారు.. తూ.గో, శ్రీకాకుళం, నెల్లూరు, ప.గో, కర్నూలు జిల్లాల్లో 40 వేల మందికి టీకా వేశారు. 28 రోజుల అనంతరం వీరికి రెండో డోసు టీకా వేయనుండగా.. దేశ వ్యాప్తంగా తొలిరోజు 41 లక్షల …
Read More »ఐసోలేషన్లో ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఐసోలేషన్లోకి వెళ్లారు. తన కుటుంబంలోని ఓ సభ్యుడితో పాటు ఆమె సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాళ్లతో కాంటాక్ట్ లో ఉన్న కారణంగా ప్రియాంక స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. కాగా.. కరోనా పరీక్షల్లో ఆమెకు నెగెటివ్ వచ్చింది. కొన్ని రోజుల తర్వాత మరోసారి పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సలహా ఇచ్చినట్లు ఆమె చెప్పారు.
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభం
దేశంలో కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని కొవిడ్ వ్యాక్సిన్ టాస్క్ ఫోర్స్ చైర్మన్ డా. ఎన్కే అరోరా తెలిపారు. ముంబై, ఢిల్లీ, కోల్ కత్తాలో నమోదవుతున్న కేసుల్లో 75 శాతం కేసులు ఒమిక్రాన్ వేరియంట్వే అని చెప్పారు. గత ఏడాది DEC తొలి వారంలో మొదటి ఒక్రాన్ కేసును గుర్తించగా 2 వారాల్లోనే ఈ వేరియంట్ దేశమంతటా వ్యాపించిందని తెలిపారు. దీనిని బట్టి దేశంలో థర్డ్ వేవ్ మొదలైందని చెప్పవచ్చన్నారు.
Read More »తెలంగాణలో లాక్డౌన్ పై సీఎం కేసీఆర్ క్లారిటీ..?విధిస్తారా..?
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ విధిస్తారనే వార్తలు ప్రసారమవుతున్నాయి.ఈ వార్తలపై సీఎం కేసీఆర్ క్లారిటీచ్చారు.లాక్డౌన్ ప్రస్తుతం అవసరం లేదని అధికారులు నివేదిక ఇచ్చినట్లు సీఎం కేసీఆర్ అన్నారు. వైద్యారోగ్య శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన.. ఒమిక్రాన్ పట్ల భయం వద్దని, అదే సమయంలో అజాగ్రత్తగా ఉండొద్దని సూచించారు. అందరూ మాస్కు ధరించాలన్నారు. కాగా, విద్యాసంస్థలకు ఈనెల 8 నుంచి 16 వరకు …
Read More »ఏపీలో కొత్తగా 122 కరోనా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా 122 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒకరు మరణించారు. తాజాగా 103 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 1,278గా ఉంది.మొత్తం కేసులు – 20,77,608 .వీటిలో కోలుకున్న వారి సంఖ్య 20,61,832. మరణించిన వారి సంఖ్య – 14,498గా ఉంది.
Read More »తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు విద్యాసంస్థలకు సెలవులు
తెలంగాణలో ఈనెల 8 నుంచి 16 వరకు అన్ని విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. సెలవుల్లో విద్యార్థులు కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించింది. బహిరంగ ప్రదేశాలకు వెళ్లేటప్పుడు మాస్కులు ధరించాలని సూచించింది.
Read More »హైదరాబాద్ నగరంలో కొత్తగా 294 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరమైన హైదరాబాద్ నగరంలో కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 294 కరోనా కేసులు నమోదైనట్లు స్టేట్ హెల్త్ బులెటిన్లో అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటివరకు మొత్తం 1,47,235 కరోనా కేసులు నమోదయ్యాయి. నగరంలో ‘ఒమిక్రాన్’ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ.. మాస్కులు ధరించి జాగ్రత్తలు పాటించాలని అధికారులు తెలిపారు. టీనేజర్స్ ప్రతీ ఒక్కరూ వాక్సిన్ వేసుకోవాలని సూచించారు.
Read More »వైద్యాధికారులకు సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు
తెలంగాణలోకరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, కేసులు పెరుగుతున్నందున రాష్ట్రంలోని ప్రభుత్వాసుపత్రుల్లో సదుపాయాలు మెరుగుపరచాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పడకలు, ఆక్సిజన్, మందులు, పరీక్ష కిట్లు అవసరం మేరకు సమకూర్చుకోవాలన్నారు. అన్ని దవాఖానాల్లో వైద్యులు అందుబాటులో ఉండాలని, ఖాళీలు ఉంటే 15 రోజుల్లోగా భర్తీ చేసుకునేలా విధివిధానాలు రూపొందించాలని కేసీఆర్ సూచించారు.
Read More »దేశంలో కొత్తగా 7774 కరోనా కేసులు
దేశంలో కొత్తగా 7774 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,46,90,510కి చేరింది. ఇందులో 3,41,22,795 మంది కరోనా నుంచి కోలుకోగా, 92,281 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మరో 4,75,434 మంది మహమ్మారికి బలయ్యారని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గత 24 గంటల్లో కొత్తగా 306 మంది మరణించగా, 8464 మంది కోలుకున్నారని తెలిపింది.దేశంలో యాక్టివ్ కేసులు 560 రోజుల కనిష్ఠానికి చేరుకున్నాయని పేర్కొంది. మొత్తం …
Read More »