తెలంగాణ రాష్ర్టంలోని కొత్త వైద్య, నర్సింగ్ కాలేజీలకు సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తాత్కాలికంగా సిబ్బందిని నియమించుకునేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏడు మెడికల్ కాలేజీలకు 2,135 పోస్టులు, 13 కొత్త, 2 పాత నర్సింగ్ కాలేజీలకు 900 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం.. ఈ నియామకాలను తాత్కాలిక ప్రతిపాదికన చేపట్టాలని ఆదేశించింది. 2022 మార్చి నెలాఖరు వరకు సేవల వినియోగానికి అనుమతి ఇచ్చింది.
Read More »