నాగార్జునసార్ ఉప ఎన్నికల్లో గెలుపొందిన నోముల భగత్ శాసన సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం ఉదయం అసెంబ్లీలోని స్పీకర్ చాంబర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీ రూల్స్ బుక్స్, ఐడెంటిటీ కార్డును భగత్ కు అందించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జగదీష్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, తలసాని …
Read More »సాగర్ అప్డేట్ -6వ రౌండ్ ముగిసే సరికి ఎవరికి ఆధిక్యం ..?
నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో ఇప్పటి వరకు జరిగిన కౌంటింగ్‌లో అధికార పార్టీ టీఆర్ఎస్ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. ఐదవ రౌండ్ ముగిసే సమయానికి టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ 4,334 ఓట్ల ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. ఐదవ రౌండ్‌లో టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు 3,442 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి జానారెడ్డికి 2,676ఓట్లు, బీజేపీ అభ్యర్థి రవికుమార్‌కు 74 ఓట్లు వచ్చాయి.అయితే ఆరో రౌండ్ ముగిసేసరికి టీఆర్ఎస్ అభ్యర్థి 5,177 ఓట్ల …
Read More »సాగర్ ఎగ్జిట్‌పోల్స్- టీఆర్ఎస్‌దే గెలుపు
తెలంగాణ రాష్ట్రంలో ఇటీవల జరిగిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని అధికార టీఆర్ఎస్ పార్టీ తిరిగి కైవసం చేసుకోనుంది. ఆరా సంస్థ నిర్వహించిన ఎట్జిట్ పోల్స్ ఈ విషయాన్ని తేల్చి చెప్పాయి. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌దే గెలుపని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఆరా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం పార్టీల వారీగా పోలైన ఓట్ల శాతం ఈ విధంగా ఉంది. టీఆర్‌ఎస్ – 50.48%, కాంగ్రెస్ …
Read More »సాగర్ ఉప ఎన్నిక.. ఇబ్రహీంపేటలో ఓటు వేసిన నోముల భగత్
నాగార్జునసాగర్‌లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నోముల భగత్ కుటుంబ సమేతంగా ఓటుహక్కు వినియోగించుకున్నారు. హాలియాలోని ఇబ్రహీంపేటలో ఓటు వేశారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ రాత్రి 7 గంటల వరకు కొనసాగనుంది. కరోనా బాధితులకు సాయంత్రం 6 గంటల తర్వాత ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తారు. ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతితో ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 41 మంది అభ్యర్థులు …
Read More »భగత్ అఖండ విజయం సాధించడం ఖాయం : తలసాని శ్రీనివాస్ యాదవ్
నాగార్జున సాగర్ అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్న టిఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్ అఖండ విజయం సాధించడం ఖాయమని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. భగత్ కు అన్ని వర్గాల మద్ధతు ఉందని ఆయన స్పష్టం చేశారు. ఉన్నత విద్యావంతుడైన భగత్ ను గెలిపించడం వల్ల నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తలసాని మీడియాతో మాట్లాడారు. …
Read More »