ఆసియా అపరకుబేరుడు, ప్రపంచంలోనే నాలుగో అత్యంత సంపన్నుడు ముకేశ్ అంబానీ (63) మరో కీలక నిర్ణయంపై అడుగులు వేస్తున్నారు. వ్యాపార విస్తరణలో ఎదురు లేకుండా దూసుకుపోతున్న తన ముగ్గురు సంతానానికి వ్యాపార సామ్రాజ్య వారసత్వ బాధ్యతలను సమానంగా పంచేందుకు రంగంలోకి దిగిపోయారు. ఇందులో భాగంగానే త్వరలోనే ఫ్యామిలీ కౌన్సిల్ ఏర్పాటు చేస్తున్నారంటూ బిజినెస్ వర్గాల్లో చర్చ నడుస్తోంది. 80 బిలియన్ డాలర్లకు పైగా విలువ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ …
Read More »బీసీసీఐకి బలమైన పునాదులు
చైనా మొబైల్ సంస్థ ‘వివో’ ఈ ఏడాది ఐపీఎల్ స్పాన్సర్ షిప్ నుంచి తప్పుకున్నంత మాత్రాన బోర్డు ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోదని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పష్టం చేశాడు. బీసీసీఐ దగ్గర ఎప్పుడూ ప్లాన్ ‘బి’ ఉండనే ఉంటుందని వ్యాఖ్యానించాడు. ఒక వెబినార్‌లో అతడు మాట్లాడుతూ ‘నేను దీన్ని పెద్ద ఆర్థిక నష్టంలా భావించడం లేదు. ఇది కేవలం తాత్కాలిక సమస్య మాత్రమే. …
Read More »కరోనా వ్యాక్సిన్ పై గుడ్ న్యూస్ చెప్పిన రష్యా
కరోనా వ్యాక్సిన్‌పై జరుగుతున్న పరిశోధనల్లో రష్యా గొప్ప పురోగతి సాధించింది. ఈ నెల 12న వ్యాక్సిన్ అందుబాటులోకి రానుందని ఆ దేశ ఆరోగ్య శాఖ మంత్రి ఓలెగ్ గృందేవ్ ప్రకటించారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆ రోజు జరగనుందని తెలిపారు. దీంతో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెస్తున్న తొలి దేశంగా రష్యా చరిత్ర సృష్టించనుంది. గామలేయా సెంటర్‌లో దీనికి సంబంధించిన ప్రయోగాలు జరుగుతున్నాయని, మూడో దశలో ఉందని తెలిపారు. ముందుగా వైద్య వృత్తిలో …
Read More »ఎయిర్ ఇండియా విమానానికి ప్రమాదం
ఎయిర్ ఇండియా విమానానికి(IX-1344) ప్రమాదం జరిగింది. దుబాయ్ నుంచి కోజికోడ్ వస్తున్న ఎయిర్ ఇండియా విమానం కారిపూర్ ఎయిర్‌పోర్ట్ వద్ద రాత్రి 7:45 నిమిషాలకు ప్రమాదానికి గురైంది. ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి విమానం పక్కకు జరిగింది. దీంతో విమానం ముందు భాగం దెబ్బతింది. విమానం రెండు ముక్కలైంది. ప్రమాద సమయంలో విమానంలో ఆరుగురు సిబ్బందితో కలిపి మొత్తం 191 మంది ఉన్నారు. క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. భారీ వర్షం …
Read More »20లక్షలు దాటిన కరోనా కేసులు!
భారత్‌లో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కొవిడ్ కేసులు బయటపడుతున్నాయి. తాజాగా నిన్న ఒక్కరోజే అత్యధికంగా 62,498 కేసులు నమోదయ్యాయి. భారత్లో ఒక్కరోజులోనే 60వేల కేసులు దాటడం ఇదే తొలిసారి. అంతకుముందు జులై 31న అత్యధికంగా 57,151 కేసులు బయటపడ్డాయి. దీంతో శుక్రవారం నాటికి దేశంలో మొత్తం కరోనా కేసులసంఖ్య 20,27,034కు చేరింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు 13లక్షల 78వేల మంది కోలుకోగా, మరో 6లక్షల …
Read More »దేశంలో ఒకే రోజు 6.6లక్షల కరోనా టెస్టులు
గత 24 గంటల్లో కరోనా వైరస్ నిర్ధారణ కోసం 6.6లక్షలకుపైగా పరీక్షలు నిర్వహించడం ద్వారా భారత్ ఒకే రోజు అత్యధిక పరీక్షలను నమోదు చేసిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. కోవిడ్-19కి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో భారతదేశం గత 24 గంటల్లో 6,61,715 పరీక్షలను చేసిందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక ట్వీట్‌లో పేర్కొంది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం 2,08,64,206 నమూనాలను పరీక్షించినట్లు …
Read More »అయోధ్యలో భూమిపూజ పూజారికి కరోనా
అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆగస్టు 5వ తేదీన భూమిపూజ జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమం కోసం విధులు నిర్వర్తించే పోలీసులు, పూజారులకు కరోనా వైరస్ పరీక్షలు చేయించారు. దాంట్లో ఓ పూజారితో పాటు భద్రత కల్పించే 16 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది.
Read More »సీనియర్ నటి, ఎంపీ సుమలతకు కరోనా
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటి, మాండ్య MP సుమలత కు కరోనా సోకింది. కరోనా లక్షణాలు కనిపించడంతో పరీక్షలు నిర్వహించారు.. ఆమెకు పాజిటివ్ అని తేలింది. ఎంపీగా ఉన్న ఆమె.. కరోనా వ్యాధి పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ క్రమంలోనే శనివారం ఆమెకు తలనొప్పి గొంతు నొప్పి వచ్చాయి. దీంతో కరోనా పరీక్షలు చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హోం ఐసోలేషన్లో ఉన్న ఆమె. …
Read More »దేశంలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు
కరోనా వైరస్ మహమ్మారి భారత్‌లో విలయతాండవం సృష్టిస్తోంది. గత కొన్ని రోజులుగా నిత్యం దాదాపు 20వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా గడిచిన 24గంటల్లోనే దేశవ్యాప్తంగా కొత్తగా 19,459 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అంతేకాకుండా మరో 380మంది చనిపోయారు. దీంతో సోమవారం నాటికి దేశంలో కరోనావైరస్ కేసుల సంఖ్య 5,48,318కి చేరింది. వీరిలో ఇప్పటివరకు మొత్తం 16,475మంది మృత్యువాతపడ్డట్లు కేంద్ర ఆరోగ్య, కుటుంబ మంత్రిత్వశాఖ వెల్లడించింది. మొత్తం బాధితుల్లో ఇప్పటివరకు …
Read More »మహారాష్ట్రలో 5024.. దిల్లీలో 3460 కొత్త కేసులు
మహారాష్ట్ర, దిల్లీలలో కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తోంది. ఈ రోజు మహారాష్ట్రలో కొత్తగా 5024 పాజిటివ్ కేసులు, 175 మరణాలు నమోదు అయ్యాయి. దిల్లీ నగరంలో కొత్తగా 3460 కేసులు, 63 మరణాలు నమోదయ్యాయి. దీంతో దిల్లీలో మొత్తం కేసుల సంఖ్య 77240కి పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 47091 మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 2492 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 27657 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Read More »