భారతదేశానికి స్వాతంత్యం వచ్చి 68 ఏళ్లు అవుతున్నా ఎస్సీ, ఎస్టీలపై ఇంకా దాడులు, అత్యాచారాలు జరుగుతూనే ఉండడం తీవ్ర బాధాకరమని ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరుగుతున్నాయన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ 111వ జయంతి సందర్భంగా ఎల్బీ స్టేడియం వద్ద ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. …
Read More »