వరల్డ్ ఉమెన్స్ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన తెలంగాణ బాక్సర్ నిఖత్ జరీన్‌కు సీఎం కేసీఆర్ భారీ నజరానా ప్రకటించారు. ఆమెతో పాటు ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్‌లో గోల్డ్ మెడల్ సాధించిన ఇషా సింగ్‌కు కూడా నజరానా ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఇద్దరికీ చెరో రూ.2కోట్ల చొప్పున నగదు.. జూబ్లీహిల్స్ లేదా బంజారాహిల్స్‌లో ఇంటి లం కేటాయించాలని సీఎం ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు.
Read More »వరల్డ్ బాక్సింగ్‌లో తెలంగాణ అమ్మాయికి గోల్డ్ మెడల్
యువ బాక్సర్, తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్ చరిత్ర సృష్టించింది. టర్కీలోని ఇస్తాంబుల్‌లో జరుగుతున్న ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో ఆమె స్వర్ణం సాధించింది. బాక్సింగ్‌లో ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన తొలి తెలుగు అమ్మాయి నిఖత్ జరీన్. థాయిలాండ్‌కు చెందిన జిట్‌పాంగ్‌తో జరిగిన ఫైనల్‌లో 5-0తో ఆమె జయకేతనం ఎగురవేసింది. గేమ్‌లో తొలి నుంచి దూకుడుగా ఉన్న ఆమె ఏ దశలోనూ వెనక్కి తగ్గకుండా అదరగొట్టేసింది. నిఖత్ జరీన్ గెలుపుతో హైదరాబాద్‌లోని …
Read More »