హాలియా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో త్రిపురారం మండల ముఖ్య నాయకులతో విస్తృతస్థాయి సమావేశ కార్యక్రమంలో స్థానిక నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు, రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ కమిటీల ఇంచార్జ్ చాడ కిషన్ రెడ్డి గారు.. త్రిపురారం మండలం,నూతనంగా ఎన్నుకున్న మండల అధ్యక్ష, కార్యదర్శుల నియామకాల గురించి, మండల కమిటీ ఎన్నికల నియామకాల గురించి మండల నాయకులతో విధివిధానాలు తెలుసుకుని మండల కమిటీల గురించి చర్చిచి మండల అధ్యక్షుల, కార్యదర్శులను …
Read More »కళ్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్ చెక్ లను అందించిన ఎమ్మెల్యే నోముల భగత్
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు మండల పరిధిలోని ఎంపీడీవో కార్యాలయంలో కళ్యాణలక్ష్మి/షాదీముభారక్ 86 మంది లబ్ధిదారులకు చెక్ లు అందజేసిన నాగార్జునసాగర్ శాసనసభ్యులు నోముల భగత్ గారు…ఎమ్మెల్యే భగత్ గారు మాట్లాడుతూ పేదవారి యింట్లో జరిగే పెండ్లికి ప్రభుత్వం అందిస్తున్న తాంబూలమే కళ్యాణలక్ష్మీ/షాదీముభారక్ లని పేదలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తుందన్నారు. గతంలో నిరుపేదలు పెండ్లి చేయాలంటే అష్టకష్టాలు పడేవారని గుర్తు చేశారు. …
Read More »హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్
నాగార్జునసాగర్ నియోజకవర్గ కేంద్రం హాలియాకు సీఎం కేసీఆర్ సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చేరుకున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో కేసీఆర్ సాగర్ పర్యటనకు బయల్దేరారు. హాలియాకు చేరుకున్న సీఎం కేసీఆర్‌కు ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్ఎస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. హాలియా మార్కెట్‌యార్డులో ప్రజాప్రతినిధులు, అధికారులతో లిఫ్ట్ పథకాల పనుల పురోగతిపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. ముఖ్యంగా నెల్లికల్, ఇతర …
Read More »ఎమ్మెల్యే భగత్ విజ్ఞప్తికి మంత్రి కేటీఆర్ సానుకూల స్పందన
నాగార్జునసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే నోముల భగత్ గురువారం రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని హాలియా, సాగర్ మున్సిపాలిటీల అభివృద్దికి రూ.5 కోట్ల చొప్పున అదనంగా నిధులు కేటాయించాల్సిందిగా కోరారు. అదేవిధంగా హాలియా మున్సిపాలిటీలో మెయిన్ డ్రైనేజ్, మినీ స్టేడియానికి నిధులను కేటాయించాల్సిందిగా విన్నవించారు. ఎమ్మెల్యే భగత్ విజ్ఞప్తులపై మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు నిధుల విడుదలకు హామీ ఇచ్చారు. దీనిపై …
Read More »నాగార్జున సాగర్‌లో టీఆర్ఎస్ ఘన విజయం
నాగార్జున సాగర్ గడ్డపై మరోసారి గులాబీ జెండా రెపరెపలాడింది. సాగర్ ప్రజలు గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్నారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ 19,281 ఓట్ల మెజార్టీతో గెలిచారు. దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో సాగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ క్రమంలో ఏప్రిల్ 17న ఉప ఎన్నికకు పోలింగ్ ప్రక్రియ …
Read More »సాగర్లో కారు జోరు-నోముల భగత్‌కు 10361 ఓట్ల ఆధిక్యం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో కారు జోరు మీదుంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ భారీగా మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉండగా, బీజేపీ అడ్రస్ గల్లంతు అయింది. ప్రతీ రౌండ్‌లోనూ టీఆర్ఎస్ పార్టీ మంచి ఆధిక్యాన్ని కనబరుస్తోంది. పన్నెండో రౌండ్ ముగిసే సరికి 10,361 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్‌లోనూ టీఆర్ఎస్ పార్టీకి అత్యధిక ఓట్లు …
Read More »సాగర్ ఆప్డేట్ – 11వ రౌండ్ ముగిసే సరికి టీఆర్ఎస్‌కు 9,106 ఓట్ల ఆధిక్యం
నాగార్జున సాగర్ ఉప ఎన్నిక ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తుంది. కారు దూకుడుకు విపక్షాలు బెంబేలెత్తుతున్నాయి. రౌండ్ రౌండ్‌లోనూ గులాబీ గుభాళిస్తోంది. ప్రతి రౌండ్‌లోనూ టీఆర్ఎస్ భారీగా మెజార్టీగా దిశగా దూసుకెళ్తుండటంతో పార్టీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ భారీ మెజార్టీ దిశగా దూసుకుపోతున్నారు. పదకొండో రౌండ్ ముగిసే సరికి 9,106 ఓట్ల మెజార్టీతో నోముల భగత్ ముందంజలో ఉన్నారు. పోస్టల్ …
Read More »రైతుల పాదాలు కడుగుతున్నాం : సీఎం కేసీఆర్
గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి.. రైతుల పాదాలను కడుగుతున్నామని సీఎం కేసీఆర్ తెలిపారు. నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా హాలియాలో ఏర్పాటు చేసిన టీఆర్‌ఎస్ పార్టీ బహిరంగ సభలో సీఎం పాల్గొని మాట్లాడారు. నాగార్జున సాగర్ ఆయకట్టు కింద అన్ని ప్రాజెక్టులు పూర్తి చేస్తామన్నారు. కాళేశ్వరంలో రైతులు కేరింతలు కొట్టినట్లే.. సాగర్లో కూడా రైతులు, ప్రజలు కేరింతలు కొట్టాలి. గోదావరిలో పుష్కలంగా నీళ్లు ఉన్నాయి. తెలంగాణ నాశనమై ఆత్మహత్యల పాలైందంటే …
Read More »