కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్ కు మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. వస్త్రాలపై అదనపు జీఎస్టీ ప్రతిపాదనలు విరమించుకోవాలని లేఖలో కోరిన ఆయన.. జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో దీనిపై చర్చించాలన్నారు. జీఎస్టీ పెంపుతో వస్త్ర పరిశ్రమ కుదేలవుతుందన్న మంత్రి కేటీఆర్ కోట్లాది మంది చేనేతల జీవితాలు దెబ్బతింటాయన్నారు. వస్త్రాల ధరలు పెరిగి సామాన్యులు కూడా ఇబ్బంది పడతారన్న మంత్రి.. రైతుల మాదిరిగా నేతన్నలు కూడా కేంద్రంపై తిరగబడతారన్నారు.
Read More »రాబడులను పూర్తిగా కోల్పోయాం:-మంత్రి కేటీఆర్
కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారు లేఖ రాశారు. గత ఏడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్ సహాయ ప్యాకేజ్ లో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభ కాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాము. అయితే ప్రస్తుతం ఉన్న కరోనా సంక్షోభం రెండవ దశను సైతం దాటి కొనసాగుతున్నది. అతి …
Read More »కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి
కోవిడ్ వ్యాక్సిన్ ను కేంద్రం త్వరగా పంపిణీ చేయాలి అవసరాలకు అనుగుణంగా వ్యాక్సిన్ ను విదేశాల నుంచి దిగుమతి కి చర్యలు చేపట్టాలి. కోవిడ్ 19 చికిత్సకు సంబంధించిన మందులు, ఇతర సామగ్రిపై జీఎస్టీ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ చేసిన పన్నుల సిఫారసులకు మద్ధతు. 44 వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్ రావు. ################# దేశంలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని త్వరగా చేపట్టి ప్రాణాలు …
Read More »జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న మంత్రి హరీశ్
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆధ్వర్యంలో 44వ జీఎస్టీ మండలి సమావేశం కొనసాగుతున్నది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సమావేశానికి రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ నీతూప్రసాద్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ అత్యవసర వస్తువులు, బ్లాక్ ఫంగస్ మందులపై పన్ను రేట్ల తగ్గింపు, ఆక్సిజన్, ఆక్సీమీటర్లు, శానిటైజర్లు, వెంటిలేటర్లతో సహా పలు …
Read More »కరోనా పన్నుపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ
కరోనా తెచ్చిన ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేందుకు సర్కారు ‘కరోనా’ పన్ను విధిస్తుందనే వార్తలపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. కరోనాకు సంబంధించి పన్ను/సెస్ విధించాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదని స్పష్టం చేశారు. ఇటీవల బడ్జెట్ దేశంలో విప్లవాత్మక మార్పు తీసుకొస్తుందన్నారు. గత 3 నెలల్లో GST ఆదాయం పెరిగిందన్నారు దేశాభివృద్ధి కోసం SBI వంటి పరిమాణంలో మరో 20 సంస్థల అవసరం ఉందన్నారు.
Read More »కొత్త పథకాన్ని తీసుకొచ్చిన కేంద్రం
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఈ బడ్జెట్ లో కొత్తగా పీఎం ఆత్మనిర్భర ఆరోగ్య పథకం’ను కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.64,180 కోట్లతో ఈ పథకాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. ఇందుకోసం ఈ మొత్తంతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామన్నారు అటు దేశంలో కొత్తగా 4 ప్రాంతాల్లో వైరాలజీ ల్యాబులు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం పుణెలో మాత్రమే ఈ తరహా ల్యాబ్ ఉంది.
Read More »రేషన్ కార్డు లబ్ధిదారులకు శుభవార్త
వన్ నేషన్-వన్ కార్డును ఈ ఏడాది చివరి నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని నిర్మలా సీతారామన్ చెప్పారు. వలస కార్మికులు దేశంలో ఎక్కడైనా రేషన్ తీసుకోవచ్చు. కుటుంబ సభ్యులు వేర్వేరు చోట్ల ఉంటే వాటా ప్రకారం ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వన్ నేషన్-వన్ కార్డు విజయవంతంగా అమలవుతోందని నిర్మలా చెప్పారు.
Read More »కేంద్ర బడ్జెట్ 2021-22-మొబైల్ వినియోగదారులకు షాక్
కేంద్ర బడ్జెట్ లో మొబైల్ స్పేర్ పార్ట్స్ పై 2.5% కస్టమ్స్ డ్యూటీని కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. దీంతో మొబైల్ ఫోన్ల ధరలు పెరగనున్నాయి. అటు కార్ల విడిభాగాల ధరలు కూడా పెరగనున్నాయి. ఇదే సమయంలో బంగారం, వెండి ధరలు తగ్గుతాయి. ఏప్రిల్ 1 నుంచి ఈ బడ్జెట్ అమలులోకి రానుండగా.. అప్పటి నుంచి ధరలు పెరుగుతాయి.
Read More »ఆ పథకాన్ని మరో ఏడాది పొడిగించిన కేంద్రం
ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం మరో ఏడాది పొడిగిస్తున్నట్లు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో తెలిపారు. దీంతో 2022 మార్చి 31 వరకు గృహాల కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం అందించే రాయితీలను పొందవచ్చు. అలాగే అందుబాటు ధరల్లో గృహాలు నిర్మించే సంస్థలకు పన్ను విరామం మరో ఏడాది పెరగనుంది. 2015లో ప్రారంభమైన ఈ పథకం ద్వారా ఇంటి రుణాలు తీసుకున్న వారికి వడ్డీపై కేంద్రం రాయితీ అందిస్తోంది.
Read More »సామాన్యుడికి షాకిచ్చిన 2021-22కేంద్ర బడ్జెట్
బడ్జెట్ లో సామాన్యుడికి ఎలాంటి ఊరట ఇవ్వని కేంద్ర ప్రభుత్వం భారీ షాకిచ్చే నిర్ణయం తీసుకుంది. లీటర్ పెట్రోల్ పై రూ.2.5, లీటర్ డీజిల్పై రూ.4 అగ్రి సెస్ విధిస్తున్నట్లు ప్రతిపాదనలు చేసింది. దీంతో పెట్రోల్, డీజిల్ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100కు చేరింది
Read More »