ఊరూరా కొలువై ఉన్న కోదండ రాముడికి ఆయన జన్మించిన అయోధ్య నగరంలో దివ్య మందిరాన్ని నిర్మించేందుకు బుధవారం అంకురార్పణ జరగబోతోంది. వేద పఠనం, మంత్రోచ్ఛరణల మధ్య బుధవారం మధ్యాహ్నం 12 గంటల 44 నిమిషాల 8 సెకన్లకు అభిజిత్ లగ్నంలో ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా దాదాపు 40 కిలోల వెండి ఇటుకతో ఆలయానికి శంకుస్థాపన చేస్తారు. అంతకుముందు ఆంజనేయ ఆలయంలో పూజలు చేస్తారు. భూమి పూజ కార్యక్రమంలో గంగా, …
Read More »జిమ్‌లు , యోగా సెంటర్లకు మార్గదర్శకాలు విడుదల చేసిన కేంద్రం
అన్‌లాక్ 3.0 మార్గదర్శకాలను కేంద్ర హోం శాఖ జారీ చేసింది. అందులో భాగంగా ఆగస్టు 5 నుంచి జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరుచుకోనున్నాయి. తాజాగా వీటి నిర్వహణపై అనుసరించాల్సిన విధి విధానాలకు సబంధించిన మార్గదర్శకాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కంటెయిన్‌మెంట్ ప్రాంతాల్లో ఉన్న జిమ్‌లు, యోగా కేంద్రాలు తెరిచేందుకు అనుమతి లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన విధి విధానాలు జిమ్‌లు, యోగా కేంద్రాలు …
Read More »కేంద్రం సంచలన నిర్ణయం..కరోన కట్టడి కోసం ఆ రాష్ట్రాల్లో ఇంటింటి సర్వే
దేశవ్యాప్తంగా కొన్ని నగరాలు, పట్టణాల్లో కొవిడ్-19 పరిస్థితి దారుణంగా ఉండటంతో కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. ఇంటింటి సర్వే చేపట్టడం, వెంటనే పరీక్షలు నిర్వహించడం, వైరస్ వ్యాప్తి, మరణాలను కట్టడి చేయడంపై దృష్టి పెట్టాలని సూచించింది. పది రాష్ట్రాల్లోని 38 జిల్లాల్లో 45 స్థానిక సంస్థలకు ఈ మేరకు దిశానిర్దేశం చేసింది. జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లు, జిల్లా ఆస్పత్రుల సూపరింటెండెంట్, వైద్య కళాశాలల ప్రిన్సిపల్స్‌తో కేంద్ర ఆరోగ్యశాఖ …
Read More »బడి గంట మ్రోగేది అప్పుడేనా..
దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో బోధన ఆగస్టు తర్వాత ప్రారంభం కావచ్చని కేంద్ర మానవవనరుల శాఖ మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ ప్రకటించారు. అయితే, కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో హోంశాఖ అనుమతించిన మీదటే నూతన విద్యా సంవత్సరంలో కార్యకలాపాలు మొదలుపెడతామని ఆయన స్పష్టం చేశారు. కొవిడ్-19 పరిస్థితులను పూర్తిగా అంచనా వేసిన అనంతరం మాత్రమే.. ఈ అంశంపై నిర్ణయం సాధ్యమని మంత్రి అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా విశ్వవిద్యాలయాలలో బోధన కూడా ఆగస్టు తర్వాతనే …
Read More »లాక్‌డౌన్-3కి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు
డౌన్-3 నిర్ణయానికి ముందే కేంద్ర హోం శాఖ తాజా ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేక రైళ్ల ద్వారా వలస కార్మికులను, యాత్రికులను, విద్యార్ధులను తరలించడానికి ప్రత్యేక రైళ్లు నడిపేందుకు అనుమతినిచ్చారు. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలకు రైల్వే శాఖ సహకరిస్తుంది. నోడల్ అధికారులు రైల్వేకు, రాష్ట్ర ప్రభుత్వాలకు మధ్య సంయోజకులుగా ఉంటారు. టికెట్ల విక్రయాలపై రైల్వే శాఖ మార్గదర్శకాలు విడుదల చేస్తుంది. వలస కార్మికులు, విద్యార్ధుల తరలింపు సమయంలో నిబంధనలు …
Read More »లాక్ డౌన్ నుండి వీటికి మినహాయింపు
లాక్‌డౌన్ నుంచి మరికొన్ని రంగాలకు మినహాయింపునిస్తూ కేంద్రం శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ప్రకటించిన మినహాయింపులకు అదనంగా ఇవి ఉంటాయని పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మాణ కార్యక్రమాలు, నీటి సరఫరా, పారిశుద్ధ్య రంగానికి చెందిన నిర్మాణ పనులు, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు, కో ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీల కార్యకలాపాలకు తాజాగా అనుమతినిచ్చింది. కలపేతర అటవీ ఉత్పత్తుల సేకరణ, కొనుగోలు, ప్రాసెసింగ్.. తదితరాలకు కూడా అనుమతినిచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లోని …
Read More »లాక్‌డౌన్ మార్గదర్శకాలు విడుదల
దేశవ్యాప్తంగా మే 3 వరకు లాక్‌డౌన్ కొనసాగనున్న నేపథ్యంలో అనుసరించాల్సిన మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. హాట్‌స్పాట్ ప్రాంతాల్లో ప్రత్యేక మార్గదర్శకాలను ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుందని ప్రకటించింది. ఈ ప్రాంతాల్లో సాధారణ మార్గదర్శకాలు, అనుమతులు పనిచేయవని, నిత్యావసరాల పంపిణీ మినహా ఎలాంటి కార్యకలాపాలు ఉండవని తెలిపింది. మే 3 వరకు అన్ని విమానాలు, రైళ్లు, బస్సులు, మెట్రో రైల్ సర్వీసులు రద్దు చేస్తున్నామని వెల్లడించింది. విద్యాసంస్థలు, …
Read More »రాష్ర్టాలు 30 వరకే.. కానీ కేంద్రం లాక్‌డౌన్ 3 రోజులు ఎందుకు పొడిగించిందంటే?
కరోనా వైరస్‌ను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు అన్ని రాష్ర్టాలు పకడ్బందీ చర్యలు తీసుకున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో లాక్‌డౌన్ పొడిగించకపోతే కరోనా మహమ్మారి విజృంభించే అవకాశం ఉందని ఆయా రాష్ర్టాలు ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించాయి. కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్ పొడిగింపు వంటి అంశాలపై చర్చించేందుకు రెండు రోజుల క్రితం ప్రధాని మోదీ రాష్ర్టాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం విదితమే. ఏప్రిల్ 30 వరకు లాక్‌డౌన్ …
Read More »కోవిడ్-19పై విజయం సాధించేందుకు మోదీ చెప్పిన ఏడు సూత్రాలు
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్(కోవిడ్-19)పై విజయం సాధించేందుకు ప్రతి భారతీయుడు పాటించాల్సిన ఏడు ముఖ్యమైన సూత్రాలను ప్రధాని మోదీ సూచించారు. మంగళవారం జాతిని ఉధ్దేశించి చేసిన ప్రసంగంలో కరోనా వ్యాప్తిని అరికట్టేందకు విధించిన లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకూ పొడిస్తున్నామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రజలు పాటిస్తున్న నిబంధనలు అన్ని అప్పటివరకూ కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. అయితే తన ప్రసంగాన్ని ముగించే ముందు ప్రతీ భారతీయుడు పాటించాల్సిన …
Read More »మే 3వరకు లాక్ డౌన్ పొడిగింపు
కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు, కేంద్ర ప్రభుత్వం తొలుత ప్రకటించిన 21 రోజుల లాక్‌డౌన్ గడువు ఇవాల్టితో పూర్తవుతుంది. ఈ లాక్ డౌన్‌ను లాక్‌డౌన్‌ను మే 3వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారు.
Read More »